Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
ఆవిరి కుడుము.. కుక్కర్ లేకుండా కూడా తయారు చేసుకోవచ్చు ?
ఆవిరి కుడుమును ఎప్పుడైనా తిన్నారా. దీంట్లో వుండే మినపప్పు, బియ్యం మాత్రమే. రుచికోసం కొంచం ఉప్పు వేసుకుంటాము. చాలా సింపుల్‌గా ఈ ఆవిరి కుడుమును రెడీ చేసుకోవచ్చు. దీని కోసం ఆవిరి కుక్కర్ అవసరం పడుతుంది. అది లేకున్నా. ఒక బౌల్‌తో తాత్కాలికంగా ఆవిరి పట్టేలా రెడీ చేసుకోవచ్చు. అది ఎలా చేస్తారో తెలుసుకుందాం. ఇంట్లో వున్న వంటసామాగ్రితోనే చాలా సింపుల్‌గా ఈ ఆవిరి కుడుమును రెడీ చేసుకోచ్చు.

ఆవిరి కుడుము కోసం కావాల్సిన పదార్ధాలు
2 గ్లాసుల మినపప్పు
1 గ్లాసు బియ్యం
ఉప్పు
ఆవిరి కుడుము తయారు చేసుకునే విధానం
1. ఒక బౌల్‌లో 2 గ్లాసుల మినపప్పు తీసుకోవాలి.
2. 1 గ్లాసు బియ్యాన్ని తీసుకోవాలి.
3. నీళ్లు పోసుకొని బాగా కడుక్కోవాలి.
4. రాత్రి ఇలా నానబెట్టుకోవాలి.
5. నానబెట్టిన వాటిని ఉదయం బయటకు తీసి మిక్సీజార్‌లో
వేసుకోవాలి. రుచికి సరిపడ ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి.
6. పిండి మరీ గట్టిగా కాకుండా, మరీ పలుచగా కాకుండా వుండాలి.
7. ఆవిరి కుడుము చేసుకోవడానికి ప్రత్యేకంగా కుక్కర్లు వస్తాయ్. వాటిని
మార్కెట్ నుంచి తెచ్చుకోవాలి.
8. ఈ కుక్కర్‌లో ఆవిరితో ఉడకానికి సరిపడినన్ని నీళ్లు
పోసుకోవాలి.
9. కుక్కర్‌లో ప్లేటు వుంటుంది. ఆ ప్లేటు మీద క్లాత్
వేసుకొని దాంట్లో కలిపిన పిండిని వేసుకోవాలి.
10. కుక్కర్‌పై మూతపెట్టి ఉడికించాలి.
11. మూత తీసి చూస్తే ఆవిరికుడుము రెడీ అయిన విషయాన్ని మీరు స్పష్టంగా
తెలుసుకోవచ్చు.
12. స్టవ్ ఆఫ్ చేసి ఆవిరి కుడుమును కిందకు దించుకోవాలి.
13. ఈ ఆవిరి కుడుమును కారంపొడి, లేదంటే ఆవకాయ పచ్చడి వేసి కలుపుకొని
తినవచ్చు.
ఒక వేళ మీదగ్గర ఆవిరి కుడుము తయారు చేయడానికి కుక్కర్ లేకపోతే ఒక స్టీల్ బౌల్‌ను తీసుకోండి. దాంట్లో సగం వరకు నీళ్లు పోసి దానిపై బట్టను తాడుతో కట్టి ఆ బట్టపై ఆవిరికుడుము కోసం చేసుకున్న కలిపిన పిండిని వేసుకొని దానిపై మూత పెట్టాలి. కింద నీళ్ల నుంచి వచ్చే ఆవిరితో కుడుమ ఉడుకుతుంది. ఇలా కూడా ఆవిరి కుడుమును తయారు చేసుకోచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications