Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
హై ప్రొటీన్ స్ప్రౌట్ సలాడ్..భల్లాలదేవలా బలమైన శక్తి,బరువు తగ్గొచ్చు..ఇలా చేసుకోండి
ప్రస్తుతం అందరిలోనూ ఆరోగ్యంపై శ్రద్ద పెరిగింది. మన దగ్గర చాలామంది ఉదయాన్నే ఇడ్లీ,దోసె, బోండా, ఫ్రూట్స్‌తో తయారు చేసిన సలాడ్స్ వంటివి తింటుంటారు. అయితే శరీరం ఆరోగ్యంగా దృఢంగా ఉండాలంటే మాత్రం వాటికి బదులుగా మొలకెత్తిన గింజలు,విత్తనాలు,మరికొన్నింటితో తయారు చేసే స్ప్రౌట్ సలాడ్ చాలా ఉత్తమమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మొలకెత్తిన గింజల్లో అధిక మోతాదులో పోషకాలు, ఇతర మూలకాలు లభిస్తాయి. అనేక వ్యాధులను నియంత్రించే,బరువు తగ్గడానికి కూడా సహాయపడే స్ప్రౌట్ సలాడ్ ఎలా రెడీ చేసుకోవాలో ఇక్కడ చూడండి.
స్ప్రౌట్ సలాడ్ తయారీకి కావాల్సిన పదార్థాలు
-యోగర్ట్(పెరుగులో ఒక రకం)
-తేనె
-ఆలివ్ ఆయిల్
-నల్ల మిరియాలు
-ఉల్లిపాయ
-పచ్చిమిర్చి
-చనా మొలకలు
-నిమ్మరసం
-పెసల మెలకలు
-లెట్యూస్ ఆకులు
-పచ్చి బఠాణీ
-కీర దోసకాయ
-దానిమ్మ
-పిజ్జా సీజనింగ్
-ఉప్పు
-వెల్లుల్లి

స్ప్రౌట్ సలాడ్ తయారీ విధానం
-ముందుగా ఒక బౌల్ లో 50 గ్రాముల యోగర్ట్(పెరుగులో మరో రకం) వేయండి.
-అందులోనే 1 టేబుల్ స్పూన్ తేనె,1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1/8 టేబుల్ స్పూన్ నల్లమిరియాలు,తగినంత ఉప్పు వేసి కలపండి.
-ఇందులోనే 1/4 టేబుల్ స్పూన్ పిజ్జాకు రుచిని పెంచడానికి ఉపయోగించే మసాలా దినుసులు(pizza seasoning), 1/2టీస్పూన్ కట్ చేసిన వెల్లుల్లి ముక్కలు వేసి మొత్తం అన్నీ కలిసేలా బాగా కలపాలి.
-ఇప్పుడు ఓ పెద్ద బౌల్ లో ఉడకబెట్టిన పెసలు మొలకలు 70 గ్రాములు,చనా మొలకలు 70 గ్రాములు, ఉడికించిన పచ్చి బఠాణీలు 50 గ్రాములు, ఉల్లిపాయ ముక్కలు 50 గ్రాములు, కీర దోసకాయ ముక్కలు 60 గ్రాములు,దానిమ్మ 50 గ్రామలు, టమాటో 50 గ్రాములు,లెట్యూస్ ఆకులు 40 గ్రాములు, 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి.
-ఇందులోనే ఆల్రెడీ కలిపి ఉంచుకున్న యోగర్ట్ మిశ్రమాన్ని కూడా వేసి కలపండి. హై ప్రొటీన్ మొలకల సలాడ్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications