Latest Updates
-
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం!
Chikkudukaya pachadi: చిక్కుడుకాయ నిల్వ పచ్చడి..ఇలా చేస్తే ఆవకాయని మైమరిపించే టేస్ట్
చిక్కుడుకాయలతో చేసే కూరలు చాలా టేస్టీగా ఉంటాయన్న విషయం మనకు తెలిసిందే. అయితే చిక్కుడుకాయతో చేసే నిల్వ పచ్చడి ఎప్పుడైనా తిన్నారా? లేదు అంటే ఓ సారి ఖచ్చితంగా టేస్ట్ చేసి తీరాల్సిందే. పచ్చడి చేసుకోవడానికి వీలుగా ఉండే కూరగాయల్లో చిక్కుడుకాయలు కూడా ఒకటి. చిక్కుడుకాయలతో నిల్వ పచ్చడిని తయారు చేయడం చాలా సులభం.
సరిగ్గా చేయాలే కానీ ఈ పచ్చడి ఆవకాయ కంటే చాలా రుచిగా ఉంటుంది. చిక్కుడుకాయలతో నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో,దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏవో ఇప్పుడు చూద్దాం.

చిక్కుడుకాయ నిల్వ పచ్చడి తయారీకి కావాల్సిన
పదార్థాలు
-మెంతులు
-ఆవాలు
-చిక్కుడుకాయ
-జీలకర్ర
-ఎండుమిర్చి
-కరివేపాకు
-చింతపండు
-ఆయిల్
-వెల్లుల్లి
-కారం
-ఉప్పు
-పసుపు
చిక్కుడుకాయ నిల్వ పచ్చడి తయారీవిధానం
-స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1 టేబుల్
స్పూన్ మెంతులు వేసి లో ప్లేమ్ మీద మంచి వాసన వచ్చేవరకు వేయించి
తర్వాత వీటిని మిక్సీ గిన్నెలో వేసి మెత్తని పొడిలా గ్రైండ్
చేసుకోండి.
-తర్వాత శుభ్రంగా కడిగిన విత్తనాలు లావుగా ఉండే అరకేజీ చిక్కుడకాయలను పొడిగుడ్డతో తడి లేకుండా తుడిచి కొద్దిసేపు ఫ్యాన్ కింద ఆరబెట్టండి.
-ఇప్పుడు చిక్కుడుకాయల రెండువైపులా ఉండే నారను తీసేసి వాటిని ఓ బౌల్ లోకి తీసుకొని పక్కనపెట్టుకోండి.
-తర్వాత ఒక గిన్నెలో 125 గ్రాముల చింతపండు,1 కప్పు బాగా మరిగించిన నీళ్లను పోసి నానబెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి 250 గ్రాముల నూనె పోసి అది కొంచెం వేడెక్కాక అందులో క్లీన్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలను వేసి మీడియం ప్లేమ్ మీద వేయించండి. ముక్కలు 30 శాతం దాకా ఉడికితే చాలు వాటిని తీసి ఓ బౌల్ లో వేసి పక్కనపెట్టండి.
-ఇప్పుడు అదే పాన్ లో రెండు టీ స్పూన్ల ఆవాలు, 1 టీస్పూన్ జీలకర్ర, అర టీస్పూన్ మెంతులు,6 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి తాళింపును కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఇందులో 40 గ్రాముల తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసి ఒక నిమిషం తర్వాత కొంచెం ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లారనివ్వండి.
-తాళింపు పూర్తిగా చల్లారిన తర్వాత దానిని ముందుగా ఫ్రై చేసి బౌల్ లో ఉంచిన చిక్కుడుకాయలలో వేసి కలపండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ పోసి నానబెట్టిన చింతపండు గుజ్జు మొత్తం తీసి ఆయిల్ లో వేయండి. మంటను మీడియం ప్లేమ్ మీద పెట్టుకొని ఈ చింతపండు గుజ్జు నూనెలో బాగా వేగనివ్వండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పాన్ ని పక్కనపెట్టుకోండి.
-ఇప్పుడు ఓ పెద్ద గిన్నె తీసుకొని అందులో చిక్కుకాయముక్కలు తాళింపు మిశ్రమాన్ని,80 గ్రాముల కారం,రుచికి సరిపడా ఉప్పు,అర టీస్పూన్ పసుపు,ముందుగా గ్రైండ్ చేసె పెట్టుకున్న ఆవాలు మెంతుల పొడి వేసి బాగా కలపండి. ఈ పచ్చడిని 2 రోజుల పాటు స్టీల్ గిన్నెలోకానీ,జాడీలోగానీ పెట్టి ఊరనిస్తే చాలు అదిరిపోయే టేస్టీ చిక్కుడకాయ పచ్చడి రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications