Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
కొబ్బరి పాలతో ఇలా క్యారెట్ కర్రీ చేసుకొని చపాతీతో తింటే..ఆహా..!!
క్యారెట్ కర్రీ కేవలం షోషకాలు వున్న కర్నీ మాత్రమే కాదు చాలా రుచిగా కూడా వుంటుంది. ఇందలో క్యారెట్‌తో పాటు ఉల్లిపాయలు, టమాటలు, కొబ్బర, పాలు వేయడం వల్ల టేస్ట్ బాగా వస్తుంది. మన భారతీయలమ దేనితో అయినా కూరను చేసేయొచ్చు ఈ క్యారెట్ కర్రీ కూడా అలా చేసిందే. ఈ క్యారెట్ కర్రీని బాస్మతీ అన్నంలో, చపాతీలో కలుపుకొని తింటే ఇక ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేము. అయితే అన్ని కూరలు చేసినట్టుగా క్యారెట్ కర్రీని మనం చేయలేము. ఈ కూరలో గ్రేవీ కోసం యోగర్ట్ లేదంటే కొబ్బరిపాలను వేయాల్సి వస్తుంది. క్యారెట్ కర్రీ బాగా రావాలంటే మంచి క్యారెట్లను ఎంచుకుంటేనే సాధ్యమన్న విషయాన్ని మరిచిపోవద్దు.

క్యారెట్ కర్రీ కోసం సమకూర్చుకోవాల్సిన వంట పదార్ధాలు
మంచి నూనె
1/2 టీస్పూన్ ఆవాలు
1/2 టీ స్పూన్ జీలకర్ర
1.1/2 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు
కరివేపాకులు
ఉల్లిపాయలు
1 టీ స్పూన్ అల్లం ముక్కలు
1 టీ స్పూన్ వెల్లుల్లి
1 పచ్చిమిర్చి
1 కప్పు టమాటాలు
ఒకటిన్నర టీ స్పూన్ కారంపొడి
చిటికెడంత పసుపు
1 టీ స్పూన్ గరం మసాలా
ఒకటిన్నర టీ స్పూన్ కొత్తిమీర పొడి
1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి
ఉప్పు
2 కప్పుల కట్ చేసిన క్యారెట్ ముక్కలు
1 కప్పు బఠానీలు
1 టీస్పూన్ కసూరి మేథి
1 కప్పు కొబ్బరి పాలు
15 కాజూ ముక్కలు
క్యారెట్ కర్రీని ఇలా చాలా సింపుల్‌గా రెడీ చేసుకోవాలి. ఈ స్టైల్లో చేసుకుంటే కూర చాలా రుచిగా వస్తుంది.
1. స్టవ్‌పైన ప్యాన్‌ను పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల మంచి నూనెను పోసుకోవాలి. అర టీస్పూన్ ఆవాలు, ఆర టీస్పూన్ జిలుకరను కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేయాలి.
2. 1.1/2 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలను, కొన్ని కరివేపాకు ముక్కలను ప్యాన్‌లో వేసుకొని కలుపుకోవాలి.
3. ఉల్లిపాయలు కలర్ మారేంత వరకూ ఫ్రై చేస్తూనే వుండాలి. 1 టీ స్పూన్ అల్లం ముక్కలు, 1 టీస్పూన్ వెల్లుల్లి, 1 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చి వాసన వచ్చేంతవరకూ ఫ్రై చేస్తూనే వుండాలి.
4. 1 కప్పు టమాటాలను గ్రైండ్ చేసుకొని ఆ పేస్టును ప్యాన్‌లో వేసుకొని బాగా కలుపుకోవాలి.
5. ఒకటిన్నర టీ స్పూన్ కారంపొడి, చిటికెడంత పసుపు, 1 టీస్పూన్ గరం మసాలా, ఒకటిన్నర టీ స్పూన్ కొత్తిమీర పొడి, సగం టీ స్పూన్ జీలకర్ర పొడి, రుచికి సరిపడ ఉప్పును కూడా వేసుకొని ప్యాన్‌లో బాగా కలుపుకోవాలి.
6. 5 నిమిశాల వరకు అలాగే ఫ్రై చేయాలి. అలా చేసినప్పుడు పచ్చివాసన పోయి మంచి రుచికరమైన వాసన వస్తుంది.
7. 2 కప్పుల కట్ చేసిన క్యారెట్ ముక్కలను వేసకోవాలి. 1 కప్పు బఠానీలను కూడా వేసుకోవాలి. 3 నిమిశాల వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. 1 కప్పు నీళ్లను కూడా పోసుకోవాలి.
8. క్యారెట్లు మరీ మెత్తగా ఉడకకుండా చూసుకోవాలి. 1 టీస్పూన్ కసూరి మేథీని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక కప్పు కొబ్బరి పాలను యాడ్ చేసుకోవాలి. 15 కాజూలను మిక్సీలో వేసి కొన్ని నీళ్లను పోసుకొని పాలలా మిక్సీలో రుబ్బుకొని దాన్ని కూరలో యాడ్ చేసుకోవాలి.
9. 5 నిమిశాల వరకు కూరను బాగా ఉడికించాలి. రుచికి సరిపడ ఉప్పును వేసుకోవాలి. కర్రీ రెడీ అయిన తరువాత రుచిగా వుందా లేదా చెక్ చేసుకోవాలి. తగినంత ఉప్పును వేసుకోవాలి.
10. ఇక దీంతో మీ క్యారెట్ కూర రెడీ అయినట్టే. బిర్యానీలో లేదంటే చపాతీలో కలుపుకొని కడుపునిండా తినవచ్చు. రాచికి రుచి, శరీరానికి మంచి పోషకాలు అందుతాయ్.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications