Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కాకరకాయను ఇలా వండుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.. చేదు ఉండదు, రుచి మాత్రం వేరే లెవెల్
కాకరకాయ పేరు వింటేనే చాలా మందికి చిరాకు వచ్చేస్తుంటుంది. ఇవి చేదుగా ఉండడంతో చాలా మంది తినడానికి ఇష్టపడరు. కూరగా చేసుకున్నప్పుడు ఈ కాకరకాయ కొంచెం చేదుగానే ఉన్నప్పటికీ.. వేపుడు చేస్తే మాత్రం ఆ రుచి అమోఘం అని చెప్పుకోవచ్చు. రుచితో పాటు ఈ కాకరకాయ వేపుడు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. మరీ ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి ఇది మంచి ఆప్షన్. కాకరకాయకు ఉన్న ప్రత్యేక గుణాలు ఆరోగ్యానికి ఉపయోగకరంగా మారుతుంది. అలాగే కుటుంబంతా కలిసి తినే విధంగా ఈ వంట ఉంటుంది. అయితే చాలా మందికి ఈ కాకరకాయ వేపుడు చేసుకోవడం తెలియదు. అందుకే ఈ స్టోరీలో కాకరకాయ వేపుడు ఎలా చేసుకోవాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది క్లియర్‌గా వివరించాము. చదివి మీరూ ఓసారి ట్రై చేయండి.
స్టఫ్డ్ కాకరకాయ వేపుడు తయారీకి కావాల్సిన పదార్థాలు
కాకరకాయలు - 500 గ్రాములు
ఉల్లిపాయలు - 2 (చిన్న ముక్కలుగా తరిగినవి)
ఆవనూనె - 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు - ½ టీస్పూన్
జీలకర్ర - ½ టీస్పూన్
పసుపు - ¼ టీస్పూన్
ధనియాల పొడి - ¼ టీస్పూన్
వేయించిన సోంపు - 1 టీస్పూన్
వేయించిన జీలకర్ర - ½ టీస్పూన్
ఎండుమిర్చులు - 4 (చిన్న ముక్కలుగా)
ఆమ్చూర్ పొడి - ½ టీస్పూన్
ఉప్పు - రుచికి తగినంత
పంచదార - ½ టీస్పూన్

స్టఫ్డ్ కాకరకాయ వేపుడు తయారీ విధానం:
కాకరకాయలను శుభ్రంగా కడిగి, ఉప్పు వేసిన నీటిలో 10 నిమిషాలు నానబెట్టి, మెల్లగా తొక్కను తీసి చిన్న ముక్కలుగా తరిగి గింజలు తొలగించండి. ఇప్పుడు ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్‌లో కాకరకాయ, ఉల్లిపాయ ముక్కలను తీసుకొని అందులో కొంచెం నీళ్లు పోసుకొని.. కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఆ తరువాత వాటిని చల్లారనివ్వాలి. ఇప్పుడు బాణలిలో ఆవనూనె వేసి వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర వేయండి. అవి చిటపటలాడాకా... పసుపు వేసుకోవాలి. అనంతరం ఉడికిన కాకరకాయ మిశ్రమం వేసి మీడియం మంటపై వేయించండి.
ఇప్పుడు అందులో జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఎండుమిర్చి ముక్కలు వేసి బాగా కలపాలి. ఆ తరువాత తగినంత ఉప్పు, ఆమ్చూర్ పొడి వేసి చివరగా పంచదార చల్లి మరిగించాలి. అవన్నీ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే.
ఆరోగ్యానికి హెల్దీ, రుచికి హై!
ఈ వేపుడు రైస్, చపాతీ లేదా జవ్వరోట్టి వంటి వాటిల్లో అద్భుతంగా ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో ఉండే మసాలా, తీపి-పులుపు బ్యాలెన్స్ కమ్మగా ఉండి ప్రతి బైట్లో రుచిగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications