Latest Updates
-
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం!
పిల్లలకు టిఫిన్‌కు కొబ్బరన్నం.. కొన్ని నిమిషాల్లోనే రెడీ..!
పిల్లలకు లంచ్ బాక్స్ రెసిపీని త్వరగా తయారు చేయాలంటే ఈ కొబ్బరన్నం ఒకసారి ట్రై చేయండి. చాలా తక్కువ సమయంలో పిల్లలకు వేడివేడిగా తయారు రెడీ చేయోచ్చు. పచ్చిబఠానీలు, కొబ్బర, నెయ్యి వుండడం వల్ల మంచి పోషకాలు కూడా అందుతాయ్. మరి కొబ్బరన్నం ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం.

కొబ్బరన్నం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు
1 గ్లాసు బాస్మతీ రైస్
3/4 కప్పు కొబ్బర
మంచి నూనె
1 టేబుల్ స్పూన్ నెయ్యి
1 టీ స్పూన్ జిలుకర
దాల్చిన చెక్క
ఆవాలు, యాలాకులు
1 బిర్యానీ ఆకు
2 టేబుల్ స్పూన్ల కాజూలు
5 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లపాయ ముక్కలు
కొన్ని కరివేపాకులు
1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు
1 టేబుల్ స్పూన్ కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ పూదీన
2 టేబుల్ స్పూన్ పచ్చి బఠానా
1 టీ స్పూన్ ధనియాల పొడి

కొబ్బరన్నం తయారు చేసే విధానం
1. 1 గ్లాసు బాస్మతీ రైస్‌ను బౌల్లోకి
తీసుకోవాలి.
2. నీళ్లు పోసుకొని 2,3 సార్లు బాగా కడ్డుకోవాలి.
3. 30 నిమిశాల వరకు బియ్యాన్ని నానబట్టాలి.
4. మిక్సీ జార్లో 3/4 కప్పు కొబ్బరను వేసుకోవాలి.
5. నీళ్లు పోసుకొని కొబ్బరను మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
6. స్టవ్ మీద కుక్కర్‌ను పెట్టుకొని 2 టేబలు్ స్పూన్ల మంచి
నూనెను యాడ్ చేసుకోవాలి.
7. 1 టీబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి.
8. 1 టీ స్పూన్ జిలుకర, దాల్చిన చెక్క, ఆవాలును, యాలాకులను
వేసుకోవాలి.
9. 1 బిర్యానీ ఆకు కూడా వేసి ఆయిల్లో బాగా ఫ్రై
చేసుకోవాలి.
10. 2 టేబుల్ స్పూన్ల కాజూలను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి.
11. 5 పచ్చిమిరపకాయలను, తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని
ఫ్రై చేసుకోవాలి.
12. కొన్ని కరివేపాకులను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి.
13. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును కూడా వేసుకొని బాగా
కలుపుకోవాలి.
14. 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ పుదీన వేసుకొని
కలుపుకోవాలి.
15. 2 టేబుల్ స్పూన్ల పచ్చి బఠానాను కూడా వేసుకొని బాగా
కలుపుకోవాలి.
16. 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసి, నానబెట్టుకున్న
రైస్‌ను కూడా వేసి బాగా కలుపుకోవాలి.
17. గ్రైండ్ చేసిన కొబ్బరి పాలను రైస్‌లో పోసుకోవాలి.
18. రుచికి సరిపడ ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి.
19. కుక్కర్ మూతను పెట్టి ప్రెజర్‌కు పెట్టాలి.
20. విజిల్ వచ్చిన తరువాత కుక్కర్ మూతను తీసి ఉడికిందా లేదా చెక్
చేసుకోవాలి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications