Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
Carrot Halwa : నోరూరించే క్యారెట్ హల్వా.. చేయడం చాలా సింపుల్..
సింపుల్‌గా త్వరగా తయారు చేసుకోగల స్వీట్ క్యారెట్ హల్వా. దీనినే గాజర్ కా హల్వా అని కూడా అంటారు. నార్త్ ఇండియాలో ఇది చాలా ఫేమస్ స్వీట్. క్యారెట్‌తో చేస్తాము కాబట్టి ఈ స్వీట్ హెల్త్‌కి కూడా చాలా మంచిది. తక్కువ ఇంగ్రీడియంట్లతో త్వరగా తయారు చేసుకోవచ్చు. క్యారెట్ హల్వా ఎలా తయరు చేసుకోవచ్చో తెలుసుకుందాం.
క్యారెట్ హల్వా తయారు చేసే విధానం..
ఫ్రెష్ క్యారెట్లు
క్యారెట్ హల్వాలో క్యారెట్లే ప్రదానం కాబట్టి 1 కేజీ ఫ్రెష్ క్యారెట్లు తీసుకోవాలి. ముదిరిపోయినవి లేకుండా ఉండేట్లు చూసుకొని తీసుకోవాలి. క్యారెట్లను కడిగి పై పొట్టు తీసి ఒక బౌల్‌లో తీసుకోవాలి.
క్యారెట్ హల్వా కోసం ఒక్కో క్యారెట్‌ను తురమడానికి చాలా సమయం పడుతుంది. అలా కాకుండా సులభంగా క్యారెట్‌ను తురమాలంటే క్యారెట్‌ను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చిన్నగా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ముక్కలు బరకగా అయ్యేట్టుగా గ్రైండ్ చేసుకోవాలి.

చిక్కటి పాలు తప్పనిసరి
తరువాత ప్యాన్‌లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి అందులో తురిమిన క్యారెట్‌ను వేసి రెండు నిమిషాల వరకు బాగా కలుపుకోవాలి. పచ్చి పచ్చిగా ఉండే క్యారెట్ వాసన పోయేంత వరకు, క్యారెట్ కొంచం బ్రౌన్ కలర్‌లో వచ్చేంతవరకు అలాగే కలుపుకోవాలి.
ఒక కప్పులో చిక్కటి పాలను తీసుకోవాలి. ప్యాన్‌లో ప్రై అవుతున్న క్యారెట్‌లో ఆ పాలను పోసి కలుపుకోవాలి. చిక్కటి పాలను మాత్రమే తీసుకోవాలి. క్యారెట్ హల్వా టేస్టీగా రావాలంటే క్యారెట్, పాలను కొనే ముందు జాగ్రత్తలు తీసుకుంటే స్వీట్ ఇంకా బాగా అవుతుంది. పాలు, క్యారెట్ రెండింటినీ మిక్స్ చేసాము కాబట్టి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అరగంట పాటు క్యారెట్, పాటు రెండూ మిక్స్ అయ్యేట్టుగా కలుపుకోవాలి.
పాలు చెక్కర పూర్తిగా కలవాలి
క్యారెట్ పాలు కలిసి మెత్తగా అయిన తరువాత అందులో ఒక కప్పున్నర చెక్కర వేసుకోవాలి. రెండింటినీ బాగా మిక్స్ చేయాలి. ఇలా 20 నిమిషాల పాటు కలుపుకోవాలి. చెక్కర పాకం, పాలు, రెండూ ప్యాన్‌లో మిగలకుండా క్యారెట్‌లో కలిసిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్‌పై ప్యాన్‌ను వుంచి కలుపుకుంటూ ఉండాలి.
కోవా లేదా పాలు కలుపుకోవచ్చు
తరువాత రెండు టేబుల్ స్పూన్ల కోవాను యాడ్ చేసుకోవాలి. ఇక మళ్లీ మొత్తం క్యారెట్ హల్వాను బాగా కలుపుకోవాలి. ఎలాంటి గ్రేవీ సూప్ ప్యాన్‌లో లేకుండా కలుపుకోవాలి. టేస్ట్ కోసం యాలాకుల పొడి, తరుమిన డ్రైఫ్రూట్‌ను వేసుకోవచ్చూ. క్యారెట్ హల్వా కొంచెం ఎర్రగానే ఉంటుంది కాబట్టి ఎలాంటి కలర్‌ను యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు కావాలంటే ఓ చిటికెడు ఆరెంజ్ కలర్‌ను యాడ్ చేసుకోవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications