Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
స్వీట్ షాప్ స్టైల్లో డైమండ్ చిప్స్‌ను ఇలా ఎప్పుడైనా చేసుకున్నారా..?
స్వీట్ షాఫులో డైమండ్ చిప్స్ ను చూడగానే తినకుండా వుండలేము. టేస్టు చూడ్డానికైనా ఎంతా అని అడిగి కొన్నింటిని నోట్లో వేసుకుంటాము. ఇక వీటిని టైం పాస్‌గా తింటూ వుంటే ఎంత తింటున్నామనే ధ్యాస కూడా వుండదు. ఎంత తిన్నా కడుపు కూడా నిండదు. తింటూనే వుంటాం. డైమండ్ చిప్స్ టేస్టు అంతా ఒకేలా వుంటుంది. వర్షం పడ్డప్పుడు వీటిని ఇంట్లో చేసుకొని తింటే అప్పుడు కలిగి అనుభూతిని మాటల్లో వివరించలేము. అలాంటి డైమండ్ చిప్స్‌ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో మీకు అందిస్తున్నాం. చాలా సులభంగా, ఇంట్లో వున్న వంట సామాగ్రితోనే ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం.

డైమండ్ చిప్స్ కోసం కావాల్సిన పదార్ధాలు
నెయ్యి, మంచి నూనె
1 కప్పు మైదా పిండి
గోదుమ పిండి
2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి
ఉప్పు
1 టీ స్పూన్ అజ్వైన్

డైమండ్ చిప్స్‌ను ఎలా తయారు చేసుకోవాలి
1. కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి, నెయ్యి లేకపోతే
రిఫైన్డ్ ఆయిల్‌ను పోసుకోవాలి.
2. మిక్సింగ్ బౌల్‌లో 1 కప్పు మైదా పిండిని తీసుకోవాలి,
గోదుమ పిండిని అయినా తీసుకోవచ్చు.
3. 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని అయినా వేసుకోవాలి.
4. రుచికి సరిపడ ఉప్పును, 1 టీ స్పూన్ అజ్వైన్‌ను చేతిలో
నలిపి బౌల్‌లో వేసుకోవాలి.
5. పిండిలో వేడి వేడి నెయ్యిని వేసుకొని బాగా కలుపుకోవాలి.
6. చెపాతీ పిండి కలుపుకున్నట్లుగా కలుపుకోవాలి.
7. సెమీ సాఫ్ట్‌గా పిండిని కలపాలి.
8. కొంత పిండి ముద్దను తీసుకొని సన్నగా చెపాతీగా రోల్ చేసుకోవాలి.
9. పొడిపిండిని చల్లుకోవాలి.
10. డైమండ్ షేపు రావడానికి పొడువుగా, అడ్డంగా కట్ చేసుకోవాలి.
11. డైమండ్ వచ్చే విధంగా కట్ చేసుకున్న తరువాత కడాయిలో నూనెను వేడి
చేయాలి.
12. నూనె వేడయిన తరువాత అందులో డైమండ్ చిప్స్ వేసి వేయించాలి. కొన్ని
కొన్ని డైమండ్ చిప్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
13. మీడియం ఫ్లేమ్‌లో వచ్చేంత వరకు వీటిని ఫ్రై
చేసుకోవాలి.
14. డైమండ్ చిప్స్‌ను ఆయిల్ లోంచి బయటకు
తీసుకోవాలి.
15. ఫ్రై అయిన వీటిని ఒక డబ్బాలో వేసుకోవాలి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications