Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
coconut sweet: పచ్చి కొబ్బరితో కోవా బర్ఫీ..అదిరిపోయే టేస్టీ స్వీట్ ఇలా చేసుకోండి
సాధారంగా మన ఇళ్లల్లో ఉండే పచ్చికొబ్బరితో అద్భుతమైన స్వీట్ ని చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. అదే కోకోనట్ కోవా బర్ఫీ. ఎంతో టేస్టీగా ఉండే ఈ కొబ్బరి స్వీట్ ని ఏ వయసు వారైనా చాలా ఇష్టంగా తింటారు. ఒక్క ముక్క నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయే అద్భుతమైన ఈ టేస్టీ స్వీట్ ని ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీని తయారీకి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఎలాగో ఇక్కడ చూడండి.
కోకోనట్ కోవా బర్ఫీ తయారీకి కావల్సిన
పదార్థాలు
-పచ్చి కొబ్బరి
-పాలు
-చక్కెర
-నెయ్యి

కోకోనట్ కోవా బర్ఫీ తయారీ విధానం
-ఒక గిన్నెలో ఒక లీటర్ పాలు పోసి బాగా వేడి చేసుకొని చల్లారిన తర్వాత
ఫ్రిడ్జ్ లో ఒక రోజంతా పెట్టుకోవాలి.
-తర్వాత ఒక పాన్ లో మరో లీటర్ పాలు పోసి పక్కనపెట్టుకోండి.
-ఇప్పుడు మూడు పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకోండి. దానిపైన ఉండే షెల్ తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని మిక్సీ గిన్నెలో వేసి బాగా గ్రైండ్ చేయండి.
-కొబ్బరి కొంచెం బరకగా అయిన తర్వాత ఆ మిక్సీ గిన్నెలోనే కొంచెం పాలు పోసి మరోసారి మెత్తగా గ్రైండ్ చేసుకోండి.
-ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాలు పోసి ఉంచిన పాన్ పెట్టి అందులో ఈ కొబ్బరి మిశ్రమాన్ని వేసి బాగా కలుపుతూ ఉడికించండి.
-పాలు బాగా మరిగి సగం వరకు వచ్చిన తర్వాత మంటను లో ప్లేమ్ లో పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టి ఉంచిన పాలలోని మీగడను చిల్లు గరిటతో ఓ బౌల్ లోకి తీసుకోండి.
-ఈ మీగడను ఉడికిస్తున్న పాలలో వేసి కలపండి. ఇందులోనే 2 కప్పుల చక్కెర కూడా వేసి కలిపి మంటను మీడియం ప్లేమ్ లో పెట్టి మధ్ మధ్యలో కలుపుతూ ఉడికించాలి.
-పాల క్వాంటిటీ పూర్తిగా తగ్గిపోయే దాకా ఉడికించండి.
-తర్వాత మూత తీసి కలుపుతూ రెండు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి అదంతా ఓ ఫ్లేట్ లోకి తీసుకోండి.
-ఇప్పుడు ఓ ప్లేట్ తీసుకొని దాని మీద ప్లేన్ గా ఉండే పేపర్ పెట్టి దాని మీద కొంచెం నెయ్యి రాసి తయారుచేసిన స్వీట్ ని దాని మీద వేసి సమానంగా స్ప్రెడ్ చేసి అది పూర్తిగా చల్లారేవరకు పక్కన ఉంచండి.
-తర్వాత దానిని స్క్వేయర్ లేదా డైమండ్ షేప్ లో అయినా కట్ చేస్తే కోకోనట్ కోవా బర్ఫీ రెడీ. దీని మీద సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది.
-ఈ స్వీట్ ని బయటపెట్టుకుంటే నాలుగైదు రోజులు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే రెండు వారాల పాలు నిల్వ ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications