Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
మైసూర్ బోండా కాదు.. ఈ ఆలూ మైసూర్ బోండాను ఎప్పుడైనా తిన్నారా..?
టిఫిన్‌లో మెత్తని మైసూర్ బోండాలను చట్నీలోకలుపుకొని తింటే ఆ రుచిని మాటల్లో చెప్పలేము. అదే మైసూర్ బోండాలో ఆలూనూ మిక్స్ చేసి బోండాలు చేస్తే అదే ఆలూ మైసూర్ బోండా. ఈ ఆలూ మైసూర్ బోండాలు మనకు బయట ఎక్కువగా దొరకదు. ఈ ఆలూ మైసూర్ బోండా చాలా టేస్టీగా వుంటుంది. మీకోసం ఆలూ మైసూర్ బోండా రెసిపీని తీసుకొని వచ్చాము. కేవలం ఇంట్లో వున్న వంట సామాగ్రితోనే సింపుల్‌గా చేసేయొచ్చు.
ఆలూ మైసూర్ బోండా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్ధాలు
5 పచ్చిమిరపకాయలు
1 అంగుళం అల్లం ముక్కలు
1 మీడిసైజు ఆలుగడ్డ
1 కప్పు పెరుగు
ఉప్పు
అర టీ స్పూన్ జిలుకర
కరివేపాకులు
1/4 టీ స్పూన్ వంట సోడా
1 టేబుల్ స్పూన్ మంచి నూనె
ఒకటిన్నర కప్పు మైదా పిండి
1/2 కప్పు బియ్యం పిండి
1/2 కప్పు పచ్చి కొబ్బర
1/2 కప్పు చెనగపప్పు
4 వెల్లుల్లిపాయలు
1/2 టీ స్పూన్ జిలుకర
కొన్ని కొత్తిమీర ఆకులు
1 టేబుల్ స్పూన్ మంచి నూనె
ఆవాలు, ఇంగువ, కరివేపాకులు
ఆలూ బోండాలు ఫ్రై చేయడానికి మంచి నూనె
ఆలూ మైసూర్ బోండా తయారీ విధానం
1. మిక్సీ గ్రైండర్‌లో 2 కట్ చేసిన పచ్చిమిరపకాయలు, ఒక అంగుళం అల్లం ముక్కలు, ఒక మీడియం సైజు ఆలుగడ్డను ముక్కలుగా చేసుకొని గ్రైండ్ చేయాలి.
2. గ్రైండ్ చేసిన ఆలూ పేస్టులో 1 కప్పు పెరుగు వేసుకోవాలి. రుచికి సరిపడ ఉప్పు, అర టీస్పూన్ జిలుకర, సన్నగా తరిగిన కరివేపాకులను, పావు టీస్పూన్ వంటసోడా వేసుకొని బాగా కలపాలి
3. టేబుల్ స్పూన్ ఆయిల్‌ను కూడా వేసుకొని బాగా కలపాలి
4. అందులోనే ఒకటిన్నర కప్పు మైదా పిండిని, అర కప్పు బియ్యం పిండిని తీసుకోవాలి.
5. మైసూర్ బోండాకు పిండిని ఎలా కలుపుతామో అలాగే కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ కలపాలి.
6. పిండిని బాగా బీట్ చేస్తూ కలిపిన తరువాత ఒక గంట వరకు అలాగే వదిలి వేయాలి.
7. చట్నీ చేయడానికి మిక్సీ గ్రైండర్‌లో అరకప్పు పచ్చి కొబ్బరిముక్కలను వేసుకోవాలి. అరకప్పు చెనగపప్పును యాడ్ చేసుకోవాలి. 3 పచ్చిమిరపకాయ ముక్కలను తీసుకోవాలి.
8. అదే మిక్సీ జార్‌లో 4 వెల్లుల్లిపాయను, అరటీస్పూన్ జిలుకరను, రుచికి సరిపడ ఉప్పును, కొన్ని కొత్తిమీర ఆకులను వేసుకొని బాగా గ్రైండ్ చేయాలి.
9. చట్నీ ఎంత చిక్కగా వుండాలనుకుంటున్నారో దాన్ని బట్టి నీళ్లను పోసుకొని మళ్లీ గ్రైండ్ చేసుకోవాలి.
10. ఒక ప్యాన్‌లో ఒక టేబుల్ స్పూన్ మంచి నూనెను పోసి వేడయిన తరువాత ఆవాలు, ఇంగువ, కరివేపాకులను వేసి పోప్ చేసుకొని చట్నీలో కలుపుకోవాలి.
11. ఆలూ బోండాలు వేయడానికి కడాయిలో తగినంత ఆయిల్‌ను పోసుకొని మీడియం ఫ్లేమ్‌లో వేడిచేయాలి.
12. బోండాలను కాగిన ఆయిల్‌లో వేసుకోవాలి. బోండలు మాడిపోకుండా, పచ్చిగా ఫ్రై కాకుండా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి.
13. ఫ్రై అయిన బోండాలను ఒక ప్లేట్‌లో తీసుకుంటే ఇక ఆలూ బోండా, చట్నీ రెడీ అయినట్టే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications













