Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
టేస్టీ చికెన్ పచ్చడి రెసిపీ.. 4 నెలలు నిలువ ఉంచుకోవచ్చు..
ఈ వేసవిలో మామాడి పచ్చడితో పాటు రకరకాల పచ్ఛళ్లను పెట్టుకుంటాం. కూరగాయాలతో, మామాడి పళ్లతో పచ్చళ్లను క్రమం తప్పకుండా పెట్టుకుంటాం. కానీ ఈ సారి నాన్‌వెజ్ పచ్చడిని ట్రై చేద్దాం. ఈ నాన్‌వెజ్ పచ్చళ్లతో రుచికి రుచితో పాటు ప్రొటీన్, ఇతర పోషకాలు కూడా మెండుగా అందుతాయ్. ముక్కలేనిదే ముద్ద దిగని వారికి ఈ నాన్‌వెజ్ పచ్ఛళ్లు మంచి కిక్ ఇస్తాయ్. ఈ సారి చికెన్ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
చికెన్ పచ్చడి పెట్టుకుంటే నాలుగు నెలల వరకు ఏ ఇబ్బందీ లేకుండా తినవచ్చు. నాన్‌వెజ్ అంటే పడిచచ్చే వారికి ఈ చికెన్ పచ్చడి ఎప్పుడూ నిరాశపరచదు. ఎక్కువగా ప్రయాణించేవారికి, రోజూ వండుకునే వీలు లేనివారికి ఈ చికెన్ పచ్చడి వారి భోజనంలో చాలా దోహదపడుతుంది.
చికెన్ పచ్చడి తయారు చేసుకునే విధానం :
చికెన్ పచ్చడిలో యముకలు లేకుండా ఉంటేనే పచ్చడిని బాగా తినడానికి వీలుంటుంది. కాబట్టి బోన్‌లెస్ చికెన్‌ను తీసుకోవాలి. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయించాలి. ముక్కలు చిన్నగా ఉండే విధంగా చూసుకోవాలి.
కట్ చేసుకున్న చికెన్ ముక్కలను బాగా కడిగి అందులో ఒక టీస్పూన్ పసుపు వేసి కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి.

స్టవ్ వై వేయించడానికి ఓ ప్యాన్‌ను పెట్టుకొని అందులో ధనియాలు, మిరియాలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, మెంతులు, ఆవాలు వేసి ప్యాన్‌పై వేయించి వీటన్నింటిని మిక్సీలో పొడిగా గ్రైండ్ చేసుకోవాలి.
చికెన్‌ను నూనెలో ఫ్రై చేయడానికి ప్యాన్‌లో సరిపడినంత నూనె పోసుకోవాలి. అంతకు ముందు పసుపు, ఉప్పుతో కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలను ఈ నూనెలో వేసి బాగా కలుపుకోవాలి. పచ్చి చికెన్ నుంచి కొంత ఉడికేంత వరకు రంగు కొంచెం మారేంత వరకు నూనెలో కలుపుకుంటూనే ఉండాలి.
చికెన్ ముక్కలు ఎర్రగా అయ్యే సమయంలోనే తగినంత అల్లం వెల్లుల్లిని వేసుకొని కలుపుకోవాలి. మిక్సీలో పొడిచేసుకున్న మసాలాను తిసుకొని ఖడాయిలో వేసి కలుపుకోవాలి. కావలినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. తరువాత కారం వేసుకొని కడాయిలో చికెన్‌కు మొత్తం కలిసేలా గరిటతో తిప్పాలి.
ఇప్పుడు పచ్చడి దాదాపు రెడీ అయింది. దీన్ని స్టవ్ మీద నుంచి దించివేసి రెండు మూడు గంటలు అలాగే వుంచాలి. చల్లారిన తరువాత అందులో తగినంత నిమ్మరసాన్ని పిండుకోవచ్చు. దీంతో చికెన్ పచ్చడి రెసిపీ రెడీ అయినట్టే.
తయారైన చికెన్ పచ్చడిని మూడు రోజుల పాటు పచ్చడి జాడీల్లో నింపుకొని నిలువ చేసుకోవాలి. అప్పటికప్పుడు తిన్న చికెన్ పచ్చడి కంటే మూడు రోజుల తరువాత తిన్న చికెన్ పచ్చడి ఎక్కువ రుచిగా వుంటుంది.
చికెన్ పచ్చడి తయారు చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
పచ్చడి తయారు చేసుకునేప్పుడు ఎక్కడా తడి తగలకుండా చూసుకోవాలి. తడి తగిలితే పచ్చడి పాడై బూజు పట్టే అవకాశం వుంది. బోన్‌లెస్ చికెన్‌ను మాత్రమే చికెన్ తయారీలో ఉపయోగించాలి. ఫ్రెష్ చికెన్‌ను మాత్రమే పచ్చడి తయారీకి వాడాలి. నిలువ వుంచిన చికెన్‌ను ఉపయోగించవద్దు. అవసరమైతే దగ్గరుండి కట్ చేయించిన కోడి మాంసాన్ని మాత్రమే పచ్చడి తయారు చేసుకోవాలి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications