Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
బంగాళదుంపలు, గుడ్లు ఉడకబెట్టేటప్పుడు ఈ తప్పు చేస్తున్నారా? పర్ఫెక్ట్ గా ఉడికే ట్రిక్ చెప్పిన చెఫ్!
హడావుడిగా వంట చేస్తే అది ఏమాత్రం రుచిగా ఉండదు. తొందరపాటుతో వండిన ఆహారం రుచిని కోల్పోవడమే కాకుండా, లోపల సరిగ్గా ఉడకదు కూడా. మన వంటగదిలో చాలా రకాల నోరూరించే వంటకాలను చేసే ముందు పదార్థాలను ఉడకబెట్టడం అనేది అత్యంత ముఖ్యమైన తొలి అడుగు. బంగాళదుంపలు, కోడిగుడ్లు, పాస్తా లాంటివి ముందుగా ఉడకబెడితేనే కూర పర్ఫెక్ట్ గా వస్తుంది.

ప్రముఖ మాస్టర్ చెఫ్ పంకజ్ భదోరియా ప్రకారం. కూరగాయలు, పాస్తా, గుడ్లు లేదా అన్నం ఉడకబెట్టేటప్పుడు మనం ఉపయోగించే నీటి టెంపరేచర్ అత్యంత కీలకం. సరైన ఉష్ణోగ్రత దగ్గర ఉడకబెట్టినప్పుడే పదార్థాలు ముద్దలా అంటుకోకుండా వాటి సహజ రుచి, సువాసన ఏమాత్రం కోల్పోకుండా మృదువుగా తయారవుతాయి. మరి వంటకు ప్రాణం పోసే ఆ సరైన పద్ధతులు ఏమిటో, ఏ పదార్థాన్ని ఎలా ఉడకబెట్టాలో ఇక్కడ చూడండి.
బంగాళదుంపలు
గుమగుమలాడే దమ్ ఆలూ లేదా బంగాళదుంప కుర్మా చేయాలంటే ముందుగా వాటిని ఉడకబెట్టడం తప్పనిసరి. అయితే ఇక్కడే చాలామంది ఒక పొరపాటు చేస్తుంటారు. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు బంగాళదుంపలను వేస్తుంటారు. కానీ ఎప్పుడూ అలా చేయకూడదు. బంగాళదుంపలను ఎప్పుడూ ముందుగా చల్లటి నీటిలోనే వేసి, ఆ తర్వాత స్టవ్ ఆన్ చేయాలి. నీరు నెమ్మదిగా వేడెక్కడం వల్ల బంగాళదుంపలు లోపల, బయట ఒకేలా, పూర్తిగా ఉడుకుతాయి. వేడినీటిలో వేస్తే బయట భాగం ముద్దగా మారిపోయి, లోపల గట్టిగానే ఉండిపోతాయి.
గుడ్లు పగలకుండా పర్ఫెక్ట్ గా ఉడకాలంటే
కోడిగుడ్లు ఉడకబెట్టేటప్పుడు తరచుగా పెంకు పగిలిపోయి, సొన బయటకు రావడం
మనం చూస్తుంటాం. దీనికి ప్రధాన కారణం వాటిని మరుగుతున్న నీటిలో
వేయడమే. గుడ్లు పగలకుండా ఉండాలంటే, వాటిని కూడా ముందుగా చల్లటి
నీటిలోనే వేయాలి. ఆ తర్వాతే గిన్నెను స్టవ్ మీద పెట్టాలి. నీరు
క్రమంగా వేడెక్కడం వల్ల గుడ్డు పెంకుపై ఒక్కసారిగా ఒత్తిడి పడదు,
కాబట్టి అవి పగలకుండా ఉంటాయి. అలాగే లోపల ఉండే పచ్చసొన, తెల్లసొన
రెండూ సమానంగా ఉడుకుతాయి.
{video1}వ
పాస్తా, నూడుల్స్..వేడి నీరు ఉంటేనే సూపర్
వీటిని ఉడకబెట్టే విధానం కూరగాయలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో నీటిని తీసుకుని బాగా మరిగించాలి. నీరు బబుల్స్ వస్తూ మరుగుతున్నప్పుడు మాత్రమే పాస్తా అందులో వేయాలి. పొరపాటున చల్లటి నీటిలో వేస్తే అవి ముద్దలా, జిగురుగా మారిపోయి పాడవుతాయి. మరుగుతున్న నీటిలో వేయడం వల్ల అవి విడివిడిగా, సరైన ఆకృతిలో వస్తాయి.
క్యాలీఫ్లవర్, బ్రకోలీ
చలికాలంలో ఎక్కువగా దొరికే క్యాలీఫ్లవర్ కు కంటికి కనిపించని
చిన్నచిన్న పురుగులు పట్టే అవకాశం ఉంటుంది. అందుకే వంటకు ఉపయోగించే
ముందు క్యాలీఫ్లవర్ లేదా బ్రోకలీని ఎల్లప్పుడూ వేడి నీటిలో కొద్దిసేపు
ఉడకబెట్టాలి. ఇలా చేయడం వల్ల పురుగులు చనిపోవడమే కాకుండా,
కూరగాయల్లోని పోషకాలు పాడవకుండా ఉంటాయి. వండేటప్పుడు ఎక్కువసేపు
వేయించాల్సిన అవసరం కూడా ఉండదు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications