Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
రోగాలు రాకుండా ఉండాలంటే బెండకాయ కూరను ఇలా తినాలి.. వంట రానోళ్లు కూడా సులభంగా చేసుకోవచ్చు!
ప్రస్తుత కాలంలో ఏ ఆహరం తిన్నా అది కలుషితంగానే మారుతుంది. మరీ ముఖ్యంగా అధికంగా నూనె ఉన్న ఆహరం తినడం వల్ల బరువు పెరగడం, మధుమేహం వంటి సమస్యల బారిన పడుతున్నారు. అందుకే చాలామంది నూనె లేని ఆహరం తినేందుకు ఇష్టపడుతుంటారు. అన్నంలో చేసుకునే కూరలో మాత్రం కచ్చితంగా నూనె ఉండాల్సిందే. అయితే ఈరోజు మనందరికీ ఎంతో ఇష్టమైన బెండకాయ కూరను నూనె లేకుండా ఎలా చేసుకోవాలి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఆయిల్ ఫ్రీ బెండకాయ కూర చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఏ విధంగా దీనిని తయారు చేసుకోవాలి అనేది వివరంగా చెప్పాము చదవండి.
ఈ ఆయిల్ ఫ్రీ బెండకాయ కూర తయారీకి కావాల్సిన పదార్థాలు
- పావుకిలో బెండకాయలు
- ఓ టేబుల్ స్పూన్ జీలకర్ర
- సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ
- ఒక ఉల్లిపాయ ముద్దా
- టమాటో పేస్ట్
- రెండు పచ్చి మిర్చి
- కొంచెం నీళ్లు
- కారం
- ధనియాల పొడి
- రుచికి సరిపడా ఉప్పు

ఆయిల్ ఫ్రీ బెండకాయ కూర తయారీ విధానం
ముందుగా మనం తీసుకున్న పావుకిలో బెండకాయలను శుభ్రంగా కడుక్కోవాలి. వాటిని గుండ్రంగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఓ ఉల్లిపాయను కూడా తీసుకొని ముద్దగా చేసుకోవాలి. దీంతో పాటు ఒక పెద్ద టమాటో తీసుకొని దానిని కూడా ముద్దగా లాగా రుబ్బుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెనం తీసుకొని, వేడి చేసుకోవాలి. పెనం వేడయ్యాక అందులో కొన్ని జీలకర్ర వేసుకోవాలి. వాటిని కాస్త కలుపుకోవాలి.
ఆ తరువాత పెనంలో మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని సుమారు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా కలుపుతున్నప్పుడు ఉల్లిపాయ ముక్కలు కాస్త గోల్డెన్ కలర్‌లో వస్తున్నప్పుడు అందులో ఉల్లిపాయ ముద్దా, కొంచెం నీరు పోసుకోవాలి. అనంతరం ఒక నిమిషం పాటు మూత వేసుకోవాలి.
నిమిషం పూర్తయ్యాక.. మూత తీసి అందులో కొంచెం కారం, తరిగిన పచ్చి మిర్చి ముక్కలు, ధనియాల పొడి, టమోటా ముద్దను కూడా వేసుకోవాలి. వాటన్నిటినీ ముందుగా వేసుకున్న ఉల్లిపాయ ముక్కలకు బాగా పట్టుకునే విధంగా కలుపుకోవాలి. ఇలా చేసుకుంటే గ్రేవీ రెడీ అయిపోతుంది. ఈ గ్రేవీపై మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. రెండు నిమిషాల పాటు ఉడికించిన తరువాత.. మూత తీసి మరోసారి గ్రేవీని కలుపుకోవాలి.
ఇప్పుడు బెండకాయ ముక్కలను అందులో వేసుకొని మొత్తం గ్రేవీ ముక్కలకు
పట్టుకునే విధంగా కలుపుకోవాలి. అనంతరం ఆ కర్రీపై మూత పెట్టి బెండకాయ
ముక్కలు మగ్గే వరకు ఉడికించుకోవాలి. ముక్కలు మగ్గిన తరువాత కూరను
దించుకుంటే నూనె లేకుండా బెండకాయ కూర సిద్ధమైపోతుంది. ఈ కర్రీని
చపాతీలో లేదా అన్నంలో కలుపుకొని తినొచ్చు.
బెండకాయలో ఎలాంటి పోషకాలు ఉంటాయంటే?
బెండకాయలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సీ, ఏ, కే1 సహా.. మెగ్నిషియం, ఫోలెట్, ఫైబర్, యాంకీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన విటమిన్స్, పోషకాలు అందిస్తాయి. ఇవి రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. బీపీ నియంత్రణలో ఉండేందుకు, బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఈ బెండకాయ ఎంతగానో ఉపయోగపడతాయి. నూనె లేకుండా ఈ కూరను వండుకోవడం వల్ల పోషకాలు తగ్గకపోవడంతో పాటు పెరుగుతాయి.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలు పలు అధ్యయనాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటి శాస్త్రీయతను మేము నిర్ధారించడం లేదు. మేము కేవలం సమాచారం అందించడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నాము. వీటిని ఎంతవరకు విశ్వసించడం అనేది పూర్తిగా మీ బాధ్యత. దీనికి బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications