Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
టేస్టీ చికెన్ ఫ్రై చేసుకుందామా.. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది
చికెన్ లో మనకి లెక్కలేనన్ని వెరైటీస్ ఉంటాయి. ఎన్ని వెరైటీలు వచ్చిన చికెన్ ఫ్రై కి ఉన్న పాపులారిటీ అస్సలు తగ్గదు. మాంసంలో ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ లేని వంటకం కూడా చికెన్ అని పరిశోధనలో తేలింది. టేస్టీగా ఇంట్లో ఉన్న వాటితోనే చికెన్ ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు చికెన్ ఫ్రై రెసిపీ ని మీకోసం అందిస్తున్నాం.
చికెన్ ఫ్రై కోసం అర కిలో బోన్ లెస్ చికెన్ ని తీసుకోవాలి. బోన్ లెస్ లో నాలుగు లెగ్ పీసులు ఉండేలా చూసుకోవాలి. చికెన్ ను ముందుగా బాగా కడగాలి. మీకు కావలసినంత లేదా తగినంత కారం ఉప్పు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం మారినెట్ చేసుకున్న తరువాత. బౌల్ కి మూత పెట్టి 30 నిమిషాలు అలాగే వదలాలి.

ఇప్పుడు ఒక చిన్న బౌల్ లో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని అందులో ఐదు కాజులు వేసుకోవాలి, దాల్చిన, లవంగా, నాలుగు ఎండి మిరపకాయలు, జిలకర, ఒక టీ స్పూన్ మిరియాలను కూడా ఆడ్ చేసుకోవాలి. వీటిని ఒక పాన్లో తీసుకొని స్టవ్ పై రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తరువాత మిక్సీ లో గ్రైండ్ చేసుకోవాలి.
తరువాత ఒక ప్యాన్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అరకప్పు ఉల్లిగపాయలను వేసకొని మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. తరువాత మూడు కరివేపాకులు, ఒక టీస్పూన్ వెల్లుల్లి ప్లేస్ట్, నాలు పచ్చిమిరప కాయలను వేసి ఉల్లిపాయలతో ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు మారినేట్ చేసిన చికెన్ ముక్కలను దీంట్లో ఈ ప్యాన్‌లో వేసుకోవాలి. 3 నుంచి 4 నిమిషాలు కలిపిన తరువాత మళ్లీ అరకప్పు పెరుగు వేసుకొని మళ్లీ మొత్తం కర్నీని కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్ సగానికి పైగా కొంచం ఉడికిన తరువాత అందులో గ్రైండ్ చేసుకున్న మసాలా పొడిని వేసుకోవాలి. మారినేట్ చేసినప్పుడు కలిపిన కారం కంటే మరింత మిర్బీగా కారంగా ఉండాలనుకుంటే దీంట్లో ఒక టీస్పూన్ కారం, తగినంత ఉప్పు వేసుకోవచ్చు.
చికెన్ మొత్తం ఉడికేంత వరకూ చూసుకోవాలి. బాగా ఉడికిన తరువాత కావలసినంత కొత్తిమీర ఆకులను వేసుకొని కలుపుకోవాలి. కొంచం పుల్లగా టేస్ీగా వుండాలనుకుంటే తగినంత నిమ్మరసాన్ని కూడా అందులో పిండుకోవచ్చు. ఇక దీంతో చికెన్ ఫ్రై రెడీ. ఈ చికెన్ ఫ్రైను నేరుగా అలాగే తినవచ్చు లేదంటే చపాతీ, రైస్ కాంబినేషన్‌తో కూడా తినవచ్చు. ఈ వీకెండ్‌లో ఈ చికెన్ ఫ్రై రెసిపీని తప్పక ట్రై చేయండి.
చికెన్ ఫ్రైలో పోషకాలు
చికెన్ ఫ్రై ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అయితే ఏవన్నా తీవ్ర అనారోగ్య సమస్యలు వుంటే వైద్యులను సంప్రదించి మాత్రమే తినలి. చికెన్ ఫ్రైలో సెలెనియం, నియాసిన్, ఫాస్పరస్, ఇంకా వైటమిన్ బి 6 పోషకాలు మెండుగా వుంటాయని పరిశోధకులు చెబుతున్నారు. 100 గ్రాముల చికెన్ ఫ్రైలో సుమారు 30 గ్రాములకు పైగా ప్రొటీన్ కంటెంట్ ఉందంటే చికెన్ ఆరోగ్యానికి ఎంత దోహద పడుతుందో అర్థం చేసుకోవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications