Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
క్రీస్పీ కారందోశను ఇలా ఎప్పుడైనా చేసుకున్నారా.. ? దోశ పిండి కూడా అవసరం లేదు..!
బయట బండిపైన తినే కారం దోశ చాలా రుచిగా వుంటుంది. ఇంట్లో అప్పటికప్పుడు తక్కువ సమయంలో ఇలాంటి కారం దోశను ఎలా తయారు చేసుకోవాలో మేము మీకు రెసిపీని అందిస్తున్నాం. ఇంట్లో వున్న వంట సామాగ్రితోనే చాలా తక్కువ సమయంలో మీరు ఈ కారందోశను వేసుకోవచ్చు.

కారం దోశ కోసం కావాల్సిన పదార్ధాలు
1 కప్పు ఉప్మారవ్వ
1 టీ స్పూన్ చెక్కర
మంచి నూనె
ఉప్పు
2 టేబుల్ స్పూన్ల గోదుమ పిండి
2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి
1 కప్పు పుల్లటి పెరుగు
1 టీస్పూన్ చెనగపప్పు
1 టీస్పూన్ మినపప్పు
1 టీస్పూన్ ధనియాలను
చిటికెడంత మెంతులు
రుచికి సరిపడ ఎండి మిరపకాయలు
7 ఎల్లిపాయలు
1 టీ స్పూన్ జిలుకర
నిమ్మకాయ సైజలో వున్న చింతపండు
1 టీ స్పూన్ మినపప్పు
అర టీ స్పూన్ ఆవాలు
కొన్ని కరివేపాకులు
అరటీస్పూన్ బేకింగ్ సోడా

కారం దోశ తయారీ విధానం
1. ముందుగా మిక్సర్ జార్లో 1 కప్పు ఉప్మారవ్వ, 1 టీ
స్పూన్ చెక్కర, 2 టీ స్పూన్ల ఆయిల్‌ను వేసి బాగా గ్రైండ్
చేయాలి.
2. బాగా గ్రైండ్ చేసిన తరువాత మిక్సర్ జార్‌లోకి
తీసుకోవాలి.
3. 2 టేబుల్ స్పూన్ల గోదుమ పిండి, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 1
కప్పు పుల్లటి పెరుగును యాడ్ చేసుకోవాలి.
4. దోశవేసే విధంగా వచ్చేలా కావాల్సినన్ని నీళ్లను పోసుకొని యాడ్
చేసుకోవాలి.
5. రుచికి సరిపడ ఉప్పును వేసుకొని కలుపుకోవాలి.
6. బౌల్‌పై మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి.
7. స్టవ్‌పై ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్
ఆయిల్‌ను యాడ్ చేసుకోవాలి.
8. 1 టీస్పూన్ చెనగపప్పు, 1 టీస్పూన్ మినపప్పు, 1 టీస్పూన్ ధనియాలను,
చిటికెడంత మెంతులు వేసి ఫ్రై చేయాలి.
9. రుచికి సరిపడ ఎండి మిరపకాయలను వేసుకోవాలి. 1 కప్పు వరకు కట్ చేసిన
ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి.
10. రుచికి సరిపడ ఉప్పును వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
11. 2 టేబుల్ స్పూన్ల నీళ్లను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి.
12. ఫ్రై చేసిన ఎల్లిపాయలను మిక్సర్ జార్‌లోకి
తీసుకోవాలి.
13. 7 ఎల్లిపాయలను యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ జిలుకర, నిమ్మకాయ
సైజలో వున్న చింతపండును యాడ్ చేసుకోవాలి.
14. ఈ మొత్తాన్నీ మిక్సర్‌లో గ్రైండ్ చేయాలి. ఈ చట్నీని ఒక
బౌల్లోకి వేసుకోవాలి.
15. ఇప్పుడు మరో ప్యాన్‌లో ఒక టేబుల్ స్పూన్
ఆయిల్‌ను, 1 టీ స్పూన్ మినపప్పును, అర టీ స్పూన్ ఆవాలను 16.
వేసుకొని ఫ్రై చేయాలి. కొన్ని కరివేపాకులను వేసుకొని బాగా ఫ్రై
చేసుకోవాలి.
17. ఈ పిండిలో అరటీస్పూన్ బేకింగ్ సోడా వేసుకొని కలుపుకోవాలి.
18. ప్యాన్ తీసుకొని 1 టీ స్పూన్ మంచినూనెను యాడ్ చేసుకోవాలి.
19. ఇప్పుడు రెడీ చేసుకున్న పిండితో దోశలు వేసుకోవాలి.
20. దోశ క్రిస్పీగా వచ్చేలా జాగ్రత్త పడాలి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications