Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
బ్రెడ్ ఉప్మాను ఇలా ఎప్పుడైనా చేసుకున్నారా..?
బ్రెడ్‌తో బ్రెడ్ ఆమ్లెట్, సాండ్‌విచ్ లాంటివి మాత్రమే కాదు, బ్రెడ్ ఉప్మా కూడా చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్, త్వరగా చేసుకునే వంటకం. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కు ఏమి చేయాలో తెలియనప్పుడు కొన్ని బ్రెడ్ స్లైసులతో ఈ బ్రెడ్ ఉప్మాను త్వరగా చేసేసుకోవచ్చు. మరి ఈ బ్రడె్ ఉప్మాను ఎలా రెడీ చేసుకోవాలో తెలుసుకుందాం.

బ్రెడ్ ఉప్మా తయారు చేయడానికి కావాల్సిన వంట పదార్ధాలు :
బ్రెడ్ ముక్కలు - 6-8
ఉల్లిపాయ - 1
టమాటో - 1
క్యారెట్ - 1
పచ్చిమిర్చి - 2-3
కరివేపాకులు
కొత్తిమీర -
ఉప్పు - రుచికి సరిపడా
పసుపు - 1/4 టీ స్పూన్
మిరియాల పొడి - 1/4 టీ స్పూన్
జీలకర్ర - 1/2 టీ స్పూన్
అల్లం-వెల్లుల్లి ముద్ద - 1 టీ స్పూన్
నెయ్యి లేదా నూనె - 2 టేబుల్ స్పూన్లు
నిమ్మరసం - 1 టేబుల్ స్పూన్
నీరు - 1/4 కప్పు
బ్రెడ్ ఉప్మాను ఈ కింది విధంగా తయారు చేసుకోవాలి :
1. బ్రెడ్‌ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అయితే మరీ అంత చిన్నగా కాకుండా ముక్కలు కొంచెం మీడియం సైజులో ఉండే విధంగా చూసుకోవాలి.
2. ఒక పెద్ద ప్యాన్ లో తగినంత నూనెను లేదా నెయ్యిని వేసుకొని అందులో జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు, కరివేపాకులు వేసి ఐదు నిమిశాల వరకు ప్యాన్‌లో ఫ్రై చేసుకోవాలి.
3. ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్‌లోకి రాగానే అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటాలు వేసి మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తరిగిన క్యారెట్ ముక్కలను వేసుకొని మిరియాల పొడి, ఉప్పు, వేసి బాగా కలుపుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తరువాత పావు కప్పు నీళ్లు పోసి కూరగాయలు మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టి ఉడికించాలి.
4. ఇందులో బ్రెడ్ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా 7 నుంచి 8 నిమిశాల వరకు ఉడకనివ్వాలి. కొత్తిమీర చ్లుకొని, నిమ్మరసం పిండుకొని కలిపి, స్టవ్ పై నుంచి ప్యాన్‌ను కిందకు దించివేయాలి.
5. ఇక మీ బ్రెడ్ ఉప్మా రెడీ అయినట్టే. ఈ బ్రెడ్ ఉప్మాను సాంబార్‌తో లేదంటే పచ్చడితో సర్వ చేసుకోవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications