Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
పాలకూర,శెనగపిండితో హై ప్రొటీన్ బ్రేక్ ఫాస్ట్..బరువు తగ్గడం ఈజీ..15 నిమిషాల్లో ఎలా చేసుకోవాలంటే..
పొద్దున్నే మనం ఏం తింటున్నాం అనేదానిపైనే మన రోజంతా ఎలా ఉంటదనేది ఆధారపడి ఉంటుంది. రోజంతా మనల్ని ఉత్సాహంగా ఉంచడంలో అల్పాహారం కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు, ప్రోటీన్ అధికంగా ఉండే అల్పాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అలాంటి వారికి పాలకూర శెనగపిండితో చేసే దోసె ఒక అద్భుతమైన ఎంపిక.
శెనగపిండిలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది, పాలకూరలో ఫైబర్, విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. ఈ రెండింటి కలయికతో చేసే దోసె చాలా సేపటి వరకు కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది..తద్వారా అనవసరమైన స్నాక్స్ తినకుండా నియంత్రిస్తుంది. దీంతో బరువు తగ్గడానికి సాయపడుతుంది. ఇది తయారుచేయడం కూడా చాలా సులభం. కేవలం 15 నిమిషాల్లోనే దీనిని ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి

కావలసిన పదార్థాలు
శెనగపిండి - 1 కప్పు
పాలకూర - 1 కప్పు
ఉల్లిపాయ - పావు కప్పు
పచ్చిమిర్చి - 1-2
అల్లం-వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
వాము-అర టీస్పూన్
పసుపు -పావు టీస్పూన్
కారం - అర టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్లు
నీళ్లు - పిండి కలపడానికి సుమారు 1 కప్పు
నూనె లేదా నెయ్యి - కొద్దిగా
తయారీ విధానం
-ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో శెనగపిండి, ఉప్పు, పసుపు, కారం, వాము వేసి బాగా కలపండి. వామును చేతిలో కొద్దిగా నలిపి వేస్తే మంచి సువాసన వస్తుంది.
-ఇప్పుడు అదే గిన్నెలో సన్నగా తరిగిన పాలకూర, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర వేసి పిండితో బాగా కలపండి.
-కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ, ఉండలు లేకుండా పిండిని బాగా కలపాలి. పిండి మరీ పల్చగా కాకుండా కొంచెం చిక్కగా ఉండేలా చూసుకోవాలి. ఈ పిండిని 10-15 నిమిషాల పాటు పక్కన పెడితే, పిండి బాగా నాని దోసె మృదువుగా వస్తుంది.
-స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ పెనం పెట్టి మీడియం మంట మీద వేడి చేయండి. పెనం వేడెక్కిన తర్వాత కొన్ని చుక్కల నూనె వేసి టిష్యూతో లేదా ఉల్లిపాయతో రుద్దండి.
-ఒక గరిటెడు పిండిని తీసుకుని పెనం మధ్యలో వేసి గరిటెతో గుండ్రంగా, పల్చగా దోశలా పరచండి. దాని చుట్టూ అర టీస్పూన్ నూనె వేసి మీడియం మంట మీద కింద వైపు బంగారు రంగులోకి మారేవరకు కాల్చండి.
-కింద వైపు కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పి మరో నిమిషం పాటు కాల్చండి. పాలకూర శెనగపిండి దోసె రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications