Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
నోరూరించే వంకాయ టమాట పచ్చడి చేసుకుందామా..? చాలా సింపుల్..!
రెగులర్ పచ్చడి కాకుండా కొత్తరకమైన పచ్ఛళ్లు తింటే బాగుంటుంది. ఈ సారి కొత్తగా మీకోసం వంకాయ టమాట పచ్చడి రెసిపీని తీసుకొని వచ్చాము. కొందరు పచ్చడిని మామూలుగా తీసి పారేస్తుంటారు. ప్రతీ రోజు భోజనంలో కొంత పచ్చడిని కలుపుకొని తినడం వల్ల ఎన్నో పోషకాలు అందుతాయ్. స్పైసెస్‌లో వుండే వైటమిన్ సి, జింక్, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా అందుతాయ్. ఇప్పుడు మీకందిస్తున్న ఈ వంకాయ టమాట పచ్చడి రెసిపీని చాలా సింపుల్ గా చేసుకోవచ్చు.
ఎప్పుడూ చేసుకునే వంకాయ మసాలా, వంకాయ కర్రీ కాకుండా ఈ సారి వంకాయ టమాట పచ్చడిని చేసుకుందాం. ఇప్పుడు వంకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
వంకాయ టమాట పచ్చడిని తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్లు
వంకాయలు, టమాట, మంచి నూనె, పల్లీలు, ఎండిమిరపకాయలు, ధనియాలు, జిలకర, కారం, పసుపు, ఉప్పు, కొత్తిమీర ఆకులు, ఎల్లిపాయలు.
వంకాయ టమాట పచ్చడి తయారు చేసుకునే విధానం
1. వంకాయ టమాట పచ్చడి కోసం రెండు వందల గ్రాముల వరకు తెల్ల వంకాయలను తీసుకోవాలి, లేదంటే నార్మల్ వంకాయలను కూడా తీసుకోవచ్చు. పచ్చడి కోసం నాలుగు మీడియం సైజు టమాటలను కూడా తీసుకోవాలి. ఒక బౌల్‌లో నీళ్లను పోసుకొని అందులో కొంత ఉప్పును యాడ్ చేసుకోవాలి. వంకాయలకు వున్న తొడిమెలను తీసివేయాలి. వంకాయలను సన్నముక్కలుగా కోసుకోవాలి. కోసిన వంకాయలన్నింటినీ ఉప్పు నీళ్లల్లోకి తీసుకోవాలి.
2. టమాటలను కూడా అలాగే కట్ చేసుకోవాలి. వీటని ఒక ప్లేట్‌లో తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్‌ను యాడ్ చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ పల్లీలను కూడా తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా పల్లీలను వేయడం వల్ల టేస్ట్ బాగా వస్తుంది. పల్లీలను మరీ ఎక్కువగా ఫ్రై చేయవద్దు. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ధనియాలను, అరటీస్పూన్ జిలుకరను యాడ్ చేసుకొని ఫ్రై చేయాలి. ప్యాన్‌లో పది పన్నెండు ఎండి మిరపకాయలను తీసుకోవాలి. కారం యాడ్ చేసుకుంటం కాబట్టి ఎండి మిరపకాయలను కొన్నింటినే తీసుకోవాలి.
3. ప్యాన్‌లో వున్నదాన్ని మిక్సీ గ్రైండర్‌లోకి తీసుకోవాలి. ప్యాన్ ఖాలీ అయిన తరువాత అందులో కోసుకున్న వంకాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. ప్యాన్‌లో వంకాయ ముక్కలను ఫ్రై చేసుకోవాలి. రుచికి సరిపడ ఉప్పును వంకాయ ముక్కల్లో యాడ్ చేసుకోవాలి.

4. కడాయిలో కొంచెం నూనెపోసుకొని అందులో కట్ చేసుకున్న టమాట ముక్కలను వేసుకోవాలి. కొంత చింత పండును కూడా యాడ్ చేసుకోవాలి. ఇక టీస్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. పావు టీస్పూన్ పసుపును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మూడు నిమిశాల వరకు అలాగే ఫ్రై చేయాలి. టమాట మరీ ఎక్కువగా ఉడకకుండా చూడాలి. ఇందులో కొన్ని కొత్తిమీర ఆకులను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు గ్రైండర్‌లో ఇంతరకు ముందు వేసుకున్న ఎండిమిరపకాయలు, ధనియాలల్లో 7 నుంచి ఎనిమిది ఎల్లిపాయలను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
5. గ్రైండ్ అయిన దాంట్లోకి ఫ్రై చేసిన వంకాయ ముక్కలను వేసుకోవాలి. ఫ్రై చేసిన టమాటలను కూడా యాడ్ చేసుకోవాలి. రోట్‌లో దంచితే ఎలా అవుతుందో అలా మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి. ఆపి ఆపి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి.
6. పోప్ కోసం ఒక ప్యాన్‌లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్‌ను వేసుకోవాలి. అరటీస్పూన్ మినపప్పు, పచ్చి చెనగపప్పు, ఆవాలు, జిలకరను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే సన్నగా కట్ చేసిన రెండు వెల్లుల్లిపాయలను యాడ్ చేసుకోవాలి. రెండు ఎండి మిరపకాయలను, కొన్ని కరివేపాకులను యాడ్ చేసుకోవాలి. ఈ ఫ్రై అవుతున్న పోప్‌లో గ్రైండ్ చేసిన పచ్చడిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక దీంతో వంకాయ టమాట పచ్చడి రెడీ అయినట్టే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications