Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
Coriander Chicken Roast: చల్లటి వాతావరణంలో కొత్తిమీర చికెన్ రోస్ట్.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎలా చే
ఓ వైపు చలికాలం, మరోవైపు పెంగల్ తుఫాను కలిసి వాతావరణం మొత్తాన్ని చల్లగా మార్చేశాయి. ఈ చల్లని వాతావరణంలో వేడి వేడిగా ఏదైనా తినాలని అనిపిస్తూ ఉంటుంది. అలాంటి వాటిలో ముఖ్యమైనది చికెన్. చికెన్‌తో ఏ వంటకం చేసినా అది అద్భుతమైన రుచితో ఉంటుంది. ఎంత తిన్నా బోర్ కొట్టదు కూడా. అన్నం లేకపోయినా స్నాక్ లాగా ఈ చికెన్ తినేయొచ్చు. ఈ చికెన్‌ని కొత్తిమీరతో కలిపి చేసుకుంటే ఆ రుచి ఇంకా డబల్ అవుతుంది. అయితే ఈ కొత్తిమీర చికెన్ రోస్ట్ ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఏ విధమైన పద్దతిలో దీనిని చేసుకోవాలి అనేది ఈ స్టోరీలో ఇచ్చాము ఓసారి చూడండి.
కొత్తిమీర చికెన్ రోస్ట్ తయారీకి కావాల్సిన పదార్థాలు
- అరకిలో చికెన్
- ఒక స్పూన్ కారం
- పావు స్పూన్ పసుపు
- ఒక స్పూన్ గరం మసాలా
- రుచికి సరిపడా ఉప్పు
- రెండు స్పూన్ల నూనె
- కొద్దిగా కొత్తిమీర
- ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్

కొత్తిమీర చికెన్ రోస్ట్ తయారీ విధానం
ముందుగా మనం తెచ్చి పెట్టుకున్న అరకిలో చికెన్ ముక్కలను మీడియం ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. అనంతరం వాటిని శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆ గిన్నెలో కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. అలా మ్యారినేట్ చేసుకున్న చికెన్‌లో సన్నగా తరుగుకున్న కొత్తిమీరను బాగా కలుపుకోవాలి. అలా కొత్తిమీరతో పాటు మ్యారినేట్ చేసుకున్న చికెన్‌ను ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో చికెన్ రోస్ట్ చేసుకోవడానికి సరిపడా నూనె వేసుకోవాలి. ఆ నూనె వేడయ్యాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న అరకిలో చికెన్ వేసుకోవాలి. ఒక్కసారి కలుపుకోవాలి. ఇలా మీడియం మంట మీద చికెన్ ఒక పావు గంట సేపు ఫ్రై చేశాక, అందులో మిగిలిపోయిన కొత్తిమీర తరుగును వేసుకోవాలి. అనంతరం ఆ కొత్తిమీర మొత్తం చికెన్‌కు పట్టుకునే విధంగా ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేయాలి.
అలా మూత తీస్తూ, కప్పుతూ మధ్య మధ్యలో కలుపుతూ ఒక నలభై నిమిషాల పాటు చికెన్‌ను ఉడికించుకోవాలి. ఇందులో ఎట్టి పరిస్థితుల్లోనూ నీళ్లు వేసుకోవద్దు. నీళ్లు పోసుకుంటే అది ఇగురు మాదిరిగా తయారవుతుంది. అందుకే నీళ్లు లేకుండా డ్రై రోస్ట్ మాదిరిగా చేసుకోవాలి. ఇలా చేసుకుంటేనే చికెన్ టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. అలా చికెన్ మొత్తం ఉడికినట్లు నిర్ధారించుకున్న తరువాత దానిని స్టవ్ మీద నుంచి కిందకు దించుకుంటే కొత్తిమీర చికెన్ రోస్ట్ సిద్ధమైనట్లే. ఇది నేరుగా తిన్నా ఎంతో రుచికరంగా ఉంటుంది. లేదా సాంబార్ రైస్‌తో కలుపుకొని తిన్నా అద్భుతంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications