Latest Updates
-
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
రుచికరమైన చాక్లెట్ బనానా మిల్క్ షేక్.. ఎలా చేసుకోవాలో చూడండి
చలికాలం ప్రారంభం అయిన వెంటనే మనం తినే ఆహారం, తాగే డ్రింక్స్ లో మార్పు మొదలవుతుంది. శీతాకాలంలో మార్కెట్ లో కి అనేక కూరగాయలు వస్తుంటాయి. ఇవి ఆహార రుచిని పెంచుతాయి. వింటర్ సీజన్ లో దగ్గు, జలుబు సహా అనేక వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. హెల్తీ ఫుడ్స్, హెల్తీ డ్రింక్స్ తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది.
చాక్లెట్, అరటిపండు కలయిక చాలా బాగుంటుంది. ఈ రెండు మిక్స్ అయితే అద్భుతమైన టేస్ట్ వస్తుంది. చాక్లెట్ మిల్క్‌షేక్‌లో అరటిపండును యాడ్ చేసినప్పుడు ఆ డ్రింక్ సాధారణ చాక్లెట్ మిల్క్‌షేక్ కంటే తియ్యగా క్రీమీగా మారుతుంది. చాలా మంది తదుపరి భోజనానికి ముందు తీసుకునే ముఖ్యమైన ఆరోగ్యకరమైన డ్రింక్ ఇది. చాక్లెట్ బనానా షేక్ తయారుచేయడం చాలా సింపుల్. దీన్ని నిమిషాలల్లోనే చేసుకొని ఆస్వాదించవచ్చు. కాబట్టి చాక్లెట్ మిల్క్ షేక్ తయారీకి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.

చాక్లెట్ బనానా మిల్క్ షేక్ తయారీకి
కావల్సినవి
అరటిపండు-1
సాధారణ సైజు చాక్లెట్ బార్-1
చక్కెర-రుచికి తగినంత
పాలు-సాధారణ గాజు గ్లాజు నిండా
చాక్లెట్ బనానా మిల్క్ షేక్ తయారీ విధానం
-ముందుగా శుభ్రమైన వేళ్లు లేదా ఫోర్క్ ఉపయోగించి అరటిపండ్లను
బ్లెండర్లో వేసి కలపండి. ఇది మెత్తగా అయ్యే వరకు,దానిలో
ఎటువంటి ముద్దలు లేకుండా మెత్తగా చేయాలి.
-మైక్రోవేవ్‌లో చాక్లెట్ సన్నగా అయ్యే వరకు కరిగించండి.
తర్వాత అరటిపండు గుజ్జుతో కలపాలి.
-అరటిపండు,చాక్లెట్ మిశ్రమానికి చక్కెర కలపండి. చక్కెర పరిమాణం మీరు
ఎంత తీపి తినాలనుకుంటున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది.
-తర్వాత మిశ్రమం నురుగు వచ్చేవరకు పాలు వేయాలి.
-మిశ్రమం పైన ఐస్, విప్డ్ క్రీమ్ లేదా మీకు నచ్చిన ఏదైనా వేసుకోని
తాగితే సూపర్ అనాల్సిందే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
