Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
చికెన్ కుర్మాను ఈ స్టైల్లో ఎప్పుడైానా చేసుకున్నారా..?
చికెన్ కర్రీ వేరు, చికెన్ కుర్మా వేరు. చికెన్ కుర్మా మరింత టేస్టీగా ఉంటుంది. చికెన్ కుర్మాలోని గ్రేవీ కూడా చాలా రుచిగా ఉంటుంది. వేడుకల్లో ఈ చికెన్ కుర్మాను ఎక్కువగా చేస్తుంటారు. మొఘల్ కాలంలో ఈ చికెన్ కుర్మా వంటకం వచ్చిందనిఅంటారు. తరువాత వీటిలో కొన్నిమార్పులు చేసారు. అయితే ఒక్కో రాష్ట్రంలో చికెన్ కుర్మా ఒక్కోలా ఉంటుంది. ఇక్కడ మేము ఇచ్చిన స్టైల్లో చికెన్ కుర్మాను చేసుకొని ఒక సారి టేస్ట్ చేయండి.

చికెన్ కుర్మా తయారు చేయడానికి కావాల్సిన వంట పదార్ధాలు :
చికెన్: 1 కిలో
ఉల్లిపాయలు: 2
టమోటాలు: 2
పెరుగు: 1 కప్పు
నువ్వుల పేస్టు: 2 టీస్పూన్లు
కొబ్బరి పేస్టు: 2 టీస్పూన్లు
పచ్చి మిర్చి: 4-5
అల్లం-వెల్లుల్లి ముద్ద: 2 టీస్పూన్లు
ధనియాల పొడి: 1 టీస్పూను
జీలకర్ర పొడి: 1/2 టీస్పూను
పసుపు: 1/2 టీస్పూను
గరం మసాలా: 1 టీస్పూను
కారం: 1 టీస్పూను
నూనె: 4 టేబుల్ స్పూన్లు
కొత్తిమీర
కరివేపాకు
ఉప్పు
చికెన్ కుర్మాను ఈ కింది విధంగా తయారు చేసుకోవాలి :
1. ముందుగా చికెన్ ముక్కలను ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి ముద్ద, కొంచెం పెరుగులో వేసి 30 నిమిషాల పాటు మెరినేట్ చేసుకోవాలి.
2. ఒక పెద్ద పాన్ లో నూనె వేడి చేసి అందులో ఉల్లిపాయలు వేసి బ్రౌన్
కలర్ వచ్చేవరకు వేపాలి. తరువాత అందులో అల్లం-వెల్లుల్లి పేస్టు,
కొన్ని కరివేపాకులు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు టమోటా ముక్కలు
వేసి మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి.
3. టమోటాలు మెత్తబడిన తర్వాత నువ్వుల పేస్టు, కొబ్బరి పేస్టు వేసి కలపాలి. తరువాత మెరినేట్ చేసిన చికెన్ ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, గరం మసాలా వేసి బాగా కలపాలి.
4. స్టవ్ పైన పదినిమిశాల వరకు ఉడకబెట్టుకోవాలి. ఇందులో పెరుగు కూడా వేసి, ఒక గ్లాసు నీళ్లు పోసి, రుచికి సరిపడ ఉప్పును వేసుకొని చిన్న మంటపైన 20 నిమిశాల పాటు ఉడికించుకోవాలి. చివరగా తరిగిన కొత్తిమీరను వేసుకోవాలి. ఇక దీంతో చికెన్ కుర్మా రెడీ అయినట్టే.
చిట్కాలు:
చికెన్ కుర్మాను రోటీ, నాన్, పుల్కా లేదా అన్నంతో వడ్డిస్తే రుచిగా ఉంటుంది. నువ్వుల పేస్టు, కొబ్బరి పేస్టు వేసినప్పుడు తక్కువ మంటలో వండితే కూర మసాలా రుచి ఎక్కువగా వస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications