Latest Updates
-
టీ, కాఫీకి బదులుగా ఒక కప్పు ఇది తాగారంటే.. తలనొప్పి, నీరసం పరార్.! -
మీలో నిజంగా ఆత్మవిశ్వాసం ఉందా.. ఈ ఐదు పాయింట్లు ఉంటే మీకు తిరుగే ఉండదు.! -
Vinayaka chavthi Recipe : గణనాథుడికి ఇష్టమైన నైవేద్యం..రవ్వ ఉండ్రాళ్లు చేయండిలా.. -
పిల్లలకు కోడిగుడ్డు పెడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి! -
2026 వినాయక చవితి ఎప్పుడు? విగ్రహ ప్రతిష్ఠాపన టైమింగ్స్, పూజా ముహూర్తం, నిమజ్జనం తేదీ వివరాలు! -
వినాయక చవితి స్పెషల్ బెల్లం ఆవిరి కుడుములు..చాలా ఈజీగా చేసుకోండిలా.. -
జీర్ణశక్తిని పెంచే సూపర్ ఫుడ్..మిగిలిపోయిన అన్నంతో టేస్టీ కొత్తిమీర రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్! -
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం!
బండిమీద కాదు.. ఇంట్లోనే బఠానీ చాట్ చేసుకుందాం..టైస్టీగా, స్పైసీగా..!
కట్‌లెట్ లేదా బటానీ చాట్‌ను బయట కాకుండా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. బయట తోపుడు బళ్లపై చేసే బటానీ చాట్‌లో శుభ్రత పాటించరు. చాలా వీడియోలో మనం చూస్తూనే వున్నాం. చేతులను ఎక్కడెక్కడో పెట్టి, గ్లోవ్స్ వాడకుండా పానీ పూరీని అలాగే నీళ్లల్లో చేతులతో ముంచి వేయడం, బటానీ చాట్‌ను కూడా అలాగే చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి భయాలు ఏవీ లేకుండా ఇంట్లోనే సులభంగా కట్‌లెట్‌ను ఎలా తయారు చేసుకోవాలో మీకు చెబుతున్నాం.
బటానీ చాట్ కోసం ఎక్కువ వంటసామాగ్రి అవసరం లేదు, అదనంగా బటానీలు వుంటే చాలు. సేవ్ లేకపోయినా ఇంట్లో వున్న వడియాలతో కట్‌లెట్‌పై సర్వ చేసుకోవచ్చు.

కట్‌లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన వంట సామాగ్రి
1 కప్పు బఠానీలు
1 మీడియం సైజు ఆలుగడ్డ
ఉప్పు
నిమ్మకాయ సైజంత చింతపండు
మంచి నూనె
అర టీస్పూన్ జిలుకర
ఉల్లిపాయ
4 పచ్చి మిరపకాయలు
1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు
1 టమాట
1/4 టీస్పూన్ పసుపు
అర టీ స్పూన్ కారంపొడి
1 టీ స్పూన్ ధనియాల పొడి
అర టీ స్పూన్ చాట్ మసాలా
అర టీ స్పూన్ గరం మసాలా
కొన్ని కొత్తిమీర ఆకులు

కట్‌లెట్ తయారు చేసే విధానం
1 . కప్పు బటానీలను తీసుకొని 6 గంటల పాటు నానబెట్టాలి.
2. నానిన తరువాత బటానీలను కుక్కర్‌లోకి తీసుకోవాలి.
3. ఒక మీడియం సైజు ఆలుగడ్డను తీసుకొని పై పొట్టును తీసి
కుక్కర్‌లో వేయాలి.
4. కుక్కర్‌లో ఒకటిన్నర కప్పు నీళ్లను పోసి, తగినంత ఉప్పును
వేసుకోవాలి.
5. మూడు నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్‌ను
ఉడికించాలి
6. బటానీ మెత్తగా ఉడికేలా చూసుకోవాలి.
7. ఉడికిన బఠానీని మిక్సర్ జార్‌లోకి తీసుకొని గ్రైండ్
చేసుకోవాలి.
8. నిమ్మకాయంత చింతపండును తీసుకొని నానబెట్టాలి.
9. చింతపండు రసాన్ని తీసి అందులో ఒక టేబుల్ స్పూన్ బెల్లాన్ని
వేసుకోవాలి.
10. ప్యాన్‌లో 2 టేబుల్ స్పూన్ల వరకు మంచి నూనెను
వేసుకోవాలి.
11. నూనెలో అర టీస్పూన్ జిలుకర వేసి ఫ్రై చేయాలి.
12. సన్నగా తరిగిన ఉల్లిపాయ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
13. 2 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకోవాలి.
14. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని కలుపుకోవాలి.
15. సన్నగా తరిగిన ఒక టమాట వేసి ఫ్రై చేసుకోవాలి.
16. పావు టీ స్పూన్ పసుపును, అర టీ స్పూన్ కారంపొడిని, 1 టీ స్పూన్
ధనియాల పొడిని, అర టీస్పూన్ చాట్ 17. మసాలా, అర టీస్పూన్ గరం మసాలా,
తగినంత ఉప్పును కూడా వేసుకోవాలి.
18. ఉడికించిన ఆలూను స్మాష్ చేసి ప్యాన్‌లో వేసుకోవాలి.
ఉడికించిన బటానీని కూడా ఇందులో వేసుకోవాలి.
19. చింతపండు రసాన్ని కూడా వేసుకొని కలుపుకోవాలి.
20. కొన్ని నీళ్లను వేసుకొని బఠానీని బాగా కలుపుకోవాలి.
21. మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించాలి.
22. కొన్ని కొత్తిమీర ఆకులను వేసి కలుపుకోవాలి.
23. బటానీపై సన్నగా తరిగిన ఉల్లిపాయ, టమాటా ముక్కలను, కొంత
కొత్తిమీరను వేసుకోవాలి.
24. ఇక దీంతో బటానీ చాట్ రెడీ అయినట్టే. ఈ వర్షాకాలంలో సాయంత్రం ఈ
వేడివేడి బటానీ చాట్‌ను తింటూ వుంటే మాటల్లో వర్ణించలేని
ఆనందం.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
