Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
5 నిమిషాల్లో బ్రెడ్ పిజ్జా సాండ్విచ్.. దీని టేస్ట్ ముందు పిజ్జా కూడా బలాదూరే..!
బ్రెడ్‌తో చాలా రకాల స్నాక్స్ చేసుకోవచ్చు. బ్రెడ్ ఆమ్లెట్, బ్రెడ్ సాండ్‌విచ్ ఇలా ఎన్నో రెసిపీలు వున్నాయ్. బ్రెడ్ పిజ్జా సాండ్‌విచ్‌ను ఎప్పుడైనా చేసుకున్నారు. పిజ్జాకు ఏ మాత్రం తగ్గకుండా బ్రెడ్ పిజ్జా సాండ్‌విచ్‌ను రెడీ చేసుకోవచ్చు. దీని కోసం సాండ్విచ్ మేకర్ కూడా అవసరం లేదు. కేవలం ఇంట్లో వున్న వంట సామాగ్రితోనే చాలా సింపుల్‌గా పది నిమిశాల్లోనే ఈ బ్రెడ్ పిజ్జా సాండ్విచ్‌ను తయారు చేసుకోవచ్చు. కావాల్సిన పదార్ధాలు కూడా చాలా తక్కువే.
ఆకలివేసి వండుకోవడానికి ఇష్టం లేనప్పుడు, బ్రేక్‌ఫాస్ట్‌లో, సాయంత్రం స్నాక్‌లోకి ఈ బ్రెడ్ పిజ్జా సాండ్విచ్‌ను తినవచ్చు. బయట వందలు పెట్టి ఈ సాండ్విచ్‌ను కొనుక్కొని తినడం కన్నా, ఇంట్లో తక్కువ ఖర్చుతో చేసుకోవడం మంచిది. మరి ఈ బ్రెండ్ సాండ్విచ్‌ను ఎలా రెడీ చేసుకోవచ్చో తెలుసుకుందాం.

బ్రెడ్ పిజ్జా సాండ్‌విచ్ కోసం కావాల్సిన పదార్థాలు
6 సాండ్ విజ్ బ్రెడ్ స్లైసులు
పిజ్జా సాస్
కట్ చేసిన ఉల్లిపాయలు
కట్ చేసిన టమాట ముక్కలు
కట్ చేసిన క్యాప్సికం ముక్కలు
మిరియాల పొడి
ఉప్పు
తరిగిన చీజ్
బటర్

బ్రెడ్ పిజ్జా సాండ్‌విచ్ తయారీ విధానం
1. ముందుగా బ్రెడ్ స్లైసు తీసుకొని దానిపై పిజ్జా సాస్‌న అప్లై చేసుకోవాలి.
2.బ్రెడ్ స్లైస్‌పై తరిగిన చీస్‌ను స్ప్రెడ్ చేసుకోవాలి.
3. దానిపై కొన్ని కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలను, కొన్ని క్యాప్సికం ముక్కలను వేసుకోవాలి.
4. చిటెకెడంత మిరియాల పొడిని కూడా చల్లుకోవాలి.
5. తగినంత ఉప్పును కూడా చల్లుకోవాలి.
6. మళ్లీ కొంచం చీస్‌ను వేసుకొని బ్రెడ్‌స్లైస్‌ను క్లోజ్ చేయాలి.
7. ప్యాన్ తీసుకొని వేడవుతున్నప్పుడు ఒక టీస్పూన్ బటర్‌ను యాడ్ చేసుకోవాలి.
8. మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ప్యాన్‌లోని బ్రెడ్‌ను కొన్ని నిమిశాలపాటు ఫ్రై చేయాలి.
9. బ్రెడ్‌ను అటూ ఇటూ టర్న్ చేస్తూ ఫ్రై బాగా ఫ్రై అయ్యేలా చూసుకోవాలి.
10. బ్రెడ్ రెండు పక్కలా బాగా ఫ్రై అయ్యేలా చూసుకోవాలి.
11. బ్రెడ్‌ను ప్యాన్‌లోంచి బయటకు తీసుకున్న తరువాత ప్యాన్‌ను టిష్యూ పేపర్‌తో క్లీన్ చేయాలి.
12. ఇంకో బ్రెడ్‌ను కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి.
13. బ్రెడ్ సాండ్‌విచ్‌ను రెండు పీసులుగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
