Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
కరకరలాడే చకోడీలు.. వేల ఏళ్లుగా చేస్తున్న టేస్టీ డిష్..!!
చకోడీలు సాయంత్రం సమయంలో కాలక్షేపానికి తినడానికి చాలా బాగుంటాయ్. స్వీట్ షాపుల్లో ఎన్ని ఉన్నా మన కళ్లు వాటిపైన పడతాయ్. ఎన్నో తిన్నా కూడా బోర్ కొట్టదు. ఇక చకోడీలు చరిత్ర చూస్తే..చకోడీలు పుట్టింది మన దక్షిణ భారతదేశంలోనే. వందల ఏళ్లుగా ఈ చకోడీల వంటకాన్ని చేసుకుంటున్నారు. తమిళనాడులో చకోడీలను మురుక్కు, కర్నాటకలో చక్లీ అని అంటారు. పండగలు వస్తే చకోడీలను చేసుకొని తినాల్సిందే. మసాలా చకోడీ, మైసూర్ చకోడీ ఇలా చాలా రకాల చకోడీలు ఉంటాయ్. అయితే ఈ చకోడీలను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
చకోడీలు తాయరు చేయడానికి కావాల్సిన వంట సామాగ్రి :
శనగ పిండి - 2 కప్పులు
శెనగల పప్పు - 1/2 కప్పు
జీలకర్ర - 1 టీస్పూన్
తగినంత ఉప్పు
ఎండు మిరపకాయలు - 5
కరివేపాకు - 1 రెమ్మ
వెల్లుల్లి - 5-6 రెబ్బలు
నూనె - కావలసినంత (డీప్ ఫ్రై కోసం)
పచ్చిమిర్చి - 2
నీరు - అవసరమైనంత
చకోడీలను ఈ కింది విధంగా తయారు చేసుకోవాలి :
1. ముందుగా శనగ పిండిని ఒక గిన్నెలో వేసి, అందులో తగినంత ఉప్పు జీలకర్రను కలపాలి. శెనగల పప్పును కొంచెం ఫ్రై చేసుకొని, మెత్తని పొడిగా చేసుకొని, ఈ పొడిని శనగ పిండిలో కలపాలి.
ఎండు మిరపకాయలను, పచ్చిమిర్చిని, కరివేపాకు, వెల్లుల్లిని ఒక మిక్సీలో వేసి మెత్తని పేస్ట్‌గా తయ్యారుచేయాలి. ఈ పేస్ట్‌ను కూడా పిండిలో కలపాలి.
ఒక పెద్ద పాన్‌లో నూనె వేసి, దాన్ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టాలి. నూనెను మరీ ఎక్కువ వేడి చేయకుండా మాడిపోకుండా ఉండేలా నూనెను కాగపెట్టుకోవాలి.
పిండిలో కొన్ని నీళ్లు పోసుకొని జాగ్రత్తగా కలుపుకోవాలి. మరీ పలుచగా కాకుండా గట్టిగా కాకుండా చకోడీలు వేసుకునే విధంగా కలుపుకోవాలి. పిండిని ఇప్పుడు చిన్న ఉండలుగా చేసుకొని వాటిని చెకోడీలుగా చేయాలి. వీటిని నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి.
అయితే చకోడీలను నూనెలో వేసి ఎక్కువ ఫ్రై చేయకుండా మీడియంలోనే ఫ్రై చేసి ఎక్కువ మాడిపోకుండా జాగ్రత్త పడాలి. బ్రౌన్ కలర్‌లోకి రాగానే వెంటనే నూనెలోంచి తీయాలి. ఇక దీంతో చకోడీలు రెడీ అయినట్టే. సాయంత్రం వర్షం పడుతుంటే చాయ్ తాగుతూ చెకోడీలు తింటే ఆ మజానే వేరబ్బా.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












