Latest Updates
-
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి!
నార్త్ ఇండియన్ స్టైల్లో చనా మసాలా.. వండుతుంటేనే లాలాజలం పొంగిపోతుంది..!
చనా మసాలా చేస్తూ వుంటే ఆ సువాసన, రుచికరంగా వుండడంతో నోట్లో వండుతున్నప్పుడే లాలాజలం పొంగుతుంది. శాఖాహారులకు ఈ చనా మసాలా మంచి ప్రొటీన్ ప్యాక్ డిష్‌గా చెప్పుకోవచ్చు. ఈ కర్నీని బగారా అన్నం లేదంటే చపాతీలో తింటే చాలా బాగుంటుంది. ఇక పూరీలో అయితే చాలా సూపర్‌గా వుంటుంది. ఇది తయారు చేయడానికి ఇంట్లో వున్న మసాలాలు అదనంగా చెనగలు వుంటే సరిపోతుంది. ఎక్కువ వంట పదార్ధాలు కూడా అవసరం చలేదరు. పంజాబ్ రాష్ట్రంలో ఇది చాలా పాపులర్ డిష్. అక్కడి నుంచి ఈ వంటకం దక్షిణ భారత దేశం వరకూ వచ్చి పాపులారిటీని సంపాదించుకుంది. రుచి, స్పైసీతో పాటు ఈ చనామసాలాలో మంచి పోషకాలు కూడా వున్నాయ్.

image courtesy : seriouseats
చనా మసాలా తయారు చేసుకోవడానికి ఈ కింది పదార్ధాలను రెడీ చేసుకోవాలి.
1 కప్పు చెనగలు
నీళ్లు
2 టేబుల్ స్పూన్ల మంచి నూనె
చిన్న దాల్చిన చెక్క
3 లవంగాలు
2 యాలాకులు
1.1/2 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు
2 పచ్చి మిరపకాయలు
1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు
1.1/2 కప్పు సన్నగా తరిగిన టమాటలు
రుచికి సరిపడ ఉప్పు
తగినంత పసుపు
1.1/2 టీ స్పూన్ కారంపొడి
2 టీ స్పూన్ల ధనియాల పొడి
1/2 టీ స్పూన్ జీలకర్రపొడి
1 టీ స్పూన్ కసూరి మేతి
1/4 టీ స్పూన్ ఆమ్చూర్
2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర ఆకులు
చనా మసాలాను ఈ కింది విధంగా తయారు చేసుకోవాలి.
1. ఒక బౌల్లో 1 కప్పు చెనగలు వేసి బాగా కడిగి వాటిని మంచినీళ్లు పోసి నానబెట్టాలి. 8 గంటలు అవి నానిన తరువాత వాటిని మళ్లీ నానబెట్టాలి.
2. ప్రెజర్ కుక్కర్లో 1.1/2 కప్పు మంచి నీళ్లు పోసి అందులో ఈ చెనగలు వేసి 5 విజిల్స్ వచ్చే వరకు పెట్టి బాగా ఉడికించాలి. తరువాత మూతతీసి ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి. సరిగ్గా ఉడకకపోతే మళ్లీ విజిల్ పెట్టి ఉడికించాలి.
3. ఒక ప్యాన్‌లో 2 టేబుల్ స్పూన్ల వేడి చేసి నూనె వేసి లవంగాలు, దాల్చిన చెక్క, యాలాకులు, బగారా ఆకు వేసుకోవాలి. ఇందులో సన్నగా తరిగిన 2 మీడియం సైజు ఉల్లిపాయలను వేసుకోవాలి. అవి బంగారు రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. 10 నిమిశాలు ఫ్రై చేసిన తరువాత అందులో పచ్చిమిరపకాయలను వేసుకోవాలి.
4. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును కూడా యాడ్ చేసుకోవాలి.1.1/2 కప్పు తరిగిన టమాటాలను వేసుకోవాలి. అందులో రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. టమాట మెత్తగా అయ్యేంత వరకు ఉడికించాలి.
5. 1.1/2 టీ స్పూన్ కారంపొడి, 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తన్నీ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కలుపుకోవాలి.
6. ఇప్పుడు ఉడికించిన చెనగలను ఇందులో వేసుకోవాలి. మీకు గ్రేవీ ఎంత అవసరమౌతుందో అన్ని నీళ్లు పోసుకోవాలి. 1 కప్పు నీళ్లు గ్రేవీకి సరిగ్గా సరిపోతుంది. మీకు రుచికి కావాల్సిన ఉప్పుును యాడ్ చేసుకోవాలి. 15 నిమిశాల వరకు మూత పెట్టి ఉడికించాలి.
7. 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, 1 టీస్పూన్ కసూరి మేతిని కూడా యాడ్ చేసుకోవాలి. మీకు కావాలనుకుంటే కొంత నిమ్మరసాన్ని కూడా ఇందులో పిండుకోవచ్చు. ఇక దీంతో మీ చనా మసాలా తినడానికి రెడీ అయినట్టే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications