Christmas special plum cake: క్రిస్మస్ వచ్చిందంటే ఈ కేకు తినాల్సిందే..ప్లమ్ కేకుని ఇలా ఈజీగా చేసుకోండి

Posted By:

ప్రతి ఏటా డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ జరుపుకుంటారు. ఇప్పటికే క్రిస్మస్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. అయితే క్రిస్మస్ వస్తుందంటే చాలు ప్రపంచవ్యాప్తంగా ప్లమ్ కేకులకు డిమాండ్ పెరిగిపోతుంది. సెలబ్రేషన్స్‌లో ఈ కేక్ తప్పనిసరి అవుతుంది. ప్లమ్ కేక్ నచ్చనివారు దాదాపు ఉండరు. క్రిస్మస్ రాగానే ఆ కేక్ తినాలని ప్లాన్ చేసుకుంటారు. అయితే ఈ కేకుని ఇంట్లోనే ఈజీగా తయారుచేసుకోవచ్చు. క్రిస్మస్ స్పెషల్ ప్లమ్ కేక్ తయారీకి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.

క్రిస్మస్ స్పెషల్ ప్లమ్ కేక్ తయారీకి కావాల్సిన పదార్థాలు

-కాజు
-బాదం
-కిస్మిస్
-బ్లాక్ కిస్మిస్
-ఖర్జూరం
-ఎర్ర టూటి ఫ్రూటీ
-పచ్చ టూటి ఫ్రూటీ
-చెర్రీస్
-మైదా పిండి
-బేకింగ్ పౌడర్
-లవంగ మొగ్గలు
-సొంటి
-ఆప్రికాట్
-పుచ్చ విత్తనాలు
-ద్రాక్ష రసం లేదా ఆరెంజ్ రసం
-పంచదార
-బేకింగ్ సోడా
-ఉప్పు
-కోకో పౌడర్
-ఆయిల్

క్రిస్మస్ స్పెషల్ ప్లమ్ కేక్ తయారీ విధానం

-ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ముప్పావు కప్పు ద్రాక్ష రసం(grape juice),1 టేబుల్ స్పూన్ బ్లాక్ కిస్మిస్,1 టేబుల్ స్పూన్ రెగ్యులర్ గా వాడే ఎండు ద్రాక్ష,చిన్న ముక్కలుగా కట్ చేసిన 1 టేబుల్ స్పూన్ బాదంపప్పు,1 టేబుల్ స్పూన్ పుచ్చ విత్తనాలు,చిన్నగా కట్ చేసిన 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు,ముక్కలుగా కట్ చేసుకున్న ఆప్రికాట్ 2 టేబుల్ స్పూన్లు,2 టేబుల్ స్పూన్ల టూటీ ఫ్రూటీ,2 టేబుల్ స్పూన్ల చిన్న ముక్కలుగా కట్ చేసిన ఖర్జూరం, చిన్నగా కట్ చేసిన 2 టేబుల్ స్పూన్ల చెర్రీస్ వేసి బాగా కలిపి మూతపెట్టి ఒక రాత్రంతా ఫ్రిడ్జ్ లో ఉంచండి.

-తర్వాత రోజు ఫ్రిడ్జ్ లో నుంచి బౌల్ ను బయటకు తీసి బాగా కలిపి పక్కనపెట్టుకోండి.

-ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఓ పాన్ పెట్టి అందులో పావుకప్పు పంచదార వేసి అది కరిగిన తర్వాత అందులో అరకప్పు బాగా మరిగించిన నీళ్లు కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుకోండి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి.

-ఇప్పుడు ఈ పాకాన్ని డ్రైఫ్రూట్స్ ఉన్న బౌల్ లో పోసి బాగా కలిపి పక్కనపెట్టుకోండి.

-ఇప్పుడు మిక్సీ గిన్నెలో పావుకప్పు పంచదార,1 ఇంచు దాల్చిన చెక్క,రెండు లవంగ మొగ్గలు,పావు ముక్క సొంటి,1 యాలక,చిన్న ముక్క జాజికాయ వేసి, 1/3 కప్పు ఆయిల్, పావు కప్పు వేసి క్రీమీగా వచ్చేలా గ్రైండ్ చేయండి. దీన్నంతా ఓబౌల్ లో పోసుకోండి. ఈ బౌల్ మీద జల్లెడ పెట్టి అందులో 1 కప్పు జల్లెడ పట్టిన మైదా పిండి,1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్,అర టీస్పూన్ బేకింగ్ సోడా,చిటికెడు ఉప్పు,2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ వేసి అన్నింటిని బాగా జల్లెడ పట్టి బౌల్ లో వేసి బాగా కలుపుకోండి.

-తర్వాత ఇందులోనే పక్కన పెట్టి ఉంచిన బౌల్ లోని డ్రైఫ్రూట్ మిశ్రమాన్ని కూడా వేసి మొత్తం బాగా కలపండి.

-తర్వాత ఓ అల్లూమినియం గిన్నె తీసుకొని అడుగున కొంచెం ఆయిల్ వేసి గ్రీజ్ చేసుకోండి. దాని మీద కొంచెం మైదా పిండి చల్లుకోండి. తర్వాత ఇందులో బౌల్ లో రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమం మొత్తాన్ని వేసి బాగా కలపండి. పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసి గార్నిష్ చేసుకోండి.

-ఇప్పుడు స్టవ్ మీద కొంచెం లోతుగా ఉండే గిన్నె పెట్టి అందులో కొంచెం ఇసుక పోయండి. దాంట్లోనే ఓ స్టాండ్ పెట్టి దానిమీద ఈ కేసు మిశ్రమం ఉంచిన గిన్నెను ఉంచండి. మూత పెట్టి పెట్టి మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి 25 నిమిషాల పాటు,మంటను లో ప్లేమ్ లో పెట్టి మరో 25 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి.

-మొత్తంగా 50 నిమిషాల పాటు బేక్ చేసిన తర్వాత మూత తీసి సరిగా అయిందో లేదో చేక్ చేసుకోండి. అవకపోతే ఇంకో 5 నిమిషాలు బేక్ చేసుకోండి. అయినత తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పెద్ద గిన్నెలో ఉన్న చిన్న గిన్నెను బయటకు తీసి దానిపైన మూతపెట్టి పూర్తిగా చల్లారనివ్వండి. అంతే టేస్టీగా ఉండే ప్లమ్ కేక్ రెడీ. ఈ గిన్నెలోని కేక్ ని ఏదైనా ప్లేట్ మీద బోర్లించుకొని మీకు నచ్చిన షేపులో కోసుకొని తింటూ ఆస్వాదించవచ్చు.

[ of 5 - Users]
Story first published: Monday, December 23, 2024, 18:14 [IST]
Desktop Bottom Promotion