Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Tomato dhaniya shorba: చలికాలంలో తప్పక తాగాల్సిన సూప్..చేసుకోవడం ఎలాగో చూడండి
నార్త్ ఇండియాలో చాలా రాష్ట్రాల్లో చలికాలంలో ప్రజలు ఎక్కువగా తాగే సూప్ టమాటో ధనియా షోర్బా..దీనిని మనం టమాటో కొత్తిమీర సూప్ అని పిలుస్తాము. కశ్మీర్,బీహార్,యూపీ రాష్ట్రాల్లో ప్రజలు దీన్ని ఎక్కువగా తాగుతుంటారు. ఇది స్వచ్ఛమైన దేశీయ సూప్, ఘుమఘుమలాడుతూ భలే ఉంటుంది. దీనిని తాడం వల్ల చలి వల్ల కలిగే ఇబ్బందుల నుంచి స్వాతంతన లభిస్తుంది. చలికాలంలో ఈ సూప్ వేడి వేడిగా గొంతులో పడితే మాటల్లో చెప్పలేని అనుభూతి ఉంటుంది. టమాటో కొత్తిమీర సూప్ తయారీకి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
టమాటో కొత్తిమీర సూప్ తయారీకి కావాల్సిన పదార్థాలు
-టమాటో
-పచ్చిమిర్చి
-కొత్తిమీర
-గోధుమపిండి
-కారం
-యాలకులు
-అల్లం
-చెక్క
-మిరియాలు
-బిర్యానీ ఆకు
-లవంగం
-నూనె
-నెయ్యి
-వెల్లుల్లి

టమాటో కొత్తిమీర సూప్ తయారీ విధానం
-ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో 1 టీస్పూన్ నూనె,అర టీ
స్పూన్ నెయ్యి వేసి అది కొంచెం వేడయ్యాక అందులో 3 దంచిన వెల్లుల్లి,3
యాలకులు,అర ఇంచు దంచిన అల్లం,చిన్న దాల్చిన చెక్క,1 బిర్యానీ ఆకు,అర
చెంచా మిరియాలు, 2 లవంగాలు వేసి బాగా ఫ్రై చేసుకోండి.
-కొంచెం ఫ్రై అయిన వెంటనే అందులో 1 టీస్పూన్ గోధుమ పిండి వేసి అది ఎర్రగా మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోండి. ఈ సమయంలో మంటలను లో ప్లేమ్ లో ఉంచండి.
-తర్వాత అందులో కట్ చేసిన 3 పెద్ద టమాటో ముక్కలు వేసి 3-4నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి.
-తర్వాత అందులో 75 గ్రామల వరకు కేవలం కొత్తిమీర కాడలు(వేర్లతో సహా),అర చెంచా కారం,2 పచ్చిమిర్చి వేసి కలుపుకోండి.
-టమాటో గుజ్జుగా అయ్యేంతవరకు నిదానంగా మగ్గించుకోండి.
-టమాటోలు గుజ్జుగా అయ్యాక అందులో అర లీటర్ నీళ్లు పోసి మంటలను లో ప్లేమ్ మీద పెట్టి నిదానంగా మరగనివ్వండి.
-బాగా మరిగిన తర్వాత ఓ బౌల్ మీద జల్లెడ పెట్టి అందులో ఇదంతా వేసి గరిటతో బాగా నలుపుతూ సారాన్ని అంతా వడకట్టండి. టమాటో కొత్తిమీర సూప్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications