Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
హై ప్రొటీన్ అందించే సూపర్ టేస్టీ స్నాక్..నల్ల శెనగల చాట్ ఎలా చేసుకోవాలంటే..
సాయంత్రం వేళల్లో ఆకలి వేసినప్పుడు, మనలో చాలా మంది నూనెలో వేయించిన చిరుతిళ్లు (జంక్ ఫుడ్) లేదా బేకరీ ఐటమ్స్ వైపు మొగ్గు చూపుతారు. కానీ ఇవి ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. ఇలాంటి సమయంలో రుచితో పాటు శరీరానికి కావలసిన శక్తిని, ప్రొటీన్ ను అందించే ఒక చక్కటి ప్రత్యామ్నాయం నల్ల శెనగల చాట్.
ఇది బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిస్ ఉన్నవారికి ఒక దివ్యౌషధం లాంటిది. తెల్ల శెనగలతో పోలిస్తే, నల్ల శెనగల్లో పీచు పదార్థం, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. నల్ల శెనగల చాట్ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
నల్ల శెనగలు: 1 కప్పు (రాత్రంతా నానబెట్టినవి)
నీళ్లు: ఉడికించడానికి సరిపడా
ఉప్పు: రుచికి సరిపడా
ఉల్లిపాయ: 1
టమాటా: 1 పెద్దది
కీర దోస: అర కప్పు
పచ్చిమిర్చి: 1 లేదా 2
ఉడికించిన బంగాళాదుంప: 1
కరివేపాకు
కొత్తిమీర
కారం పొడి: అర టీస్పూన్
ధనియాల పొడి: అర టీస్పూన్
జీలకర్ర పొడి (వేయించినది): అర టీస్పూన్
చాట్ మసాలా: 1 టీస్పూన్
నల్ల ఉప్పు: చిటికెడు
అమ్చూర్ పౌడర్ (ఎండిన మామిడి పొడి): పావు టీస్పూన్
నిమ్మరసం: 2 టీస్పూన్లు
ఆలివ్ ఆయిల్ లేదా నెయ్యి: 1 టీస్పూన్
తయారీ విధానం
-ముందుగా ఒక కప్పు నల్ల శెనగలను తీసుకుని, రెండు సార్లు నీటితో శుభ్రంగా కడగాలి. తర్వాత సరిపడా మంచి నీళ్లు పోసి సుమారు 8 గంటలు లేదా రాత్రంతా నానబెట్టాలి.
-నానిన శెనగలను కుక్కర్ లో వేసి నీళ్లు పోయాలి. దీనిలో అర టీస్పూన్ ఉప్పు వేయాలి..కుక్కర్ మూత పెట్టి సుమారు 4-5 విజిల్స్ వచ్చే వరకు మీడియం మంటపై ఉడికించాలి.
-ఉడికిన తర్వాత ఒక శెనగ గింజను పట్టుకుని నొక్కి చూస్తే మెత్తగా మాష్ అవ్వాలి. అలా ఉడికితేనే చాట్ రుచిగా ఉంటుంది. నీటిని వడకట్టి శెనగలను పక్కన పెట్టుకోండి.
-తర్వాత స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకోండి. అందులో కేవలం 1 టీస్పూన్ నూనె వేయండి. నూనె వేడెక్కాక అందులో చిటికెడు జీలకర్ర, ఇంగువ,సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించండి. తర్వాత ఉడికించిన నల్ల శెనగలను పాన్ లో వేయండి.
-తర్వాత మంటను సిమ్ లో పెట్టి కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా ఉప్పు కలపండి. రెండు నిమిషాలు వేయించి స్టవ్ ఆఫ్ చేయండి. దీనిని ఒక పెద్ద బౌల్ లోకి తీసుకోండి. శెనగలు కొద్దిగా చల్లారనివ్వాలి. మరీ వేడిగా ఉన్నప్పుడు కూరగాయలు వేస్తే అవి మెత్తబడిపోతాయి.
-గోరువెచ్చగా ఉన్న శెనగల మిశ్రమంలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కీరదోస ముక్కలను వేయండి. మీకు ఇష్టమైతే ఉడికించిన బంగాళాదుంప ముక్కలను కూడా కలపండి. ఇప్పుడు చాట్ మసాలా, నల్ల ఉప్పు చల్లండి. ఈ రెండూ చాట్ రుచిని రెట్టింపు చేస్తాయి.
-చివరగా అందులో నిమ్మరసం పిండండి. పులుపు మీ రుచికి తగినట్లుగా సర్దుబాటు చేసుకోండి. సన్నగా తరిగిన కొత్తిమీరను చల్లండి. అన్నింటినీ బాగా కలపండి. అంతే శెనగల చాట్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications