Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
రెస్టారెంట్ స్టైల్ డ్రాగన్ చికెన్.. రుచి చూస్తే అస్సలు వదలరు!
రొటీన్ చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై లేదా బిర్యానీ తిని బోర్ కొట్టిందా? ఏదైనా కొత్తగా, రెస్టారెంట్ రుచితో వండాలని అనుకుంటున్నారా? అయితే డ్రాగన్ చికెన్ ట్రై చేయండి.
బయట రెస్టారెంట్లలో దొరికే క్రిస్పీ, స్పైసీ డ్రాగన్ చికెన్ ను అంతే రుచితో, అంతకంటే ఎక్కువ ఆరోగ్యకరంగా మన ఇంట్లోనే చాలా తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు. దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
బోన్ లెస్ చికెన్ : 400 గ్రాములు
గుడ్డులోని తెల్లసొన: 1
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టీస్పూన్
మొక్కజొన్న పిండి: 1 టేబుల్ స్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 2 టేబుల్ స్పూన్లు
జీడిపప్పు: 20
ఉల్లిపాయ: 1
వెల్లుల్లి రెబ్బలు: 10
అల్లం: అర అంగుళం ముక్క
పచ్చిమిర్చి: 1
చిల్లీ గార్లిక్ పేస్ట్: 1 టేబుల్ స్పూన్
సోయా సాస్: 1 టీస్పూన్
టమాటో సాస్: 1 టేబుల్ స్పూన్
ఉల్లికాడలు: గార్నిష్ కోసం కొద్దిగా
తయారీ విధానం
-ముందుగా బోన్ లెస్ చికెన్ ను ఉప్పు, నిమ్మరసం లేదా పసుపు వేసిన నీటిలో శుభ్రంగా కడగాలి. నీరు పూర్తిగా వారిపోయిన తర్వాత చికెన్ ను ఒక గిన్నెలోకి తీసుకోండి.
-ఇప్పుడు కడిగిన చికెన్ లో ఒక గుడ్డులోని తెల్లసొన, ఒక టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ మొక్కజొన్న పిండి, రుచికి సరిపడా ఉప్పు వేయాలి. ఈ మిశ్రమం అంతా చికెన్ ముక్కలకు బాగా పట్టేలా కలిపి 10-15 నిమిషాలు పక్కన పెట్టండి
-స్టవ్ వెలిగించి ఒక వెడల్పాటి పాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేయండి. నూనె వేడెక్కాక, జీడిపప్పు వేసి దోరగా, బంగారు రంగు వచ్చేవరకు వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు అదే నూనెలో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేయాలి. మంటను మీడియం నుండి హై ఫ్లేమ్ లో ఉంచి, చికెన్ ముక్కలను రెండు వైపులా ఒక్కో నిమిషం పాటు లేదా ముక్కలు రంగు మారి ఉడికేంత వరకు సుమారు 2-3 నిమిషాలు వేయించి పక్కన పెట్టుకోవాలి.
-అదే పాన్ లో సన్నగా తరిగిన వెల్లుల్లి, అల్లం, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించాలి. రుచికి సరిపడా కొద్దిగా ఉప్పు వేసుకోండి.
-ఉల్లిపాయలు వేగిన తర్వాత, అందులో 1 టేబుల్ స్పూన్ చిల్లీ గార్లిక్ పేస్ట్ వేసి కలపాలి. ఆ తర్వాత సోయా సాస్, టమాటో సాస్ వేసి ఒక నిమిషం పాటు బాగా వేయించాలి. ఇది గ్రేవీలా దగ్గరకు వస్తుంది.
-ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలు,జీడిపప్పును ఈ సాస్ మిశ్రమంలో వేయాలి. మంటను హై ఫ్లేమ్ లో ఉంచి, సాస్ అంతా ముక్కలకు పట్టేలా 2 నిమిషాల పాటు కలపాలి.
-చివరగా సన్నగా తరిగిన ఉల్లికాడలను చల్లి, స్టవ్ ఆఫ్ చేయండి. అంతే డ్రాగన్ చికెన్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications