Latest Updates
-
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం!
ఫంక్షన్ స్టైల్ బెండకాయ ఫ్రై.. కాజూ, కిస్మిస్, బాదాం వేసుకొని చేస్తే..పెరుగన్నంలో నంచుకుంటే సూపర్..!
కూరగాయల్లో ఏ కూరగాయ ఫ్రై చేసినా రుచిగానే వుంటుంది. చివరికి చేదుగా వుండే కాకరకాయ ఫ్రై చేసినా టేస్టీగా వుంటుంది. కానీ అన్ని కూరగాయల ఫ్రై వంటకాల్లో బెండకాయ ఫ్రైకు వుండే స్థానం వేరు. పెళ్లి భోజనాల్లో ఈ బెండకాయ ఫ్రై అందరినీ ఆకర్షిస్తుంది. పప్పు చారులో బెండకాయ ఫ్రై నంచుకొని తిన్నా, పెరుగన్నంలో బెండకాయ ఫ్రైను నంచుకొని తిన్నా ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేము. బెండకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో మీ ముందుకు తీసుకొని వచ్చాము.
బెండకాయ ఫ్రై తయారు చేయడానికి కావలసిన వంట సామాగ్రి
బెండకాయలు, మంచి నూనె, వెల్లుల్లి ముక్కలు, జిలకర, పచ్చిమిరపకాయలు, కరివేపాకులు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, ధనియాలు, యాలాకులు, దాల్చిన చెక్క, లవంగాలు, ఎండిమిరపకాయలు, కొబ్బరిపొడి, నిమ్మకాయ, కారంపొడి, కొత్తిమీర ఆకులు, కాజూ, కిస్మిస్, బాదాం.

బెండకాయ ఫ్రై తయారు చేసుకునే విధానం
ముందుగా 300 గ్రాముల వరకు మంచి బెండకాయలకు తీసుకోవాలి. తరువాత ఈ బెండకాయలను బాగా కడిగి, తడి లేకుండా ఒక బట్టతో తుడుచుకోవాలి. దీని వల్ల బెండకాయలో జిగురు లేకుండా త్వరగా ఫ్రై అవడానికి ఆస్కారం వుంటుంది.
ఫ్రై చేయడానికి బెండకాను మరీ లావుగా, మరీ సన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఒక ప్యాన్‌లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్‌ను తీసుకొని బాగా వేడయిన తరువాత అందులో సన్నగా తరిగిన 5,6 వెల్లుల్లి ముక్కలను వేసుకొని ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తరువాత అర టీ స్పూన్ జిలకరను, మూడు పచ్చిమిరపకాయలను, కొన్ని కరివేపాకులను వేసుకొని బాగా ఫ్రై చేయాలి. సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి.
ఫ్రై అవుతున్న ప్యాన్‌లో ఇంతకు మందు కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను వేయాలి. 3,4 నిమిశాలపాటు బెండకాయలను ఫ్రై చేయాలి. ఇందులోనే రుచికి సరిపడ ఉప్పును వేసుకోవాలి. చిటికెడంత ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి బాగా ఫ్రై చేయాలి. ఇలా ఫరై చేయడం వల్ల బెండకాయలో వున్న జిగురు తగ్గి బాగా ఫ్రై అవుతుంది.

తరువాత ఒక ప్యాన్‌ను తీసుకొని అందులో ఒక టీస్పూన్ మంచి నూనెను యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయిన తరువాత ఒక టీ స్పూన్ చెనగపప్పును, ఒక టీ స్పూన్ మినపప్పును, అర టీ స్పూన్ ధనియాలను, రెండు యాలాకులను, దాల్చిన చెక్కలను, రెండు లవంగాలను తీసుకొని ఫ్రై చేయాలి. ఇందులోనే 4 ఎండి మిరపకాయలను, ఒక టీ స్పూన్ కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలి. ఫ్రై అయిన తరువాత ఈ పోపును మిక్సీ గ్రైండర్‌లోకి తీసుకోవాలి.
మరో ప్యాన్‌లో బెండకాయను కలుపుకుంటూ ఫ్రై చేయాలి. ఇంతకు ముందు గ్రైండ్ చేసుకున్న పొడిని మొత్తం బెండకాయలో వేసుకోవాలి. ఇందులోనే అరటీస్పూన్ కారంపొడిని, అరచెక్క నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. చివర్లో కొత్తిమీర ఆకులను కూడా వేసుకొని బాగా కలపాలి. ఇక దీంతో బెండకాయ ఫ్రై రెడీ అయినట్టే.
ఈ బెండకాయ ఫ్రైని చపాతీతో తినవచ్చు లేదా పప్పు చారు తినేటప్పుడు నంచుకోవచ్చు. బెండకాయ ఫ్రై చేసేటప్పుడు కొన్ని కాజూలను, కిస్మిస్, బాదాంలను కూడా యాడ్ చేసుకోవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications