Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
కరకరలాడే క్యాబేజ్ 65ని ఈ స్టైల్లో ఎప్పుడైనా చేసుకున్నారా..?
కరకరలాడే క్యాబేజీ 65 కర్రీని ఎలా చేయాలో మీకు అందించబోతున్నాం. చికెన్ 65 గోబీ65 లాంటి మనం టేస్ట్ చేసి ఉంటాం, కానీ క్యాబేజీ 65 ని కూడా చేసుకోవచ్చు. చాలా సింపుల్ గా టేస్టీగా ఇంట్లో ఉన్న వంట సామాగ్రితోనే క్యాబేజీ 65 ని చేసేసుకోవచ్చు.
క్యాబేజీ 65 తయారు చేయడానికి కావాల్సిన వంట సామాగ్రి
క్యాబేజీ, ఉప్పు, కారంపొడి, ధనియాల పొడి, జిలుకర పొడి, గరం మసాల, వెల్లుల్లి పేస్ట్, మైదా పిండి, కార్న్ ఫ్లోర్, బియ్యం పిండి, చిటికెడంత కలర్, నిమ్మ రసం, మంచినూనె, కాజూ, పచ్చి మిరపకాయలు, కరివేపాకులు.

క్యాబేజీ 65 తయారు చేసుకునే విధానం
క్యాబేజీ 65 ని చేయడానికి ఒక మీడియం సైజ్ క్యాబేజీని తీసుకోవాలి. క్యాబేజీ ని మీడియం సైజులో కట్ చేసుకోవాలి. కట్ చేసిన మూడు కప్పుల క్యాబేజిని బౌల్ లో వేసుకోవాలి అందులో తగినంత ఉప్పును యాడ్ చేసుకోవాలి. రెండు స్పూన్ల కారంపొడిని, ఒక టీ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. అర టీ స్పూన్ జిలుకర పొడిని, అర టీ స్పూన్ గరం మసాల పొడిని యాడ్ చేసుకోవాలి.
ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను కూడా వేసుకొని మొత్తం క్యాబేజీ ని బాగా మారినెట్ చేసుకోవాలి. అర కప్పు మైదా పిండిని, పావు కప్పు కార్న్ ఫ్లోర్ ని కూడా యాడ్ చేసుకోవాలి. రెండు టీ స్పూన్ల బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి బాగా కలుపుకోవాలి. చిటికెడంత కలర్ ను యాడ్ చేసుకోవాలి. రెండు టీ స్పూన్ల నిమ్మ రాసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి.

ఇప్పుడు ప్యాన్ లో ఫ్రై చేయడానికి తగినంత మంచినూనెను పోసుకోవాలి. మారినెట్ చేసుకున్న క్యాబేజీని నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్లో గా టర్న్ చేసుకుంటూ క్యాబేజ్ మాడిపోకుండా జాగ్రత్త పడాలి. క్రిస్పీ గా ఫ్రై అయిన క్యాబేజీని ప్యాన్ లోంచి బయటకు తీసుకోవాలి.
ప్యాన్‌లోని అదే నూనెలో కాజూనె, మచ్చిమిరపకాయలను, కరివేపాకులను ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న వీటిని క్యాబేజీ పై వేసుకొని సర్వ చేసుకోవచ్చు. ఇక దీంతో క్యాబేజీ 65 రెడీ అయినట్టే.
క్యాబేజీలో వుండే ఆరోగ్య పోషకాలు
క్యాబేజీలో క్యాన్సర్ కణాలతో పోరాడే శక్తి వుంటుంది. క్యాన్సర్ కణాలు పెరగకుండా క్యాబేజీ నియంత్రిస్తుంది. క్యాబేజీలో వుండే ఆంథోసైనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ అనేక క్యాన్సర్ కణాలతో పోరాడుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
క్యాబేజీలో పొటాషియం కూడా మెండుగా వుంటుంది. దీని వల్ల హైపర్ టెన్షన్ కంట్రోల్‌లో వుంటుంది. డయాబెటిక్ పేషంట్లు క్యాబేజీ తినడం వల్ల రక్తంలో చెక్కర స్థాయి కంట్రోల్‌లో వుంటుంది. ఇందులో వుండే వైటమిన్ సి వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. చలికాలంలో క్యాబేజీని ఎక్కువగా తినడం వల్ల దగ్గు, జలుబు, బర్డ్ ఫ్ల్యూ లాంటి ఇన్‌ఫెక్షన్లకు దూరంగా వుంటారు.
క్యాబేజీలో వుండే ఫైబర్ కంటెంట్ వల్ల మలబద్దకం సమస్య కూడా తగ్గుతుంది. క్యాబేజీ వల్ల జీర్ణప్రక్రియ కూడా మెరుగుపడుతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications