Latest Updates
-
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు!
రైస్, రోటీ,చపాతీలోకి పర్ఫెక్ట్..అదిరిపోయే గోంగూర మీల్ మేకర్ కర్రీ ఎలా చేసుకోవాలంటే
భారతీయ వంటకాల్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆకుకూరలకు ప్రత్యేక స్థానం ఉంది. అందులోనూ ఆంధ్రా మాతగా పిలవబడే గోంగూర అంటే ఇష్టపడని వారు ఉండరు. గోంగూరలోని పుల్లటి రుచి, మాంసాహారానికి ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటుంది. మరోవైపు శాఖాహారులకు మాంసాహారం స్థాయి ప్రోటీన్ అందించే పదార్థం మీల్ మేకర్.
ఆ రెండింటి కలయికతో చేసే సోయా గోంగూర కర్రీ అద్భుతమైన రుచిని ఇవ్వడమే కాకుండా, శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలను అందిస్తుంది. సోయా గోంగూర కర్రీని అన్నం, చపాతీ, లేదా పుల్కాలతో తింటే చాలా రుచిగా ఉంటుంది. బిర్యానీలో కూడా దీనిని సైడ్ డిష్ గా వాడుకోవచ్చు.

తయారీకి కావలసిన పదార్థాలు
సోయా చంక్స్: 1 కప్పు
గోంగూర: 3 పెద్ద కట్టలు
ఉల్లిపాయలు: 2
పచ్చిమిర్చి: 4-5
టమాటా: 1
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టేబుల్ స్పూన్
కారం: ఒకటిన్నర టేబుల్ స్పూన్
పసుపు: చిటికెడు
ధనియాల పొడి: 1 టీస్పూన్
గరం మసాలా: అర టీస్పూన్
నూనె: 3-4 టేబుల్ స్పూన్లు
ఉప్పు: రుచికి సరిపడా
పోపు దినుసులు: ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు
తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో నీళ్లు పోసి బాగా మరిగించాలి. నీళ్లు మరిగిన తర్వాత స్టవ్ ఆపి అందులో సోయా చంక్స్ ను వేయాలి. ఒక 10-15 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి.
-తర్వాత సోయా చంక్స్ ను వేడి నీళ్ల నుండి తీసి, చల్లటి నీటిలో రెండుసార్లు కడగాలి. సోయాలోని నీటిని గట్టిగా పిండేయాలి. పిండిన తర్వాత సోయా ముక్కలు మరీ పెద్దగా ఉంటే రెండుగా కోసుకోవచ్చు.
-గోంగూర ఆకులను శుభ్రంగా కడిగి ఒక పాత్రలో వేసి, కొద్దిగా నీళ్లు, పచ్చిమిర్చి వేసి మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికిన గోంగూరను పప్పు గుత్తితో లేదా మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
-స్టవ్ మీద బాండీ పెట్టి నూనె వేడి చేయాలి. నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.
-ఉల్లిపాయ ముక్కలు బంగారు రంగులోకి మారాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తర్వాత టమాటా ముక్కలు వేసి మెత్తబడే వరకు మగ్గించాలి. ఇప్పుడు ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి వేసి బాగా కలపాలి.
-ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న సోయా చంక్స్ ను అందులో వేసి, మసాలా అంతా ముక్కలకు పట్టేలా 2-3 నిమిషాలు వేయించాలి.
-ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న గోంగూర పేస్ట్ ను అందులో వేసి బాగా కలపాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి సన్నని మంటపై 5-7 నిమిషాలు ఉడికించాలి. చివరగా గరం మసాలా చల్లి, నూనె పైకి తేలే వరకు ఉడికించి స్టవ్ ఆపేయాలి.
-కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఘమఘమలాడే సోయా గోంగూర కర్రీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications