Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
Butterscotch icecream Recipe : నోరూరిస్తూ నోట్లో కరిగిపోయే బటర్‌స్కాచ్ ఐస్‌స్క్రీం.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండి
బేకరీలోకి వెళ్లగానే ఐసిక్రీం తినాలనిపించినప్పుడు మనకు తినాలనిపించే మొదటి ఫ్లేవర్ బటర్ స్కాచ్. ఈ ఫ్లేవర్‌ను ఇష్టపడనివారు ఉండరు. టేస్టీగా కరకరలాడుతూ తినే బటర్‌స్కాచ్ ఐస్‌క్రీం ఎంత తిన్నా బోరరారు. పిల్లలతో పాటు పెద్దలు కూడా ఎగబడి మరీ ఆరగిస్తారు. క్యాడ్బరీ, పిస్తా లాంటి ఎన్ని ఫ్లేవర్లు ఉన్నా బటర్ స్కాచ్ మాత్రమే ఇష్టంగా తింటారు. ఈ బటర్ స్కాచ్ ఐస్‌క్రీంను ఇంట్లోనే తయారు చేసుకొని తినేలా రిసిపీని మీకు అందిస్తున్నాం. తప్పకుండా ట్రై చేయండి.
బటర్ స్కాచ్ ఐస్‌క్రీం తయారు చేసుకునే విధానం..
1. ఒక ప్యాన్‌లో అరకప్పు పాలు తీసుకొని అందులో అరకప్పు చెక్కర వేసుకొని స్టవ్‌పై పెట్టి బాగా కలుపుకోవాలి. తరువాత ఒక కప్పు పాలల్లో 4 ½ టీ స్పూన్ల కార్న్‌ఫ్లోర్ వేసుకోవాలి. 4.½ టీస్పూన్ల జీఎంసీ పౌడర్, ½ టీస్పూన్ సీఎంసీ పౌడర్ వేసుకోవాలి. ఈ మిక్చర్ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి.
2. ఈ బటర్ స్కాచ్ రెసిపీలో మీకు చెప్పే ఇంగ్రీడియంట్స్ దగ్గరలో ఉన్న అన్ని కిరాణా షాపుల్లో దొరకకపోవచ్చు కానీ ఆన్‌లైన్‌లో ఖచ్చితంగా ఉంటాయ్. అక్కడి నుంచే ఆర్డర్ పెట్టుకోండి. పొంగుతున్న పాలల్లో దీన్ని వేసి కలుపుతూ ఉండాలి. పొంగుతున్నప్పుడే కిందకు దించేసుకోవాలి.

3. ఈ మిశ్రమం మొత్నాన్ని వెంటనే గడ్డలు ఏర్పడకుండా కలుపుతూనే ఉండాలి. ఒక జెల్లడ తీసుకొని ఒక మీడియం సైజ్ ఐస్‌క్రీం బౌల్ తీసుకొని అందులో కలుపుకున్న మిశ్రమాన్ని జెల్లడపడితే గడ్డలను మిశ్రమం నుంచి వేరు చేయొచ్చు. ఈ బౌల్‌కు మూతపెట్టి డీప్ ఫ్రీజర్‌లో 12 గంటల పాటు ఫ్రీజ్ చేయాలి.
4. మార్కెట్‌లో రెడీమేడ్ క్యారమిల్ సాస్‌ను తీసుకోవాలి. ఓ ప్యాన్‌లో ఈ క్యారమిల్ సాస్‌తో 2 టీస్పూన్ల బటర్ వేసి కలుపుకుంటే బటర్ స్కాచ్ ఐస్‌క్రీం కోసం కావలసిన క్యారమిల్ సాస్‌ను రెడీ చేసుకున్నట్టే.
5. రెడీమేడ్‌గా వచ్చే బటర్‌స్కాచ్ నిబ్స్ ఓ అరకప్పు సరిపడా తీసుకొని వాటిని చిన్న సైజులో దంచుకోవాలి. ఫ్రీజర్‌లో పెట్టిన ఐస్‌క్రీమ్ బౌల్‌ను తీసుకోవాలి. అందులో గడ్డకట్టిన దాన్ని తీసుకొని ఒక బౌల్‌లో వేసి విస్కర్‌తో హై స్పీడ్‌తో మిక్స్ చేసుకోవాలి.
6. తరువా ఓ ½ కప్పు క్రీమ్‌ను కూడా విస్కర్‌తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంతకు ముందు విస్కర్‌తో మిక్స్ చేసిన క్రీమ్‌ను ఈ క్రీమ్‌ను రెండింటినీ మల్లీ విస్కర్‌తో హైస్పీడ్‌లో మిక్స్ చెయ్యాలి. ఇలా మిక్స్ చేసిన దాంట్లో ½ టీస్పూన్ వెనిలీ ఎక్స్‌ట్రాక్ట్‌ను వేసుకొని కలుపుకోవాలి.
7. మిక్స్ చేసిన క్రీమ్‌ను మొత్తం ఐస్‌క్రీం బౌల్‌లో వేసుకోవాలి. దానిపై క్యారమిల్ సాస్‌ను వేయాలి, ఆపైన బటర్‌స్కాచ్ నిబ్స్‌ను చల్లుకోవాలి. ఇలా 2 నుంచి మూడు లేయర్లను ఒక బౌల్‌లో వేసుకోవచ్చు. ఇలా బౌల్‌లో వేసి మూత పెట్టుకొని 24 గంటలు డీప్‌ఫ్రీజర్‌లో ఉంచాలి.
ఒక రోజు తరువాత ఆ బౌల్‌ను బయటకు తీసి చూస్తే మీ నోరూరించే నోట్లో కరిగిపోయే బటర్‌స్కాచ్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications