Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
Home made beer: ఇంట్లోనే బీర్ తయారు చేసుకోవడం ఎలా? ఇలా చేస్తే బ్రాండెడ్ బీర్ల టేస్ట్ గ్యారెంటీ!
మనదేశంలో ఏ వ్యాపారమైనా లాభనష్టాలు ఉంటాయి కానీ నష్టం లేని వ్యాపారం ఏదైనా ఉందంటే అది లిక్కర్ వ్యాపారమే. షాపు షెట్టర్ తీసిన దగ్గర నుంచి షట్టర్ క్లోజ్ చేసే వరకు నిత్యం జనం రద్దీతో కిటకిటలాడే ఏకైక వ్యాపారం మన దేశంలో ఇదేనని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే మద్యం తాగేవాళ్లలో చాలామంది బీర్ ఎక్కువగా తాగుతుంటారు. ఎండాకాలం వచ్చిందంటే ఇంకా ఎక్కువగా బీర్లు(beers) తాగుతుంటారు.
బీర్లలో అనేక రకాల వెరైటీలు ఉంటాయి. అయితే బీరుని ఇంట్లోనే తయారుచేసుకోవచ్చని మీకు తెలుసా? మద్యం షాపులలో దొరికే బీర్ టేస్ట్ మాదిరిగానే ఇంట్లోనే బీర్ ని తయారుచేసుకోవచ్చు. బీరు ప్రిపేన్ చేసుకోడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
బీర్ చేసుకోడానికి కావాల్సిన పదార్థాలు
-గోధుమలు
-నల్ల ద్రాక్ష
-బిర్యానీ ఆకులు,
-పొడి మెంతి ఆకు
-బిర్యానీ ఫ్లవర్
-చక్కెర
-ఈస్ట్ పౌడర్(Yeast)
బీర్ తయారీ విధానం
-ముందుగా ఓ బౌల్ లో గోధుమలు తీసుకొని బాగా కడిగిన తర్వాత కొన్ని నీళ్లు పోసి 1-2 గంటలు నానబెట్టాలి.
-తర్వాత ఈ నానబెట్టిన గోధుమలను ఓ గుడ్డపై వేసి రాత్రంతా ఆ గుడ్డను చుట్టూ చుట్టి రాత్రంతా అలాగే ఉంచాలి.
-తర్వాత రోజు ఉదయానికి అవి మొలకెత్తిన గింజలుగా అవుతాయి. ఇప్పుడు వీటిని ఎండలో ఎండబెట్టాలి.
-గోధుమలు ఎండిన తర్వాత స్టవ్ మీద ఓ పాన్ పెట్టి అందులో వీటిని వేసి బ్రౌనిష్ కలర్ వచ్చేవరకు వేపుకోవాలి.
-తర్వాత వాటిని లైట్ గా దంచుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద ఓ గిన్నె పెట్టి అందులో 2 లీటర్ల నీళ్లు పోసి అవి కొంచెం వేడయ్యాక అందులో ఈ దంచిన గోధుమలను వేసి 20 నిమిషాల పాటు బాగా ఉడకబెట్టాలి.
-తర్వాత నీటిలో నుంచి గోధుమలను తీసి ఓ బౌల్ లోకి తీసి పెట్టుకోండి.
-ఇప్నుడు ఆ స్టవ్ మీద ఉన్న గోధుమలను ఉడికించిన నీళ్లలోనే బిర్యానీ ఆకులు,పొడి మెంతి ఆకు,బిర్యానీ ఫ్లవర్ వేసి కలిపి 10 నిమిషాల పాటు ఉడికించండి.
-తర్వాత నీటిని బాగా వడకట్టుకోండి. అందులోని ఆకులున్నీ తీసి ఓ బౌల్ లో వేసి పక్కనబెట్టేయండి. ఆ నీటిని ఇప్పుడు ఓ డబ్బాలో పోసి అందులో 1 కేజీ చక్కెర,1 స్పూన్ ఈస్ట్ పౌడర్,కొన్ని నల్ల ద్రాక్షలను బాగా పిసికి వేయండి.
-తర్వాత డబ్బా మూత పెట్టి ఆ మూత మీద పైపు ముక్క పట్టేంత రంధ్రం చేయండి.
-ఆ రంధ్రం గుండా డబ్బాలో ఓ చిన్న పైపు వేసి ఆ పైపు రెండో భాగాన్ని ఇంకో ఖాళీ గిన్నె లేదా సీసాలో పెట్టండి. ఇలా చేయడం వల్ల ఆ ద్రవం ఉన్న డబ్బాలోని గ్యాస్ అంతా పక్కనుండే సీసాలోకి వెళ్లిపోతుంది.
-21 రోజుల తర్వాత డబ్బా మూత తీసి పైపు పక్కనపెట్టి అందులోని నీటిని అంతా వడకట్టుకోవాలి.
-వడకట్టిన నీరుని ఐదైనా గాజు సీసాలోకి పోయేండి. అంతే బీర్ రెడీ. ఇది షాపులలో దొరికే బీరు టేస్ట్ లానే ఉంటది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












