Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
చిటికెలో కరకరలాడే ఆలూ ఫ్రై ఇలా చేసుకోండి,నోట్లో వేసుకుంటే అమృతమే!
పిల్లలకు ఆలూతో చేసిన ఏ వంటకమైన చాలా నచ్చుతుంది. వారు ఆ వంటకాన్ని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అంత ఇష్టంగా తినే ఆలూ వంటకాల్లో ఆలూ ఫ్రై కూడా ఒకటి. ఒక్కసారి పిల్లలకు ఇది చేసి పెడితే లొట్టలేసుకుని మరీ తింటారు. ఒక్క ముక్క కూడా మిగల్చరు. కానీ చాలా మంది తల్లులకు దీనిని ఎలా చేసుకోవాలో తెలియదు. దానికి ఎలాంటి పదార్థాలు వినియోగించాలో కూడా అర్ధం కాదు. అందుకే ఈ స్టోరీలో మేము ఆలూ ఫ్రై ఎలా చేసుకోవాలనేది పాయింట్ టు పాయింట్ వివరించాము. ఈ స్టోరీని పూర్తిగా చదివి ఆలూ ఫ్రై చేసుకోండి.
ఆలూ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు
బంగాళాదుంపలు - 4-5
ఎండు మిర్చి - 6
వెల్లుల్లి రెబ్బలు - 2-3
ఉల్లిపాయ - 1
కారం పొడి - 1/2 టీస్పూన్
కొత్తిమీర
ఉప్పు - రుచికి తగినంత
నూనె - వేయించుకోవడానికి తగినంత

ఆలూ ఫ్రై తయారీ విధానం
బంగాళాదుంపలు శుభ్రంగా కడిగి, తొక్కలు తీసి చిన్న చిన్న ముక్కలుగా కోసి, నీటిలో కొద్ది సేపు నానబెట్టి, తరువాత నీరు పోసి తుడుచుకోవాలి. ఇలా చేయడం వల్ల బంగాళాదుంపలు కారకరలాడుతాయి.
ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఫ్రై చేయడానికి సరిపడా నూనె పోసుకోవాలి. ఆ తరువాత అందులో బంగాళా దుంపలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బంగాళా దుంపలు లేత బంగారు రంగులోకి మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తరువాత బంగాళదుంపలను తీసుకొని ఓ గిన్నెలోకి వేసుకోవాలి.
ఆ తరువాత అదే కడాయిలో కొద్దిగా నూనె వేసి అందులో వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలను వేసి వేగించాలి. ఉల్లిపాయలు బంగారు రంగులోకి మారిన తర్వాత కారం పొడి, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలపాలి. కావాలనుకుంటే కొంచెం మసాలా, ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. ఇది అదనపు రుచిని జోడిస్తాయి. కానీ పిల్లలు మసాలాలు ఇష్టపడరు కాబట్టి వేసుకోవడం వేసుకోకపోవడం మీ ఇష్టం. ఆ తరువాత ఆ ఫ్రైని ఒక బాక్సులో పెట్టి పిల్లకు ఇస్తే ఎంతో ఇష్టంగా తినేస్తారు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications