Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
క్రీస్పీ వెజిటేబుల్ పకోడి.. చేయడం చాలా సింపుల్..!
ఈ వేసవిలో సాయంత్రం చల్లగా ఇంటికి వచ్చిన తరువాత వెజిటేబుల్ పకోడిను చేసుకొని తింటే ఆహా ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేము. వెజుటేబుల్ పకోడి చేసుకోవడానికి ఎక్కువ సమయం కూడా అవసరం లేదు, ఇంట్లో వున్న వంట సామాగ్రితోనే ఈజీగా వెజిటేబుల్ పకోడిను చేసుకోవచ్చు.
వెజిటేబుల్ పకోడి చేసుకోవడానికి కావాల్సిన వంట సామాగ్రి
అరకప్పు బేసన్, పావు కప్పు బియ్యం పిండి, అర టీస్పూన్ ఉప్పు, మూడు పచ్చి మిరపకాయలు, 1 టీస్పూన్ ఎండిమిరపకాయలు, రెండు టేబుల్ స్పూన్ల పూదీన ఆకులు, 1 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అరటీస్పూన్ గరం మసాలా పౌడర్, తగినంత నూనె, ఒక మీడియం సైజు క్యారెట్, పావు కప్పు క్యాప్సికం, 1 కప్పు క్యాబేజ్, 1 ఉల్లిపాయ, 6 బీన్స్, 1 కప్పు ఆకుకూర
వెజిటేబుల్ పకోడి చేసుకునే విధానం
వెజిటేబుల్ పకోడి చేయడానికి కూరకాయలను పొడవుగా కోసుకోవాలి. వాటిని ఒక బౌల్‌లోకి తీసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్టును, పచ్చిమిరపకాయలను, తగినంత ఉప్పు, గరంమసాలా, పూదీనను యాడ్ చేసుకోవాలి. వాటన్నింటినీ చేతులతో బాగా కలుపుకోవాలి.
బియ్యం పిండిలో జిలకర వేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి. మరీ పలుచగా వుండకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. పిండిలో తగినంత ఉప్పు, గరం మసాలా, పచ్చి మిరపకాయలను యాడ్ చేసుకోవాలి.

ఒక ప్యాన్‌లో నూనెను తీసుకొని అందులో కలుపుకున్న పిండిని కొంచెం వేసి అది ఉడుకుతుందా లేదా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చేతి వేళ్లతో 1 నుంచి 2 ఇంచుల వరకు పిండిని కలుపుకొని పకోడిలుగా చేసుకోవాలి.
మీడియం ఫ్లేమ్‌లోనే స్టవ్‌ను పెట్టుకొని పకోడిలు వేస్తూ వుండాలి. వెజిటేబుల్ పకోడిలు మరింత క్రిస్పీగా రావడానికి రెండు సార్లు నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఇక దీంతో మన వెజిటేబుల్ పకోడి రెడీ అయినట్టే. ఈ వెజిటేబుల్ పకోడాలను టీతో, లేదంటే ప్రత్యేకంగా చట్నీతో కలిపి తినవచ్చు.
పకోడిలు మరింత బాగా రావాలంటే ఈ టిప్స్ ను పాటించండి
పకోడిల కోసం కలిపే పిండిలో ఎక్కువ నీరు పోయకుండా చూడాలి. మీడియం ఫ్లేమ్‌లోనే పకోడిలను ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్లేమ్ పెడితే పకోడిలు మాడిపోతాయ్.
పకోడిలో పోషక విలువలు
200ల గ్రాముల పకోడిలో 305 క్యాలరీలు వుంటాయ్. 12 గ్రాముల వరకు కొవ్వు వుంటుంది. 40 గ్రాముల కార్బోహైడ్రేట్లు వుంటాయ్, 9 గ్రాముల వరకు ప్రొటీన్ వుంటుంది.
పకోడిల వల్ల ఆరోగ్యానికి ప్రమాదం
పకోడిలు తినడం వల్ల బరువు సులభంగా పెరుగుతారు. ఇది బ్లడ్ ప్రెజర్‌ను పెంచడమే కాకుండా డయాబెటీస్‌కు కారణమవుతుంది.
పకోడిల్లో కొలెస్ట్రాల్ స్థాయి కూడా అధికంగా వుంటుంది. పకోడిలు తింటే జీర్ణ క్రియ కూడా మెరుగుపడదు. పకోడిలలో ఆశించినంత పోషకాలు కూడా ఏమీ వుండవని పోషకనిపుణులు చెబుతున్నారు. పకోడిలు తింటే కొవ్వు పెరిగి లివర్ పై ఒత్తిడి పెరగడమేకాకుండా కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశాలు కూడా వున్నాయని అంటున్నారు.
పకోడిలు చేసుకొని తినడం మంచిదే కానీ దానికి కూడా ఒక పరిమితి వుండాలి. రోజూ పకోడిలు చేసుకోవడం వల్ల ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications