Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
బ్రెడ్ పనీర్ రోల్.. ఇలా ఎప్పుడైనా చేసుకున్నారా..?
పనీర్ బ్రెడ్ రోల్ అనేది సులభంగా, త్వరగా తయారుచేసుకునే స్నాక్. ఇది చిన్నపిల్లలకి, పెద్దవారికి అందరికీ ఇష్టమైన వంటకం. బ్రెడ్ ఆమ్లెట్, బ్రెడ్ సాండ్విచ్ కాకుండా ఇలా బ్రెడ్ పనీర్‌ను ఒకసారి చేసి ట్రై చేయండి. మరి బ్రెడ్ పనీర్‌ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
పనీర్ బ్రెడ్ రోల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన వంట పదార్ధాలు :
బ్రెడ్: 8-10 స్లైసులు
పనీర్: 200 గ్రాములు
ఉల్లిపాయలు: 1
పచ్చిమిరపకాయలు: 2-3
పచ్చి ధనియాలు: 1/2 కప్పు
అల్లం-వెల్లుల్లి పేస్ట్: 1 టీస్పూన్
గరం మసాలా: 1/2 టీస్పూన్
నిమ్మ రసం: 1 టీస్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
పెరుగు: 2 టేబుల్ స్పూన్లు
నూనె
పసుపు: ఒక చిటికెడు
కారం: 1/2 టీస్పూన్
బంగాళదుంపలు: 2-3 ఉడికించినవి
పనీర్ బ్రెడ్ రోల్‌ను ఈ కింది విధంగా రెడీ చేసుకోవాలి :
1. ఒక పెద్ద ప్యాన్ తీసుకొని, అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేసుకోవాలి. తరిగిన ఉల్లిపాయలను వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి.
2. అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని ఉల్లిపాయల పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి. కారం, గరం మసాలా, పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. దీంట్లో పనీర్‌ను, ఉడికించిన బంగాలుదుంపలను వేసుకొని బాగా కలుపుకోవాలి.
3. రుచికి సరిపడ ఉప్పు, నిమ్మరసాన్ని పిండుకొని, కొన్ని కొత్తిమీర ఆకులను వేసుకొని బాగా కలుపుకోవాలి. కొన్ని నిమిశాల వరకు దీన్ని ఫ్రై చేసి తరువాత చల్లార్చుకోవాలి.
4. బ్రెడ్ స్లైసులను తీసుకొని వాటి కొనలను కట్ చేసుకోవాలి. బ్రెడ్ స్లైసుల మధ్యలు కలుపుకున్న మసాలా పూర్ణాన్ని పెట్టి బ్రెడ్‌ను రోల్ చేయాలి. మసాలా బయటకు కనిపించకుండా రోల్ చేసుకోవాలి.
5. ఒక కడాయ్‌లో తగినంత నూనె పోసుకొని అందులో ఈ బ్రెడ్ రోల్స్‌ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తరువాత టిష్యూ పేపర్లో ఉంచితే వాటిలో ఉన్న ఎక్కువ నూనె బయటకు వెళ్లిపోతుంది.
6. ఇత దీంతో బ్రెడ్ పనీర్ రెడీ అయినట్టే, ఈ పనీర్‌ను టమాట సాస్ లేదంటే చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












