Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
ఓట్స్ పకోడీ ఎప్పుడైనా తిన్నారా? నోట్లో పెట్టుకుంటే డ్యాన్స్ చేస్తారు..ఇలా చేసుకోండి
ఓట్స్ మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అయితే మీరు ఎప్పుడైనా ఓట్స్ తో చేసిన పకోడీ తిన్నారా? తినకపోయినట్లయితే ఓసారి టేస్ట్ చేయాల్సిందే. రుచి అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా చలికాలంలో ఓట్స్ పకోడీ చేసుకొని తింటే వేడి వేడిగా శరీరంలో కొత్త శక్తి వస్తుంది. ఓట్స్ తో పకోడీ చేయడం చాలా చాలా ఈజీ. ఓట్స్ తో పకోడీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.
ఇన్ స్టంట్ ఓట్స్ పకోడి తయారీకి కావాల్సిన పదార్థాలు
-1కప్పు ఓట్స్
-పావు కప్పు బియ్యం పిండి
-పావు కప్పు శెనగ పిండి
-1 పచ్చిమిర్చి
-1 టీస్పూన్ కారం
-1/4 టీస్పూన్ పసుపు
-1/2 టీస్పూన్ గరం మసాలా పౌడర్
-2 ఉల్లిపాయలు
-అల్లం వెల్లుల్లి పేస్ట్
-ఉప్పు
-కరివేపాకు
-కొత్తిమీర
-జీడిపప్పు

ఓట్స్ పకోడి తయారీ విధానం
-ఓ బౌల్ లో 1కప్పు ఓట్స్ వేసి అందులో కొంచెం నీళ్లు పోసి తడిపి
పక్కనపెట్టుకోండి.
-రెండు నిమిషాల తర్వాత అందులో బియ్యపు పిండి, శెనగ పిండి, పచ్చిమిర్చి ముక్కలు, కట్ చేసిన కరివేపాకు, కొత్తిమీర తరుగు, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్,ఉల్లిపాయ చీలికలు వేసి బాగా కలుపుకోండి.
-కొంచెం కొంచెం నీళ్లు చల్లుకుంటూ పకోడి పిండిలా కొంచెం గట్టిగానే కలుపుకోండి. అందులోనే కొన్ని జీడిపప్పులు కూడా వేసుకోండి.
-ఇప్పడు స్టవ్ మీద బాండీ పెట్టి ఆయిల్ వేడి చేడిన తర్వాత అందులో పకోడీలా పిండిని వేసుకోండి. ఉడికిన తర్వాత వాటిని ఓ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
