Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మన పూర్వీకులు ఒట్టి తునకల మటన్ కూర ఇలా చేసుకునేవారట,అందుకే వారి ఎముకలు ధృడంగా ఉంటాయి
మన ఇంట్లో తెచ్చుకున్న మటన్ మిగిలిపోతే ఇప్పుడు పడేస్తున్నాం. కానీ మన పూర్వికులు వాటితో అద్భుతమైన వంటలు చేసుకునే వారు. వాటిలో ఒకటే ఒట్టి తునకలు కూర. ఒకవేళ మీరు 90's కిడ్స్ అయితే మీకు ఇది కచ్చితంగా తెలిసే ఉంటుంది. ఏదైనా పండగప్పుడు ఏటపోతును కొస్తే మటన్ మిగిలితే వాటిని ఎండబెట్టుకొని, కావాల్సినప్పుడల్లా వీటిని తినేవారు. సుమారు నెల, రెండు నెలల వరకు ఇవి మనకు అందుబాటులోకి ఉండేవి. అయితే ఈ స్టోరీలో ఒట్టి తునకల కూర ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది తెలుసుకుందాం.
ఒట్టి తునకల కూర తయారీకి కావాల్సిన పదార్థాలు
పసుపు పూసి ఎండబెట్టిన మటన్ ముక్కలు
ఉల్లిపాయలు
టమాటో
అల్లం వెల్లుల్లి పేస్ట్
రుచికి సరిపడా ఉప్పు
మూడు స్పూన్ల నూనె
గరం మసాలా
ధనియాల పొడి
కారం
పసుపు
సరిపడా నీళ్లు
కొత్తిమీర

ఒట్టి తునకలు కూర తయారీ విధానం
ఈ కూరను తయారు చేసుకోవడానికి ఒక గంట ముందుగానే.. ఎండబెట్టిన మటన్ ముక్కలను నానబెట్టుకోవాలి. మటన్ ముక్కలు నానిన తరువాత అందులోని నీళ్లు ఒంపేసి ఈ కూరను తయారుచేసుకోవాలి.
ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో మూడు చెంచాల నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. అవి లేత గోధుమ రంగులోకి మారిన తరువాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసనా పోయిన తరువాత అందులో నానబెట్టుకున్న మటన్ వేసుకొని కలుపుకోవాలి.
ఆ తరువాత మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. అనంతరం అందులో టమాటో ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. దీంతో పాటు రుచికిసరిపడా కారం, చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. అలాగే ముక్కలు ఉడికేందుకు సరిపడా నీళ్లు వేసుకొని ఒక 15 నిమిషాల పాటు బాగా ఉదానివ్వాలి. అనంతరం మూత తీసి కొత్తిమీర చల్లుకొని ఇంకో 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఎంతో రుచికరమైన ఒట్టి తునకలు మటన్ కూర సిద్ధమైనట్లే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications