Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
బీట్రూట్, అటుకులతో హాట్ అండ్ స్వీట్ హెల్తీ స్నాక్స్
వేసవి సెలవుల్లో పిల్లలు చిరుతిళ్ల కోసం చేసే మారాం అంతా ఇంతా కాదు. వంటింట్లోని డబ్బాల్లో ఎప్పుడూ ఏదో ఒక పిండి వంట రెడీగా ఉండాల్సిందే. అందుకే సమ్మర్ వచ్చిందంటే తల్లులు ఎప్పుడూ ఏదో ఒక రకం వంటతో బిజీబిజీగా ఉంటారు. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో మురుకులు, మినప సున్నుండలు ఎప్పుడూ ఫేమస్. అయితే ఇప్పుడు వాటిని కొంచెం ఢిపరెంట్‌గా, చాలా హెల్తీగా చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం..

రక్త హీనత ఉన్నవారికి బీట్ రూట్ చాలా మేలు
చేస్తుంది. అయితే చిన్నపిల్లలు దానిని నేరుగా తీసుకోలేరు. కొంచెం
వగరుగా ఉండే బీట్రూట్తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
ఉన్నాయి. అందుకే ఈ దుంపని ఖచ్చితంగా పిల్లలకు తినిపించాల్సిందే.
పిల్లలు నేరుగా వీటిని తినలేకపోతే హెల్తీగా మురుకుల్లో కలిపి చేసి
పెట్టండి. ఆవురావురుమంటూ తినేస్తారు. బీట్రూట్
మురుకులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..
బీట్రూట్ మురుకులకి కావాల్సిన పదార్థాలు
బీట్రూట్- ఒకటి
బియ్యం - అరకప్పు
మినప్పప్పు- 150 గ్రాములు
కరివేపాకు- 2 రెబ్బలు
పచ్చిమిర్చి- 3
వెల్లుల్లి- 6 రెబ్బలు
ఉప్పు - 2 టీ స్పూన్లు
నూనె- అర లీటర్
తయారీ విధానం
-ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీళ్లు వడగట్టి ఒక పల్చటి క్లాత్‌పై ఆరబెట్టుకోవాలి. మినప్పప్పు దోరగా వేయించుకోవాలి. బీట్రూట్ను తొక్క తీసి తురుముకోవాలి.
-ఇప్పుడు ఆరబెట్టిన బియ్యాన్ని, మినప్పప్పును విడివిడిగా గ్రైండ్ చేసుకుని మెత్తటి పౌడర్ వచ్చేలాగా జల్లెడ పట్టుకోవాలి. ఈ రెండిటిని కలుపుకొని మళ్లీ ఒకసారి బాణలిలో పచ్చివాసన పోయేలా కాసేపు వేయించుకోవాలి. తర్వాత పక్కన పెట్టుకోవాలి. బీట్రూట్ తురుములో పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ ముద్దను గట్టిగా పిండి నీటిని సెపరేట్ చేసుకోవాలి.
-ఈ బీట్రూట్ పేస్ట్ నీళ్లలో పిండి, ఉప్పుతో పాటు సరిపడా నీళ్లు పోసి ముద్దగా కలుపుకోవాలి. ఓ పదినిమిషాలు నాననివ్వాలి. ఆలోపు బాణలిలో నూనే పోసి వేడిచేయాలి. తర్వాత కొద్దికొద్దిగా పిండిముద్దను తీసుకుని మురుకుల గొట్టంలోకి పెట్టుకుని అరిటాకుపై మురుకుల్లా చేసుకోవాలి. నూనె వేడయ్యాక వీటిని బాణలిలో సరిపడా వేసి క్రిస్పీగా అయ్యేవరకు కాల్చుకోవాలి. అంతే ఎంతో రుచికరంగా ఉండే బీట్రూట్ మురుకులు రెడీ..
అటుకులు, జీడిపప్పు హెల్తీ నువ్వుల లడ్డూ తయారీకి కావాల్సిన పదార్థాలు
అటుకులు- 500గ్రాములు
జీడిపప్పు- 100 గ్రాములు
పచ్చి కొబ్బరి తురుము- 150గ్రాములు
బెల్లం- 200గ్రాములు
యాలకుల పొడి- 2 టేబుల్ స్పూన్స్
తయారీ విధానం
-అటుకులు, జీడిపప్పును బాణలిలో విడివిడిగా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటినీ మెత్తటి పౌడర్‌గా చేసుకోవాలి. పచ్చి కొబ్బరి తురుము, బెల్లం తురుమును మొత్తగా రుబ్బుకోవాలి. అనంతరం అటుకులు, జీడిపప్పు పొడిలో ఈ మిశ్రమంతో పాటు యాలకుల పొడిని వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. బెల్లంలో, కొబ్బరిలో ఉండే జిగుటు, తడి కారణంగా నెయ్యి అవసరం ఉండదు. ఇప్పుడు వీటిని సున్నుండల్లా అరచేతితో గుండ్రంగా ఒత్తుకోవాలి. అంతే ఎముకల పుష్టికి, జీర్ణవ్యవస్థకి ఎంతో మేలు చేకూర్చే హెల్తీ లడ్డూలు రెడీ. వేసవి సెలవుల్లో ఆటలతో అలసిపోయిన మీ పిల్లలకు ఈ స్నాక్స్ ఇన్స్టంట్ శక్తిని అందిస్తాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications