Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కరివేపాకు పులిహోర.. అన్ని పులిహోరలో ఇదే బెస్ట్, ఎలా కలపాలో సింపుల్‌గా తెలుసుకోండి!
మన తెలుగు రాష్ట్రాల్లో పులిహోర ప్రత్యేకమైన వంటకం. రకరకాలుగా ప్రజలు పులిహోరను చేసుకుంటూ ఉంటారు. ఎలాంటి రకమైన పులిహోర అయినా ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా లొట్టలేసుకుని మరీ తినేస్తారు. అయితే మీరు ఎప్పుడైనా కరివేపాకు పులిహోర తిన్నారా? ఇది చాలా రుచికరమైన ఆరోగ్యవంతమైన ఆహార పదార్థం. దీనిని తయారు చేసుకోవడం అత్యంత సులభం. కేవలం సులభమైన పద్దతిలో దీనిని చేసుకోవచ్చు. అయితే ఈ కరివేపాకు పులిహోరను ఎలా చేయాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కరివేపాకు పులిహోర తయారీకి కావలసిన పదార్థాలు:
వండిన బియ్యం - 2 కప్పులు
కరివేపాకు - 1 కప్పు
నూనె - 3 టేబుల్ స్పూన్లు
ఆవాలు - 1 టీస్పూన్
జీలకర్ర - 1/2 టీస్పూన్
మినపప్పు - 1 టీస్పూన్
పెసరపప్పు - 1 టీస్పూన్
వెల్లుల్లి రెబ్బలు - 4-5
ఎర్ర మిరపకాయలు - 5-6
పచ్చిమిర్చి - 2-3
చింతపండు - చిన్న ముక్క
ఉప్పు - రుచికి తగినంత
పసుపు - అర టీస్పూన్
కరివేపాకు పులిహోర తయారీ విధానం:
ముందుగా కరివేపాకులను మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఒక పాన్‌లో నూనె వేసి వేడి చేసుకోవాలి. ఆ తరువాత అదే నూనెలో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పెసరపప్పు వేసి వేగించాలి. దీంతో పాటు వెల్లుల్లి రెబ్బలు, ఎర్ర మిరపకాయలు, పచ్చిమిర్చి వేసి వేగించాలి. అవన్నీ బాగా వేగాకా ముందుగా నానబెట్టిన చింతపండును వేసి కొద్దిగా నీరు పోసి మెత్తగా ఉడికించాలి. దీంతో పాటు కరివేపాకు ముద్దా కూడా వేసుకొని ఉడికించుకోవాలి. అలాగే దానికి కొంచెం పసుపు, ఉప్పు వేసుకోవాలి.
ఇప్పుడు అన్నంను ఒక బేసిన్‌లో తీసుకోవాలి. దానికి మనం ముందుగా చేసి పెట్టుకున్న పులిహోర పదార్థాన్ని వేసుకొని మెత్తగా కలుపుకోవాలి. అన్నం మొత్తాన్ని పులిహోర రసం పెట్టె విధంగా బాగా కలుపుకొని రుచి చూసుకుంటే ఎంతో ఆరోగ్యవంతమైన, రుచికరమైన కరివేపాకు పులిహోర సిద్దమైనట్లే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications