Latest Updates
-
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.!
నోరూరించే చికెన్ 65.. 20 నిమిషాల్లో రెడీ..
నాన్‌వెజ్‌లో చికెన్ కు ఉండే రుచే వేరయా అని అనుకుంటాం. చికెన్ లో ఉన్నన్ని వెరైటీస్ ఇంకే నాన్‌వెజ్‌లో ఉండవేమో అనిపిస్తుంది. ఈ వీకెండ్‌లో మరో చికెన్ వెరైటీని మీకోసం అందిస్తున్నాం. రెసిపీ పాతదే అయినా ఎప్పటికీ బోర్ కొట్టని చికెన్ ఐటమ్, అదే చికెన్ 65.
చికెన్ 65ని తయారు చేసుకోవాలంటే ఎక్కువ సమయం పట్టదు. అరగంట లోపే ఈ వంటకాన్నిపూర్తి చేసి భోజనం కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ అవసరం వుండదు. వంటింట్లో ఉన్నవాటితోనే టేస్టీగా చికెన్ 65ని చేసుకోవచ్చు. మరి ఈ చికెన్ 65ని ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం.
అరకేజీ బోన్‌లెస్ చికెన్‌ను మీడియం సైజులో కట్ చేయించి బాగా కడిగి ఒక బౌల్‌లో తీసుకోవాలి. అందులో అర టీస్పూన్ మిరియాల పొడి, రెండు టీ స్పూన్ల కారం, ఒక టీస్పూన్ ధనియాల పొడి, తగినంత ఉప్పుడు, వెల్లుల్లి పేస్టు, చిటికెడు పసుపు, కొంత గరం మసాలా వేసుకొని బౌల్‌లో చికెన్ ముక్కలను వేసిన వాటితో బాగా కలిపి మొత్తం మారినేట్ చేసుకొవాలి. అరటీస్పూన్ వచ్చేంత నిమ్మరసాన్ని పిండుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. చికెన్‌కు మసాలా, కారం బాగా పట్టేలా కలుపుకోవాలి. తరువాత బౌల్‌ను మూతతో కప్పివేసి 1 గంటపాటు అలాగే వదిలేయాలి.

గంట తరువాత బౌల్‌లో రెండు టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోర్ పొడిని వేసి బాగా కలుపుకోవాలి. ఒక గుడ్డులో ఉన్న పచ్చ సొన తీసివేసి కేవలం ఎగ్ వైట్‌ను మాత్రమే చికెన్‌లో వేసి దాన్నికూడా బాగా కలుపుకోవాలి. మళ్లీ ఒకసారి చికెన్‌ను బౌల్‌లో బాగా మారినేట్ చేసుకోవాలి.
చికెన్‌ను ఫ్రై చేయడానికి స్టవ్‌పై ప్యాన్‌ను పెట్టుకొని అందులో సరిపడినంత నూనె వేసుకొని చికెన్ ముక్కలను వేసి ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే ఈ చికెన్ ముక్కలను ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ నుండి ముక్కలను ఒక బౌల్‌లోకి తీసుకోవాలి.
ఈ చికెన్ ముక్కలను మళ్లీ రెండవ సారి ఫ్రై చేయవలసి వుంటుంది. ప్యాన్‌లో నూనె కాగిన తరువాత మొదట ఫ్రై చేసిన చికెన్ ముక్కలను మళ్లీ ప్యాన్‌లో వేసి మళ్లీ ఫ్రై చేయాలి. చికెన్ క్రిస్పీగా రావడానికి ఇలా రెండు సార్లు మనం చికెన్‌ను ఫ్రై చేసుకుంటాం. ఫ్రై అయ్యే టప్పుడు అందులో తగినని కరివేపాకులను, పచ్చి మిర్చిని వేసుకోవాలి.
రెండు నిమిషాలు హై ఫ్లేమ్‌లో పెట్టుకొని చికెన్ ముక్కలను ఫ్రై చేసుకున్న తరువాత వాటిని ప్లేట్‌లో తీసుకొని ఇక తినడమే ఆలస్యం. చికెన్ 65 రెడీ. చాలా సింపుల్‌గా, టేస్టీగా చికెన్ 65ని తయారు చేసుకున్నాము.
చికెన్ 65లో ఉండే పోషకాలు
నాలుగు చికెన్ పీసులు తింటే అందులో మొత్తం 208 క్యాలరీలు వుంటాయ్. 11 గ్రాముల కొవ్వు, ప్రొటీన్లు 17 గ్రాములు, కార్బోహైడ్రేట్లు 8 గ్రాములు. వీటితో పాటు వైటమిన్ సి, వైటమిన్ ఏ, క్యాల్షియం, ఐరన్ కూడా ఉన్నట్లు పోషక నిపుణులు చెబుతున్నారు.
రెడ్ మీట్ కన్నా చికెన్ చాలా ఆరోగ్యకరమని పరిశోధనలో తేలింది. నాలుగు కాళ్ల జంతువుల మాంసాన్ని రెడ్ మీట్ అంటాము. మటన్‌తో పోలిస్తే చికెన్ ఆరోగ్యానికి మంచదని కొందరి నిపుణుల అభిప్రాయం.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications