Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
బోటీ కూరను ఇలా వండితే.. ఇష్టపడని వారు కూడా లొట్టలేసుకుంటూ తింటారు..!
మటన్‌లో లివర్, బ్రెయిన్, కాళ్లు, చాప్స్, లెగ్ పీస్ ఇలా చాలా వుంటాయ్. బోటీని కూడా చాలా మంది ఇష్టపడతారు. మటన్‌లో ప్రొటీన్లు పుష్కలంగా వుంటాయ్. బోటీలో కూడా ప్రొటీన్లు మెండాగా వుంటాయ్. గర్భిణులు ఈ బోటీని తినడం వల్ల ఎన్నో పోషకాలను తీసుకున్నవారౌతారు. వారానికి ఒకసారైనా మాంసాహారాన్ని తీసుకుంటే ప్రొటీన్లు అందడమే కాకుండా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. బోటీ కూరలో ప్రొటీన్లు పుష్కలంగా వుంటాయ్. బోటీ తినడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వుండవు.
బోటీ కర్రీని ఎలా వండాలో మీకు చెప్పబోతున్నాం. బోటీను వండే ముందు దాన్ని బాగా కడగాలి. బోటీని వేడి నీళ్లల్లో వేసి ప్రత్యేకంగా కడగాలి. అయితే బోటీని తినడానికి కొంత మంది ఇష్టపడరు. కానీ మేము చెప్పే పద్ధతిలో బోటీ కర్రీని వండితే వాళ్లు కూడా ఇష్టంగా తింటారు.

బోటీ కర్రీకి కావలసిన పదార్ధాలు
1/2 కేజీ బోటీ
2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి
1 టీబుల్ స్పూన్ అల్లం ముక్కలు
15 వెల్లుల్లి ముక్కలు
3 యాలాకులు
5 లవంగాలు
1 దాల్చిన చెక్క
1 కప్పు ఉల్లిపాయలు
4 టేబుల్ స్పూన్ల మంచి నూనె
1 బిర్యానీ ఆకు,
4 పచ్చిమిరపకాయలు
చిటికెడంత పసుపు
1 టేబలు్ స్పూన్ ధనియాల పొడి
అర టీస్పూన్ గరం మసాలా
1 కట్ట కొత్తిమీర ఆకులు

బోటీ కర్నీని తయారు చేసుకునే విధానం
1. స్టవ్‌పైన గిన్నె పెట్టుకొని మూడు గ్లాసుల నీళ్లు, పావు టీ స్పూన్ పసుపు, బోటీ ముక్కలను వేసుకొని 10 నిమిశాల వరకు హై ఫ్లేమ్‌లో ఉడికించాలి.
2. రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి కుడకను కాల్చి మిక్సర్ గ్రైండర్‌లో పొడి చేసుకని పక్కకు పెట్టుకోవాలి.
3. మిక్సర్ జార్‌లోకి 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలను, పొట్టు తీసిన 15 వెల్లుల్లి ముక్కలను, 3 యాలాకులు, 5 లవంగాలను, 1 దాల్చిన చెక్క ముక్కను తీసుకొని గ్రైండ్ చేయాలి. ఈ పేస్టును మొత్తం పక్కకి పెట్టుకోవాలి.
4. 1 కప్పు ఉల్లిపాయలను కూడా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకని పక్కకు పెట్టుకోవాలి.
5. బోటీ చెయ్యడినికి కుక్కర్‌ను స్టవ్ పైన పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల మంచి నూనెను, 1 బిర్యానీ ఆకు, గ్రైండ్ చేసిన ఉల్లిపాయ పేస్టును వేసి ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, 4 పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని ఫ్రై చేయాలి.
6. కుక్కర్‌లొ ఉడికించిన బోటీ ముక్కలను వేసుకోవాలి, చిటికెడంత పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. మంటను హై ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేయాలి.
7. బోటీలో రుచికి సరిపడ ఉప్పూ కారంను, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని, అర టీస్పూన్ గరం మసాలా పొడిని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి.
8. ప్యాన్‌లో వున్న బోటీని బాగా కలుపుకోవాలి, లో ఫ్లేమ్ పెట్టి 5 నిమిశాల వరకు ఉడికించాలి.
9. గ్రేవీ ఎంత కావాలనుకుంటున్నారో అన్ని నీళ్లను యాడ్ చేసుకోవాలి. కొన్ని కొత్తిమీర ఆకులను కూడా వేసుకోవాలి.
10. బోటీ ఉడికిందా లేదా చెక్ చేసుకొని స్టవ్ పైనుంచి కిందకు దించి సర్వ్ చేసుకొని తినడమే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications