Latest Updates
-
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు!
Egg Chat Recipe: ఆరోగ్యానికి మేలు చేసే గుడ్డు చాట్.. సింపుల్‌గా ఎలా చేసుకోవాలంటే?
బాగా ఆకలైనప్పుడు వేగంగా చేసుకుని తినగలిగే ఆహరం ఏదైనా ఉందంటే అది స్నాక్స్ మాత్రమే. ఎలాంటి స్నాక్స్నైనా వేగంగా సులభంగా ఇంట్లోనే చేసుకోవచ్చు. వాటిలో గుడ్డుతో చేసే స్నాక్స్ అయితే ఇంకా అద్భుతంగా ఉంటాయి. గుడ్డుతో చేసే వంటకమైన రుచికరంగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.
అయితే గుడ్డుతో చేసే అద్భుతమైన స్నాక్స్‌లో ఒకటి ఎగ్ చాట్. ఇది చాలా ఫేమస్ అలాగే చాలా రుచికరంగా ఉంటుంది. ఈ ఎగ్ చాట్ చేసుకోవడం చాలా సులభం. నిమిషాల వ్యవధిలోనే ఈ ఎగ్ చాట్ తయారు చేసుకోవచ్చు. అయితే ఈ ఎగ్ చాట్ ఎలా చేసుకోవాలి? ఎగ్ చాట్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? వాటితో ఏ విధమైన ప్రయోజనాలు చేకూరతాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ముందుగా ఎగ్ చాట్ తయారీకి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం..
- నాలుగు ఉడికించిన గుడ్లు
- సన్నగా తరిగిన ఉల్లిపాయలు
- రెండు టొమాటోలు
- రెండు పచ్చిమిర్చి
- పెరుగు
- వెల్లుల్లి
- కొద్దిగా కొత్తిమీర తరుగు
- పుదీనా ఆకులు
- కొద్దిగా నిమ్మరసం
- రుచికి సరిపడా ఉప్పు
- రుచికి సరిపడా చాట్ మసాలా
ఎగ్ చాట్ తయారీ విధానం..
- ఈ ఎగ్ చాట్ తయారు చేసుకోవడానికి ముందుగా నాలుగు గుడ్లు తీసుకోని ఉడకబెట్టుకోవాలి. వాటిని చల్లటి నీటిలో పెట్టి.. కూల్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఆ గుడ్లపై ఉండే పొరను తీసుకోవాలి. అలాగే గుడ్లను సమాంతరమైన నాలుగు ముక్కలుగా చేసుకోవాలి.
- ఇప్పుడు ఒక మిక్సీ జార్లో పుదీనా ఆకులు, కొత్తిమీర, ఉల్లిపాయ, అల్లం, ఒక చిన్న చెక్క నిమ్మరసం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. అందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఒక తిప్పు తిప్పి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలోనే కొద్దిగా పెరుగు, కొంచెం చాట్ మసాలా వేసి ఒక తిప్పు తిప్పి ఒక బౌల్లో తీసుకోవాలి.
- ఇప్పుడు ముందుగా కోసి పెట్టుకున్న గుడ్డు ముక్కలను ఒక ప్లేట్లో తీసుకోవాలి. వాటిపైన మనం రుబ్బుకొని పెట్టుకున్న పుదీనా చట్నీ, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన టమాటో ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర చల్లుకోవాలి. చివరగా కొంచెం నిమ్మరసం పిండుకొని వాటిపైన చాట్ మసాలా వేసుకుంటే సరిపోతుంది.. ఎగ్ చాట్ సిద్ధమైపోయినట్లే. దీన్ని ఆస్వాదించడమే తరువాయి.
ఎగ్ చాట్‌తో ఆరోగ్య ప్రయోజనాలు..
గుడ్డు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ప్రతిరోజూ గుడ్డు తినడం వల్ల శరీరానికి కావాల్సిన ప్రోటీన్, క్యాల్షియం వంటివి అందుతాయి. ఇది శరీర మరమ్మత్తుకు, కండరాల నిర్మాణానికి ఎంతగానో సహాయపడుతుంది. గుడ్డులోని ప్రోటీన్, శరీరానికి మంచి చేసే కొవ్వు పదార్థాలు.. మన బాడీకి కావాల్సిన ఎనర్జీని అందిస్తాయి. గుడ్డులో విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. అందులో విటమిన్-A, D, E, K శరీరానికి కావాల్సిన పోషకాలన్నిటినీ అందిస్తాయి. గుడ్డు చాట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు లభిస్తాయి. అందుకే ఈ రెసిపీని ట్రై చేయడం మర్చిపోకండి.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలు పలు అధ్యయనాలు, ఇంటర్నెట్లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటి శాస్త్రీయతను మేము నిర్ధారించడం లేదు. వీటిని పాటించే ముందు తప్పనిసరిగా నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications