Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
తమిళనాడు స్పెషల్ క్యాబేజీ కూటు..ప్రొటీన్ లోడెడ్ డిష్..!!
క్యాబేజీ కూటు అనేది దక్షణ భారత దేశంలో చాలా ప్రత్యేకమైన డిష్. రుచి మాత్రమే కాదు, ఇందులో ప్రొటీన్ కంటెంట్ కూడా ఎక్కువగా వుంటుంది. ఈ డిష్ ముఖ్యంగా తమిలనాడు ప్రజల వంటకంగా చెప్పుకోవచ్చు. కూటు అనే పదం తమిళం నుంచి వచ్చింది. తమిళనాడుతో పాటు ఈ కర్నాటక, కేరళలో కూడా ఈ డిష్ చాలా పాపులర్. పప్పు, క్యాబేజ్, స్పైసెస్, కూరగాయలు, చింతపండు, కొబ్బరి, కరివేపాకులతో ఈ డిష్‌ను మనం తయారు చేస్తారు.
ఎలక్ట్రిక్ కుక్కర్‌లోనైనా సరే ఈ క్యాబేజ్ కూటును చేసుకోవచ్చు. అనేయ రకాల కూరగాయలతో కూటును చేస్తారు. మునక్కాయ, పొట్టకాయ, గుమ్మడికాయ, వంకాయ, ఇలా చాలా రకాల కూరగాయలతో కూటును చేస్తారు. ఇప్పుడు మనం క్యాబేజీకూటును ఎలా చేస్తారో తెలుసుకుందాం.

క్యాబేజీ కూటు కోసం కావాల్సిన పదార్ధాల చిట్టా
1/2 కప్పు కంది పప్పు
2 కప్పులు తరిగిన క్యాబేజీ
3 టేబుల్ స్పూన్ల చింతపండు
రుచి సరిపడ ఉప్పు
తగినంత పసుపు
3 టేబుల్ స్పూన్ల కొబ్బరి
5 ఎండి మిరపకాయలు
1/2 టీస్పూన్ జీలకర్ర
ఒకటిన్నర టేబుల్ స్పూన్ల చనా పప్పు
3 టీ స్పూన్ల నెయ్యి
కొన్ని కరివేపాకులు
చటికెడు ఇంగువ
క్యాబేజీ కూటును ఈ కింది విధంగా తయారు చేసుకోవాలి
1. పురుగులు లేని మంచి క్యాబేజీని మార్కెట్లో తీసుకోవాలి. దాన్ని బాగా కడిగిన తరువాత రెండు కప్పులంత క్యాబేజీని బాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తరువాత కూడా క్యాబజీని ఒక సారి బాగా కడగాలి. అలా కడగడం ద్వారా చెత్త, మందు ఏదైనా వుంటే పోతుంది.
2. 3 టేబుల్ స్పూన్ల చింతపండును వేడి నీళ్లల్లో నానబెట్టాలి. కుక్కర్‌లో అరకప్పు పప్పును తీసుకోవాలి. కందిపప్పైనా, లేదంటే పెసరపప్పునైనా తీసుకోవచ్చు.
3. నీళ్లు పోసి పప్పును బాగా శుభ్రం చేసుకోవాలి. పప్పు బాగా ఉడికేలా ఒకటిన్నర కప్పుల నీళ్లను పోసుకోవాలి, 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్‌లో పప్పును బాగా ఉడకనివ్వాలి.
4. పప్పు ఒకవైపు ఉడుకుతున్నప్పుడే 2 కప్పుల కోసిన క్యాబేజీని ఉప్పు నీళ్లల్లో వేసి బాగా కడగాలి. ఇప్పుడు ఒక కడాయ్ లో 1 టీ స్పూన్ మంచి నూనె వేసి 4 ఎండిమిరపకాయలు, ఒకటిన్నర టీ స్పూన్ చెనగప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి.
5. ఇప్పుడు ఇవి చల్లారిన తరువాత వాటిని మిక్సీలో వేసి రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి, 1/2 టీస్పూన్ జీలకర్ర వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. కొన్ని నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
6. పప్పు ఉడికిన తరువాత పప్పు గొట్టంతో పప్పును మెత్తగా రుబ్బుకోవాలి. అందులో క్యాబేజీని వేసి ఉడికించాలి. 5 నుంచి 8 నిమిశాల వరకు ఉడికబెట్టాలి. గ్రైండ్ చేసుకున్న పేస్టును కూడా ఇందులో వేసుకొని కొన్ని వేడినీళ్లను పోసుకొని కొన్ని నిమిశాలు ఉడికించాలి. చింతపండు రసాన్ని కూడా పోసుకోవాలి.
7. ప్యాన్‌ను వేడి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. 1/2 టీస్పూన్ ఆవాలు, 1 ఎండి మిరపకాయ, 10 కరివేపాకులను యాడ్ చేసుకోవాలి. చిటికెడంత ఇంగువను కూడా వేసుకోవాలి. ఈ పోప్‌ను ఉడుకుతున్న పప్పులో పోయాలి. ఇక దీంతో క్యాబేజ్ కూటు రెడీ అయినట్టే.
8. క్యాబేజ్ కూటును అన్నం లేదంటే పుల్కా, చపాతీతో కూడా తెనవచచు. ఇది చేయడం చాలా సింపుల్, కానీ కొంత సమయాన్ని కేటాయించాలి అంతే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications