Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
300 రకాల రోగాలకు చెక్ పెట్టే మునగాకుతో కమ్మని పప్పు.. ఒక్కసారి రుచి చూస్తే వదలరు!
ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంత మంచివో మనందరికీ తెలుసు. అందుకే వారానికి కనీసం ఒక్కసారైనా ఇంట్లో ఆకుకూర వండాలని గృహిణులు ప్రయత్నిస్తుంటారు. కానీ ఇంట్లో పిల్లలు లేదా పెద్దలు ఆకుకూరలు తినడానికి మారాం చేస్తున్నారా? ప్లేట్ లో ఆకుకూర కనిపిస్తే చాలు పక్కన పెట్టేస్తున్నారా?
మునగాకు గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇందులో ఐరన్ (Iron) పుష్కలంగా ఉంటుంది. కంటి చూపుకి, ఎముకల బలానికి మునగాకు దివ్యౌషధం. కానీ చాలామందికి మునగాకు వగరుగా ఉంటుందనో, రుచి బాగోదనో అపోహ ఉంటుంది. అయితే పప్పుతో కలిపి మునగాకును వండితే ఆ రుచే వేరు. దాని వాసనకే పిల్లలు ప్లేట్ పట్టుకుని కూర గిన్నె దగ్గరకు పరుగెడతారు.

కావలసిన పదార్థాలు
కందిపప్పు లేదా పెసరపప్పు: అర కప్పు
నీళ్లు: ఒకటిన్నర కప్పులు
ఉల్లిపాయ: 2
వెల్లుల్లి: 5 రెబ్బలు
టమాటా: 1
పసుపు: పావు టీస్పూన్
కొబ్బరి నూనె లేదా వంట నూనె: రెండున్నర టీస్పూన్లు
ఆవాలు: 1 టీస్పూన్
జీలకర్ర: అర టీస్పూన్
ఎండు మిరపకాయలు: 3
వెల్లుల్లి: 5 రెబ్బలు
ఉప్పు: రుచికి సరిపడా
మునగాకు: 2 గుప్పెళ్లు
నీళ్లు: సరిపడా
తయారీ విధానం
-ముందుగా కుక్కర్ తీసుకుని అందులో అర కప్పు పప్పును వేసి శుభ్రంగా కడగాలి. ఇప్పుడు అందులో ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, టమాటా ముక్కలు, చిటికెడు పసుపు వేయాలి. కుక్కర్ మూత పెట్టి పప్పు మెత్తగా ఉడికేవరకు సుమారు 3-4 విజిల్స్ ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి.
-స్టవ్ వెలిగించి ఒక పాన్ లేదా కడాయి పెట్టుకుని నూనె వేయాలి. నూనె వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాలి.
-తాలింపు వేగిన తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి, రుచికి సరిపడా ఉప్పు చల్లి, ఉల్లిపాయలు దోరగా వేయించాలి. ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న లేత మునగాకును పాన్ లో వేయాలి. ఆకులు వాడిపోయి, దగ్గరకు వచ్చేంత వరకు బాగా వేయించాలి.
-మునగాకు బాగా వేగిన తర్వాత అందులో కొంచెం నీళ్లు చల్లి, మూత పెట్టి ఓ 3-4 నిమిషాల పాటు ఆకు మెత్తబడే వరకు ఉడికించాలి.
-మునగాకు ఉడికిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పు మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా కలపాలి. పప్పు మరీ గట్టిగా ఉంటే మరో అరకప్పు నీళ్లు పోసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని మరో 5 నిమిషాల పాటు సన్నని మంటపై మరిగించాలి.
-చివరగా స్టవ్ ఆఫ్ చేసి, పప్పు గుత్తితో పప్పును,ఆకును మెత్తగా మెదుపుకోవాలి. ఇలా చేయడం వల్ల పప్పు, ఆకు బాగా కలిసిపోయి క్రీమీగా తయారవుతుంది.
-అంతే ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన మునగాకు పప్పు రెడీ. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని ఈ మునగాకు పప్పు కలుపుకుని తింటే.. ఆ రుచిని ఎప్పటికీ మర్చిపోలేరు. చపాతీలోకి కూడా ఇది అద్భుతంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications