Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
హై ప్రొటీన్ బ్రేక్ ఫాస్ట్..ఉదయాన్నే ఈ మొలకల సలాడ్ తింటే.. కొవ్వు ఇట్టే కరిగిపోతుంది!
ఈ రోజుల్లో బరువు తగ్గడం అనేది చాలా మందికి ఒక పెద్ద సవాలుగా మారింది. జిమ్ కసరత్తులతో పాటు సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఇక్కడే పెసల మొలకలు ఒక అద్భుతమైన సూపర్ ఫుడ్ లా పని చేస్తాయి.
ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండే మొలకలు, ఆరోగ్యకరమైన అల్పాహారంగా మాత్రమే కాకుండా, బరువు తగ్గించే దివ్యౌషధంగా కూడా పరిగణించబడుతున్నాయి. మరి వీటిని ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలి? వీటితో రుచికరమైన వంటకాలను ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి. బయట కొనుగోలు చేసే పనిలేకుండా, ఇంట్లోనే పరిశుభ్రంగా మొలకలను పెంచుకోవచ్చు.

ముందుగా పెసలను రాత్రంతా నీటిలో నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం ఆ నీటిని పూర్తిగా వడకట్టేయాలి. ఇప్పుడు నానిన పెసలను ఒక తడి కాటన్ లేదా మస్లిన్ వస్త్రంలో వేసి, గట్టిగా మూట కట్టాలి. ఈ మూటను వెచ్చని ప్రదేశంలో ఉంచండి లేదా ఏదైనా గిన్నెతో కప్పి ఉంచండి. ఇలా 1-2 రోజులు ఉంచితే చాలు. మధ్యలో ఒకసారి తనిఖీ చేయండి. వస్త్రం లేదా పప్పు మరీ ఎండిపోయినట్లు అనిపిస్తే కాస్త నీళ్లు చల్లండి. కేవలం రెండు రోజుల్లోనే పొడవాటి, ఆరోగ్యకరమైన మొలకలు సిద్ధమవుతాయి.
ఈ మొలకలతో 3 రకాల రుచికరమైన బ్రేక్ పాస్ట్ లు
స్పైసీ వెజిటబుల్ మొలకల చాట్
మొలకలను పచ్చిగా తినడం వల్ల వాటిలోని పోషకాలు పూర్తిగా మన శరీరానికి
అందుతాయి.
-ఒక గుప్పెడు మొలకలను బౌల్ లో తీసుకోండి.
-అందులో సన్నగా తరిగిన దోసకాయ, టమోటా, ముల్లంగి, ఉల్లిపాయ,
పచ్చిమిర్చి ముక్కలను కలపండి.
-ఉడికించిన మొక్కజొన్న, బీట్ రూట్ ముక్కలు, పన్నీర్
ముక్కలను జోడించండి.
-చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర, చిటికెడు చాట్ మసాలా, నల్ల
ఉప్పు,నిమ్మరసం పిండుకుని కలపండి. ఇది ఎంతో రుచికరంగా ఉండటమే కాకుండా,
కడుపు నిండిన భావనను కలిగించి బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
ఫ్రూటీ స్ప్రౌట్స్ సలాడ్ (తీపి ప్రియుల కోసం)
-ఒక గుప్పెడు మొలకల్లో సన్నగా తరిగిన ఆపిల్ ముక్కలు, ద్రాక్ష, దానిమ్మ గింజలను కలపండి.
-అందులో బీట్ రూట్ ముక్కలు, పన్నీర్, దోసకాయలను కూడా వేసుకోవచ్చు. కానీ ఉల్లిపాయలు, టమోటాలు లేదా పచ్చిమిర్చిని అస్సలు వేయవద్దు.
-చివరగా కొంచెం చాట్ మసాలా, ఉప్పు, నిమ్మరసం జోడించి ఆస్వాదించండి. ఇది ఉదయం పూట మంచి ఎనర్జీ బూస్టర్ లా పనిచేస్తుంది.
తాలింపు మొలకలు
-కొంతమందికి పచ్చి మొలకలు తినడం ఇబ్బందిగా అనిపించవచ్చు. అటువంటి వారి కోసం ఈ మూడవ పద్ధతి బాగుంటుంది.
-ఒక పాన్ లో 1 టేబుల్ స్పూన్ వెన్న లేదా ఆవాల నూనె వేడి చేయండి.
-అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమోటాలను వేసి వేయించండి.
-తర్వాత మొలకలను వేసి, రుచికి సరిపడా ఉప్పు కలపండి.
-మూత పెట్టి సుమారు 10 నిమిషాలు సన్నని మంటపై మగ్గనివ్వండి.
-చివరగా చాట్ మసాలా, నిమ్మరసం జోడించండి.
-ఈ వేయించిన మొలకలు చాలా మృదువుగా, రుచిగా ఉంటాయి. జీర్ణక్రియకు కూడా ఇవి చాలా మంచివి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications