Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
కరకరలాడే చెగోడీలు.. స్వీట్ షాపు స్టైల్లో చేసుకుందామా..?
కరకరలాడే చెగోడీలు చాలా టేస్టీగా వుంటాయ్. వీకెండ్లో సినిమా చూస్తూ చెగోడీలు తింటే వచ్చే కిక్కే వేరు. కొన్ని స్వీటు షుపుల్లో చేసే చెగోడీలు ఎంత టేస్టీగా వుంటాయంటే ఎంత తిన్నా కూడా ఆకలి తీరదు. చిన్న పిల్లలు చెగోడీలను వేళ్లకు ఉంగరాల్లా ధరించి ఆడుకుంటూ తింటుంటారు. కరకరలాడే చెగోడీలను ఇంట్లో వున్న వంట సామాగ్రితోనే చేసుకోవచ్చు. చెగోడీలను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
చెగోడీలు తయారు చేయడానికి కావలసిన వంట సామాగ్రి
ఒక కప్పు మైదాపిండి, నీళ్లు, కారం, బటర్, వాము, పసుపు, నూనె, తగినంత ఉప్పు.
చెగోడీలు తయారు చేసే విధానం
1. ఒక కప్పులో మైదా పిండిని ఒక బౌల్లో తీసుకోవాలి. బౌల్‌ను పక్కబెట్టి. ఒప్పుడు ఒక ప్యాన్‌లో కొన్ని నీళ్లను పోసి అందులో ఒక టీస్పూన్ కారంపొడిని వెయ్యాలి. ముప్పువు టీ స్పూన్ వామును కూడా యాడ్ చేయాలి. రుచికి తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఒక టీస్పూన్ బటర్‌ను తీసుకోవాలి. బటర్ మొత్తం కరిగిపోయి నీళ్లు కూడా మరిగేలా చూసుకోవాలి. పావు టీ స్పూన్ పసుపును కూడా వేసి నీళ్లను మరిగించుకోవాలి.
2. బాయిల్ అవుతున్న నీళ్లల్లో ఇంతకు ముందు తీసుకున్న మైదా పిండిని కలుపుకోవాలి. మంటను లో ఫ్లేమ్‌లో పెట్టి పిండిని బాగా కలుపుకోవాలి. పిండిని చేతితో బాగా మిక్స్ చేసుకోవాలి. చేతికి తడిపెట్టుకొని పిండిని వత్తుకుంటూ కలుపుకోవాలి.
3. పిండిని సెమీ సాఫ్ట్‌గా కలుపుకున్న తరువాత కొంచెం పిండిని తీసుకొని చెకోడీల షేపులో రింగ్ సైజులో చేసుకోవాలి. చేతి మెషిన్ తో కూడా చెకోడీలను వేసుకోవచ్చు. చోగొడీను సన్నగా లేదంటే లావుగా వేసుకోవచ్చు. మిషిన్‌తో చెగోడీలు వేస్తున్నప్పుడు మిషిన్‌లో కొంత నూనెను పోసి చెగోడీ పిండి అతుక్కోకుండా చూడాలి. ఇప్పుడు మిషిన్‌లో చెకోడీ పిండిని వేసుకొని ప్రెస్ చేసుకోవాలి. పిండిమొత్తాన్ని మిషిన్‌తో చేయండి లేదంటే చేతితో చేయండి.

4. చెకోడీలను ఫ్రై చేయడానికి కడాయిలో తగినంత నూనెను తీసుకోవాలి. అందులో చెకోడీలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్‌ను మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టాలి. చెకోడీల కోసం పిండిని కలిపేటప్పుడు అందులో ఒక టీస్పూన్ బటర్ వేసుకుంటే ఫ్రై చేసేటప్పుడు చెగోడీలు అతుక్కోకుండా వుంటాయ్. టేస్ట్ కూడా బాగుంటాయ్.
5. చెకోడీలు ఎక్కువ మాడిపోకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఒప్పుడు చెగోడీలన్నింటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి. మిగిలిన చెకోడీలన్నింటినీ ఇలాగే ఫ్రై చేసుకోవాలి. చెగోడీలు కరకరలాడాలంటే రెండు సార్లు ఫ్రై చేయడానికి ట్రై చేయండి. మొదటి సారి నూనెలో వేసినప్పుడు కొంత ఫ్రై కాగానే బయటకు తీసి మళ్లీ అవే చెగోడీలను వేసుకోవాలి.
చెకోడీలు మైదాపిండి పోషకాలు
చెకోడీల వల్ల ఎలాంటి పోషకాలు కూడా శరీరానికి అందవని ముందే గ్రహించాలి. మైదా పిండి తింటే కొవ్వు పెరుగుతుంది. మైదాలో పోషకాలు ఏవీ వుండవు. మైదా పిండి తయారీ విధానం తెలిస్తే. మైదాపిండిని ఎక్కువగా తినరు. గోదుమ పిండిలో రసాయనాలు వేసి దాన్ని మైదాపిండిలా తయారు చేస్తారు. మైదపిండి తయారీలో బెంజాయిల్ పెరాక్సాయిడ్ ఎక్కువగా ఉపయోగిస్తారు. దీని వల్ల అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం వుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
మైదాపిండినుంచే చెగోడీలు తయారవుతాయన్న వాస్తవం వున్నా చెగోడీలు ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదని గ్రహించాలి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications