Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఇలాంటి హల్వా తింటే.. రుచి నరాలు కూడా లేచి నాట్యం చేస్తాయి, అద్భుతమైన రుచి, ఎలా చేసుకోవాలంటే?
మన తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆహరం అంటే పిచ్చి. స్వీట్ అయినా, హాట్ అయినా ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అందులో స్వీట్ అంటే మరీ ఇష్టంగా తింటూ ఉంటారు. ఒకవేళ షుగర్ అనేది లేకపోతే స్వీట్ తింటూనే బతికే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ స్వీట్లో ఒకటి హల్వా. హల్వా అంటే తరచుగా మనం పండ్లు, కూరగాయలు ఉపయోగించి చేసే కరే కలర్రీ వంటకాలు గుర్తుచేసుకుంటాం. కానీ, ఎప్పుడైనా బిస్కెట్ హల్వా ట్రై చేశారా? ఇది మరింత రుచిగా ఉంటుంది.
ఇది పండ్లు లేక కూరగాయలు కాకుండా, మన ఇంట్లో ఎప్పుడూ ఉండే బిస్కెట్లతో తయారు చేస్తారు. పిల్లలు అయితే దీన్ని మరింత ఇష్టపడి తింటారు. అలాగని పెద్దలు కూడా దీన్ని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఒకసారి ఈ బిస్కెట్ హల్వా తింటే మీరు మళ్లీ మళ్లీ దీనిని తయారుచేసి, రుచిచూసే కోరిక కలుగుతుంది. జన్మలో మర్చిపోలేని అనుభూతి, రుచి ఈ హల్వా సొంతం అని చెప్పుకోవచ్చు. ఇది కేవలం కేవలం రుచిగా మాత్రమే కాకుండా, తయారీ విధానం కూడా చాలా సులభం. దీనిని ఎలా చేసుకోవాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బిస్కెట్ హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు:
బిస్కెట్లు (మీకు నచ్చిన రకం) - 15
పాలు - 1/2 లీటర్
నెయ్యి - 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు
చక్కెర - రుచికి సరిపడా
డ్రై ఫ్రూట్స్ (ఆల్మండ్, జీడి పప్పు, పిస్తా) - మీ ఇష్టానుసారం
తయారుచేసే విధానం:
బిస్కెట్లను సిద్ధం చేసుకోవడం: మొదటగా ఒక బౌల్ తీసుకొని అందులో మీకు ఇష్టమైన బిస్కెట్లను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. బిస్కెట్ల రుచి కాస్త తీపి ఎక్కువ అయితే, హల్వాలో మీరు వేసుకునే చెక్కెర పరిమాణాన్ని కొంచెం తగ్గించుకుంటే మంచిది.
పాలు, బిస్కెట్ల మిశ్రమం: తరువాత, పాలు తీసుకుని బిస్కెట్ల మీద పోసి, 1 నిమిషం పాటు నానిన తర్వాత స్మాషర్ లేదా ఓ కొద్దిగా గట్టి స్పూను సహాయంతో వాటిని మెత్తటి పేస్టుగా తయారుచేయండి.
నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేయించడం: ఒక పాన్లో నెయ్యి వేడి చేసి, అందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ (బాదం, జీడి పప్పు, పిస్తా) చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయించి, వాటిని కాస్త లేత బంగారు రంగులోకి వచ్చేంతవరకు వేయించుకోవాలి.
బిస్కెట్ మిశ్రమం వేసి, చక్కెర జోడించడం: ఇప్పుడు అదే పాన్లో, తయారుచేసిన బిస్కెట్ పేస్టు వేసి, చక్కెర వేసి బాగా కలపండి. చక్కెర అందులో కరిగిన తర్వాత, ఈ మిశ్రమం గట్టిపడే వరకు కలిపి వేడి చేయండి.
చక్కెర సిరప్: మరో పాన్లో, చక్కెర వేసి, దానిని కరిగించి సిరప్గా తయారుచేయండి. అది మరింత కరిగిన తర్వాత, దాన్ని బిస్కెట్ పేస్టులో జోడించండి. తర్వాత నెయ్యి వేపిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసి, అన్నీ బాగా కలిపి పక్కన పెట్టుకుంటే ఎంతో రుచికరమైన అందరూ లొట్టలేసుకుని తినే బిస్కెట్ హల్వా సిద్ధమైనట్లే. దీనిని చాలా సులభంగా అతి తక్కువ ఖర్చుతో తయారు చేసుకోవచ్చు. రుచిలో మాత్రం తగ్గేదే లే. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి మరి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications