Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
Kara bath: బెంగుళూరు స్పెషల్ 'కారా బాత్'..భలే రుచిగా ఉండే దీన్ని ఇలా చేసుకోండి
మన దగ్గర ఉదయం పూట ఏ మూలకు వెళ్లినా ఇడ్లీ దోశలు దొరికినట్లే బెంగళూరులో ఏ మూలకు వెళ్లినా ఉదయాన్నే వేడి వేడి కారా బాత్ లభిస్తుంది. కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా కూడా పొద్దున్నే బ్రేక్ ఫాస్ట్ లోకి కారా బాత్ రెడీ చేస్తుంటారు. ఈ కారా బాత్ ని చట్నీతో కలిపి తింటే ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం. ముఖ్యంగా బెంగుళూరులో ఉండేటోళ్లు వేడి వేడి కారాబాత్ కోసం ఎగబడి మరీ తింటారు. బెంగుళూరు స్పెషల్ కారాబాత్ ని ఇంట్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు. కారా బాత్ తయారీకి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
కారా బాత్ తయారీకి కావాల్సిన పదార్థాలు
-బొంబాయి రవ్వ
-జీడిపప్పు
-నెయ్యి
-టమాటో
-పచ్చిమిర్చి
-ఉల్లిపాయ
-క్యారెట్
-అల్లం
-పచ్చి బఠానీ
-క్యాప్సికం
-బీన్స్
-ఆవాలు
-జీలకర్ర
-కరివేపాకు
-కొత్తిమీర
-పచ్చి కొబ్బరి తురుము
-నిమ్మరసం
-వంగీ బాత్
-ఉప్పు
-ఆయిల్

కారా బాత్ తయారీ విధానం
-ముందుగా స్టవవ మీద కడాయి పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ నూనె,2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి అది వేడెక్కిన తర్వాత ఇందులో 15 జీడిపప్పులు వేసి దోరగా వేయించి వాటిని ఓ ప్లేట్ లోకి తీసుకొని పక్కనపెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో మిగిలి ఉన్న నూనెలో అర టేబుల్ స్పూన్ పచ్చి శెనగపప్పు,అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ ఆవాలు, కొంచెం కరివేపాకు వేసి తాళింపుని ఎర్రగా వేపుకోండి.
-తాళింపు రంగు మారుతున్న సమయంలో అందులో సన్నగా కట్ చేసిన 2 పచ్చిమిర్చి ముక్కలు,1 టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసిన అల్లం,1 కప్పు సన్నగా కట్ చేసి ఉల్లిపాయ ముక్కలు,రుచికి తగినంత ఉప్పు వేసి వేపండి. 2-3 నిమిషాలు వేగాక అందులో 2 టేబుల్ స్పూన్ల సన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు, 1 టేబుల్ స్పూన్ పచ్చి బఠానీ,2 టేబుల్ స్పూన్ల సన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కలు,2 టేబుల్ స్పూన్ల సన్నగా కట్ చేసిన బీన్స్ ముక్కలు వేసి 3 నిమిషాలు వేపండి.
-తర్వాత అందులో 1 కప్పు బొంబాయి రవ్వ వేసి లో ప్లేమ్ మీద కలుపుతూ వేయించుకోండి. 7-8 నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసిన 1 టమాటో ముక్కలు వేసి 2 నిమిషాలు వేపుకోండి.
-తర్వాత అందులో 3 కప్పుల నీళ్లు పోసి కలపండి. ఇందులోనే కొంచెం పసుపు,కొద్దిగా చక్కెర వేసి రవ్వ దగ్గరపడేవరకు వేపుకోండి. అప్పుడు దానిపై 1 టీ స్పూన్ వంగీ బాత్, కొంచెం నెయ్యి,కొంచెం సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి బాగా కలుపి మూత పెట్టి మంటను సిమ్ లో పెట్టుకోండి.
-3 నిమిషాల తర్వాత మూత తీసి అందులో కొంచెం నిమ్మరసం, కొద్దిగా కొత్తిమీర,కొంచెం పచ్చి కొబ్బరి తురుము, వేయించిన జీడిపప్పు కూడా వేసి కలుపుకుంటే వేడి వేడి కారా బాత్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications